https://oktelugu.com/

అల్కహాల్ తో ఈ వ్యాధులు కూడా క్యూ కడుతాయి..

అల్కహాల్ పై కొందరికి ఇష్టం ఉంటే మరికొందరు బానిస అయిపోతారు. రోజుకు ఒక్క పెగ్గు లేనిదే నిద్రకు జారుకోని వారు ఎందరో ఉన్నారు. అల్కహాల్ ప్రతిరోజూ తీసుకోవడం అనర్థమే అని వైద్యులు హెచ్చరిస్తున్నా.. చాలా మంది పట్టించుకోవడం లేదు. ఒక్క పెగ్గు అనుకుంటూనే ఫుల్లుగా తాగేస్తున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : June 16, 2024 / 02:15 PM IST

    effect-of-alcholo-do-​​you-drink-alcohol-do-not-eat-these-foods-even-by-mistake-while-drinking-alcohol

    Follow us on

    అల్కహాల్ పై కొందరికి ఇష్టం ఉంటే మరికొందరు బానిస అయిపోతారు. రోజుకు ఒక్క పెగ్గు లేనిదే నిద్రకు జారుకోని వారు ఎందరో ఉన్నారు. అల్కహాల్ ప్రతిరోజూ తీసుకోవడం అనర్థమే అని వైద్యులు హెచ్చరిస్తున్నా.. చాలా మంది పట్టించుకోవడం లేదు. ఒక్క పెగ్గు అనుకుంటూనే ఫుల్లుగా తాగేస్తున్నారు. ఆల్కహాల్ ను అతిగా తీసుకోవడం వల్ల లివర్ పాడవుతుందన్న తెలుసు. కానీ అతిగా లిక్కర్ సేవించడం వల్ల మరికొన్ని రోగాలు క్యూ కడుతాయి. అవెంటంటే?

    అల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల లివర్ మాత్రమే కాకుండా రక్తం గడ్డకడుతుంది. దీంతో రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడంతో గుండెపై ప్రభావం పడుతుంది. గుండె జబ్బులు ఎక్కువగా రావడానికి ఇది కారణం అవుతుంది. అందువల్ల అల్కహాల్ ను తగ్గించి ఈ ప్రమాదం నుంచి బయటపడండి.

    శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం అవసరం. ఆల్కహాల్ తీసుకునేవారిలో ఇది తక్కువవుతుంది. మద్యం మత్తులో చాలా మంది ఫుడ్ ను అవైడ్ చేసిన కేవలం మద్యాన్ని మాత్రమే సేవిస్తారు. దీంతో రక్తంలో సమస్యలు ఏర్పడి రక్తహీనతకు దారి తీస్తుంది. రక్తహీనత వల్ల ఒక్కోసారి కళ్లు తిరిగి పడిపోవడం వంటివి జరుగుతాయి.

    అమితంగా అల్కహాల్ తీసుకోవడం వల్ల నాడి వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుంది. దీంతో మతిమరుపు ఎక్కువగా వస్తుంది. అలాగే మెదడుకు సంబంధించిన సమస్యలు ఏర్పడి ఒక్కోసారి బ్రెయిన్ స్ట్రోక్ కూడా రావొచ్చు. కొందరిలో డిప్రెషన్ సమస్య వస్తుంది. మరికొందరు మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఇక అల్కహాల్ వల్ల లివర్ కు ఎక్కువగా సమస్యలు వస్తాయి. క్రమంగా కాలేయ కణాలను నాశనం చేస్తాయి. దీంతో జాండీస్ కు దారి తీస్తుంది.