Baldness : ప్రస్తుతం పురుషులు ఎదుర్కొంటున్న సమస్యలలో బట్టతల సమస్య కూడా ఒకటి అని చెప్పచ్చు. ఈ సమస్య వంశపారంపర్యం గా కూడా వస్తుంది అన్న విషయం అందరికి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా వంశపారంపర్యంగా వస్తున్న బట్టతల చాలామందిని వేధిస్తున్న సమస్య. ఈ సమస్య నుంచి బయట పాడటానికి ఇప్పటికే శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేసారు. దీనికి శాశ్వత పరిష్కారం కోసం శాస్త్రవేత్తలు గత కొన్ని ఏళ్ళ నుంచి పరిశోధనలు చేపట్టారు. ఇక ఈ క్రమంలోనే యూకే కి చెందిన షఫీల్డ్ పాకిస్తాన్ కు చెందిన కామ్స్ టాస్ యూనివర్సిటీల శాస్త్రవేత్తలు ఒక సంచలన ఆవిష్కరణ చేపట్టడం జరిగింది. డీఆక్సీరైబోస్ అనే సహజ చక్కెరతో వంశపారంపర్యంగా వస్తున్న ఈ బట్టతలకు చెక్ పెట్టవచ్చని శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలో కనుగొన్నారు. ఈ సహజమైన చక్కర మానవ శరీరం లోనే ఉంటుంది. డిఎన్ఏ నిర్మాణంలో అతి ముఖ్య పాత్ర వహించే ఈ చక్కెర మన శరీరంలోనే ఉంటుంది. డీఆక్సీరైబోస్ ప్రభావం ఎలుకల చర్మ గాయాలపై ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసిన క్రమంలో ఈ కొత్త ఆవిష్కరణ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ ప్రయోగంలో ఎలుకల గాయాలు త్వరగా మానడమే కాకుండా ఆ ప్రదేశంలో వెంట్రుకలు ఒత్తుగా పెరగడం చూసి శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోయారు. దీంతో ఈ డీఆక్సీరైబోస్ అనే సహజ చక్కెర జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుందా అనే కోణంలో శాస్త్రవేత్తలు పరిశోధనలు మొదలుపెట్టారు.
ఊహించిన దానికంటే ఫలితం అద్భుతంగా వచ్చిందని తెలిపారు. మనమందరం ప్రస్తుతం వాడుతున్న మినాక్సిడిల్ అనే సహజ ఔషధం లాగానే డీఆక్సీరైబోస్ అనే సహజ చక్కర చాల సమర్థవంతంగా పనిచేస్తుంది అని ఇటీవల జూన్ నెలలో జరిగిన అధ్యయనంలో తేలింది. దీంతో ఈ చక్కెర జుట్టు కుదుళ్లకు రక్త ప్రవాహాన్ని బాగా అందించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహించేలా చేస్తుంది. యూనివర్సిటీ కి చెందిన ప్రొఫెసర్ షీలా మాక్ నీల్ పురుషుల్లో వచ్చే బట్టతల చాలా సాధారణమైన సమస్య అని పేర్కొన్నారు. అయితే ఈ సమస్యకు ప్రస్తుతం ఎఫ్డిఏ ఆమోదించిన చికిత్సలు రెండే ఉన్నాయి. డీఆక్సీరైబోస్ అనే సహజ చక్కెర జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణను బాగా పెంచి జుట్టు పెరగడానికి బాగా సహాయపడుతుందని పరిశోధనలో తేలిందని ఆమె చెప్పుకొచ్చారు.
ఇది చాలా సులభమైన మరియు సహజమైన పద్ధతి అని పరిశోధనలో తేలింది. ప్రారంభ దశలోనే ఈ పరిశోధన ఉన్నప్పటికీ ఫలితాలు మాత్రం చాలా ఆశాజనకంగా ఉన్నాయని ఆనందం వ్యక్తం చేసారు. డీఆక్సీరైబోస్ అనే చక్కెర స్థిరమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన చక్కెర అని దీనిని మనము జెల్స్ లేదా డ్రెస్సింగ్ ల రూపంలో సులభంగా ఉపయోగించుకోవచ్చని కామ్స్ టాస్ యూనివర్సిటీ కి చెందిన ప్రొఫెసర్ మహమ్మద్ యార్ తెలిపారు. జుట్టు రాలడానికి చికిత్స కోసం ఇది చాలా అనుకూలమైన మరియు తక్కువ ఖర్చుతో కూడుకున్న ఎంపిక అవుతుందని మొహమ్మద్ చెప్పుకొచ్చారు. బట్టతల సమస్య కు ఇది బాగా పని చేస్తుంది అని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు.