Coconut : తక్కువ రోజుల్లో ఎక్కువ దిగుబడి.. ఈ రకం కొబ్బరి కోసం ఎగబడుతున్నారు

కేరళ నుంచి వచ్చిన కొబ్బరి మొక్కలు ఎక్కువ దిగుబడిస్తున్నాయట. తక్కువ టైంలోనే పంట చేతికి వస్తుందట. కొబ్బరి మొక్క గెలకు వచ్చినప్పటికీ 20 బోండాలు వస్తున్నాయని, కేరళ మొక్కల్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నామని తెలుపుతున్నారు రైతులు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రైతులు.. జంగారెడ్డిగూడెంలో ప్రకృతి నర్సరీ వారు కేరళ నుంచి కొబ్బరి మొక్కల్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నారు.

Written By: Swathi Chilukuri, Updated On : October 13, 2024 9:43 pm

Coconuts

Follow us on

Coconut :  కొబ్బరి తోటల టాపిక్ వస్తే ముందుగా పశ్చిమ గోదావరి జిల్లా గుర్తు వస్తుంది. ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. కొబ్బరి తోటలు వేయడానికి అనేక రకరకాలైన మొక్కల్ని ఉపయోగిస్తుంటారు రైతులు. అందులో ఎక్కువగా ఈ కొబ్బరి సాగు చేస్తుంటారు. కొబ్బరి తోటలని ఎక్కువ దిగుబడి వచ్చే మాదిరి పెంచుతారు. ఈ మధ్యకాలంలో కొబ్బరి మొక్కల్ని కేరళ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు నర్సరీ యాజమాన్యాలు.

ఎందుకంటే కేరళ నుంచి వచ్చిన కొబ్బరి మొక్కలు ఎక్కువ దిగుబడిస్తున్నాయట. తక్కువ టైంలోనే పంట చేతికి వస్తుందట. కొబ్బరి మొక్క గెలకు వచ్చినప్పటికీ 20 బోండాలు వస్తున్నాయని, కేరళ మొక్కల్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నామని తెలుపుతున్నారు రైతులు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రైతులు.. జంగారెడ్డిగూడెంలో ప్రకృతి నర్సరీ వారు కేరళ నుంచి కొబ్బరి మొక్కల్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నారు.

ఇందులో వచ్చేటప్పటికి రామగంగా, ఈస్ట్ కోస్ట్, మలేషియా దర్పం, గంగ భవాని అనేక రకాలని కేరళ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు నర్సరీ యాజమాన్యాలు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే కేరళ నుంచి రామ గంగా అనే కొబ్బరి మొక్కల్ని ఎక్కువ దిగుమతి చేసుకుంటున్నారు నర్సరీ యాజమాన్యాలు. ఈ రామ గంగా కొబ్బరి మొక్కలను సొంత తోటలో వేసుకొని వచ్చిన కొబ్బరి బోండాలను తీసుకొచ్చి మళ్లీ మొక్కలుగా ఉత్పత్తి చేస్తున్నారు.

రామ గంగా అనే కేరళ మొక్క మూడు సంవత్సరాల మూడు నెలలకి పూత కాయలు వస్తాయట. ఇక ఆ తర్వాత నాలుగు సంవత్సరాలకే కాయలు కాస్తాయని చెబుతున్నారు నర్సరీ యాజమాన్యాలు. ఈ రామ గంగా దాదాపుగా 50 సంవత్సరాలు వరకు కాపు వస్తుంటుందని అంటున్నారు కొందరు రైతులు. రామగంగా ఎక్కువ సాగు చేయడం వల్ల అధిక లాభాలు కూడా పొందుతున్నారు రైతులు. అలాగే పెట్టుబడి కూడా తక్కువ అవుతుందని అంటున్నారు.

దీనికి సేంద్రియ ఎరువులని, గొర్రె పెట్టికలు గాని ఎరువులుగా ఉపయోగిస్తే ఎక్కువ లాభాలు పొందవచ్చని చెబుతున్నారు. ఈ కాయల నుంచి వచ్చే కొబ్బరినీళ్లు దాదాపుగా రెండు లీటర్ల వరకు ఉంటాయని చెబుతున్నారు. సొంతంగా వాళ్ళ తోటలో వేసుకున్న చెట్ల బోండాల నుంచి మళ్లీ మొక్కలు తయారుచేసి వాటిని రైతులకి విక్రయిస్తున్నారు నర్సరీ యాజమాన్యాలు.

పశ్చిమగోదావరి జిల్లా నర్సరీలో టిఎన్టియు అనే కొబ్బరి మొక్కలు ఎక్కువగానే లభిస్తాయి. ఈ మొక్కలు అక్కడ రైతులకు అందుబాటులో ఉండటంతో టెన్షన్ పడటం లేదు రైతులు. ఈ మొక్కలు వచ్చి నాలుగు సంవత్సరాల తర్వాత కాపు కాస్తాయి. ఇది 30 సంవత్సరాల వరకే కాపుగాస్తుందని, దీనివల్ల కూడా రైతులకు లాభాలు పొందారని చెబుతున్నారు. ఏదేమైనా పశ్చిమగోదావరి జిల్లా రైతులు నాటు కొబ్బరి మొక్కలు కాకుండా కేరళ నుంచి కొబ్బరి మొక్కలను దిగుమతి చేసుకొని అధిక లాభాలు పొందుతున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు రైతులు.