https://oktelugu.com/

Elon Musk: అమెరికా అధ్యక్ష ఎన్నికలపై బాంబు పేల్చిన ఎలాన్‌ మస్క్‌

ఎలాన్‌ మస్క్‌ ఈవీఎంల హ్యాకింగ్‌పై ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను వాడకుండా ఉండడం ద్వారా హ్యాకింగ్‌ నివారించవచ్చని పేర్కొన్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : June 16, 2024 2:19 pm
    Elon Musk

    Elon Musk

    Follow us on

    Elon Musk: ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌(ఈవీఎం)లపై భారత దేశంలో ఏళ్లుగా కాంట్రవర్సీ కొనసాగుతోంది. ఎన్నికల్లో ఓడిన పార్టీలు ఈవీఎంలపై ఆరోపణలు చేయడం కామన్‌ అయింది. ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేశారు. ఈవీఎంల కారణంగానే ఎదుటి పార్టీ గెలిచింది అని విమర్శలు చేస్తున్నారు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత కూడా ఏపీలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ఈవీఎంలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించొద్దని సూచించారు.

    హ్యాకింగ్‌పై ఆందోళన..
    ఎలాన్‌ మస్క్‌ ఈవీఎంల హ్యాకింగ్‌పై ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను వాడకుండా ఉండడం ద్వారా హ్యాకింగ్‌ నివారించవచ్చని పేర్కొన్నారు. అమెరికా నియంత్రణలోని ప్యూర్టోరికోలో ఇటీవల నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. అక్కడ ఈవీఎంలు హ్యాక్‌ అయ్యాయన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలంటి తరుణంలో మస్క్‌ ఈవీఎంలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పడు సంచలనంగా మారాయి.

    ఏఐతో హ్యాక్‌..
    ఈవీఎంలను ఎన్నికల్లో వినియోగించకుండా ఉండాలని సూచించారు. ఈవీఎంలను మనుషులు లేదా ఏఐ టెక్నాలజీ సాయంతో హ్యాక్‌ చేసే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఇది దేశానికి నష్టం కలిగిస్తుందని వెల్లడించారు. ప్యూర్టోరికోలో ఇటీవల తలెత్తిన ఎన్నికల వివాదాల కరాణంగా అక్కడి అధికారులు ఈవీఎంల భద్రతపై దృష్టిసారించారు.

    అమెరికా మాజీ అధ్యక్షుడి బంధువు కూడా..
    ఇక అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌ కెన్నెడీ సమీప బంధువు రాబర్ట్‌ ఎఫ్‌ కెన్నెడీ జూనియర్‌ కూడా హ్యాకింగ్‌పై స్పందించారు. ప్యూర్టోరికోలో నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో ఈవీఎంల అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. పేపర్‌ ట్రయల్‌ ఉంది కాబట్టి సమస్యను గుర్తించామని తెలిపారు. లేదంటే ఏం జరిగేదో అని పేర్కొన్నారు. ఈ సమస్యను నివారించడానికి పేపర్‌ బ్యాలెట్‌లను తిరిగి తీసుకురావాలని కోరారు.