Elon Musk Space X : నింగిలోకి.. ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ మరో ప్రయోగం.. ఈసారి టార్గెట్ ఏంటంటే?

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు టెస్లా, ట్విట్టర్ ఎక్స్ మాత్రమే కాకుండా.. స్పేస్ ఎక్స్ పేరుతో శాటిలైట్ లాంచింగ్ స్టేషన్ కూడా ఉంది. ఈ సంస్థ ఉపగ్రహాలను రూపొందించి.. మస్క్ వ్యాపార లక్ష్యాలకు అనుగుణంగా అంతరిక్షంలోకి ప్రవేశపెడుతుంది. అయితే ఈ సంస్థ మరో ప్రయోగాన్ని చేపట్టింది.

Written By: Anabothula Bhaskar, Updated On : October 13, 2024 9:32 pm

Elon Musk Space X

Follow us on

Elon Musk Space X :  ఇటీవల ఇంటర్నెట్ ఆధారిత కార్యకలాపాల కోసం స్పేస్ ఎక్స్ రెండు ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. ఆ ప్రయోగం విజయవంతమైంది. దాన్ని మర్చిపోకముందే స్పేస్ సెక్స్ మరో ప్రయోగాన్ని చేపట్టింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్టార్ షిప్ -5 ప్రయోగం విజయవంతమైంది. ఇప్పటికే ఈ ప్రయోగంలో నాలుగు దశలను స్పేస్ ఎక్స్ నింగిలోకి పంపించింది. ఆదివారం అమెరికాలోని టెక్సాస్ దక్షిణ తీరం నుంచి స్పేస్ స్టేషన్ మీదుగా ఈ రాకెట్ నింగిలోకి దూసుకుపోయింది. ఈ రాకెట్ లో బూస్టర్, స్పేస్ క్రాఫ్ట్ అనే రెండు దశలు ఉన్నాయి. అత్యంత భారీగా ఉన్న ఈ రాకెట్ లో ముందుగా బూస్టర్ విజయవంతంగా నేలపైకి చేరుకుంది. అయితే అది లాంచ్ ప్యాడ్ వద్దకే చేరుకోవడం గమనార్హం. స్పేస్ క్రాఫ్ట్ తన ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగించి.. హిందూ మహాసముద్రంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగింది. బూస్టర్ దాదాపు 71 మీటర్ల పొడవు ఉంది. ఇది నింగిలోకి వెళ్లిన కొంత సమయానికే లాంచ్ ప్యాడ్ వద్దకు చేరుకుంది. అక్కడ ఉన్న చాప్ స్టిక్ లు దానిని జాగ్రత్తగా పట్టుకున్నాయి. అయితే ఇలా రూపొందించడం స్పేస్ ఎక్స్ కంపెనీకి మాత్రమే సాధ్యమని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను మస్క్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. స్పేస్ క్రాఫ్ట్ అత్యంత కచ్చితంగా.. నిర్దేశించిన ప్రాంతంలోనే ల్యాండ్ అయిందని వివరించారు. ఈ ప్రయోగం ద్వారా తాము నిర్దేశించుకున్న లక్ష్యాలు పూర్తయ్యాయని ఆయన వివరించారు.. ఇంటర్నెట్ ఆధారిత సేవల్లో మరింత కచ్చితత్వం, భూమిలో చోటు చేసుకునే మార్పులను తెలుసుకునేందుకు ఈ ప్రయోగాలను చేపట్టినట్టు స్పేస్ ఎక్స్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ ప్రయోగం విజయవంతం కావడంతో స్పేస్ ఎక్స్ కంట్రోల్ రూమ్ లో సందడి వాతావరణం ఏర్పడింది.

భారీగా రూపొందించారు

స్టార్ షిప్ రాకెట్ ను భారీగా రూపొందించారు. దీనిని బాహుబలి గా స్పేస్ ఎక్స్ వర్గాలు పేర్కొంటున్నాయి. రాకెట్ పొడవు ఏకంగా 121 మీటర్లు. బూస్టర్, స్పేస్ క్రాఫ్ట్ తో అతిపెద్ద రాకెట్ గా దీనిని రూపొందించారు. భవిష్యత్తు కాలంలో చందమామ, అంగారక గ్రహాలపై యాత్రలు చేసేందుకు వీలుగా దీనిని రూపొందించామని స్పేస్ ఎక్స్ వర్గాలు చెబుతున్నాయి.. ఫ్లోరిడా లేకుంటే కాలిఫోర్నియా నుంచి భూ కక్ష్య లోకి శాటిలైట్లను చేరవేయడానికి, ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కు సిబ్బందిని తరలించే ఫాల్కన్ -9 రాకెట్ల మొదటి దశ బూస్టర్లు కూడా భూమి పైకి చేరుకుంటాయి. అయితే ఇవి లాంచ్ ప్యాడ్ కు అత్యంత దూరంగా ఉండే కాంక్రీట్ స్లాబ్ పై ల్యాండ్ అవుతాయి. అయితే దీనిని సముద్రంపై తెలియాడే ఫ్లాట్ ఫామ్ లాగా రూపొందించారు. ఈ బూస్టర్లు లాంచ్ ప్యాడ్ వద్దకు చేరుకోవడం ఇదే తొలిసారి.