నో డాక్యుమెంటేషన్.. నో షూరిటీ.. రూ.50 వేల లోన్ ఇస్తున్న SBI…అర్హులెవరో తెలుసా?

చిరు వ్యాపారం చేసేవారు తమ బిజినెస్ ను విస్తరించాలనుకుంటారు. ఇందు కోసం ఇతరుల వద్ద అప్పులు చేస్తుంటారు. అయితే వ్యాపారం వృద్ధి కాని సమయంలో వీటికి వడ్డీలు కట్టలేకపోతారు. ఇలాంటి వారికి ఎస్బీఐ బ్యాంకు ‘శిశు ముద్ర’ ద్వారా లోన్ సదుపాయం కల్పిస్తున్నారు.

Written By: Neelambaram, Updated On : June 16, 2024 4:43 pm

Sbi Bank Customers

Follow us on

ప్రస్తుతం కాలంలో ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. వస్తున్న ఆదాయం వీటికి సరిపోవడం లేదు. దీంతో చాలా మంది వ్యక్తిగత రుణాలు తీసుకుంటున్నారు. వ్యక్తిగత, వ్యాపార అవసరాల నిమిత్తం లోన్ కోసం ఆరాటపడుతున్నారు. అయితే లోన్ తీసుకునే వారు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ప్రైవేట్ సంస్థల నుంచి కాకుండా గుర్తింపు ఉన్న వాటి నుంచి రుణం తీసుకోవడం వల్ల సమస్యలు ఉండవు. కానీ కొన్ని బ్యాంకులు లోన్ ఇవ్వాలంటే పలు డాక్యమెంట్లను కోరుతాయి. కానీ ఎస్బీఐ మాత్రం కొందరికి ఎలాంటి డాక్యుమెంటేషన్, షూరిటీ లేకుండా రూ.50 వేల లోన్ ఇస్తోంది. ఎలాగంటే?

చిరు వ్యాపారం చేసేవారు తమ బిజినెస్ ను విస్తరించాలనుకుంటారు. ఇందు కోసం ఇతరుల వద్ద అప్పులు చేస్తుంటారు. అయితే వ్యాపారం వృద్ధి కాని సమయంలో వీటికి వడ్డీలు కట్టలేకపోతారు. ఇలాంటి వారికి ఎస్బీఐ బ్యాంకు ‘శిశు ముద్ర’ ద్వారా లోన్ సదుపాయం కల్పిస్తున్నారు. ఈ పథకం కింద రూ.50వే అందిస్తున్నారు. అంతకంటే ఎక్కువ అంటే రూ.5 లక్షలు కావాలనుకున్న వారికి కిశోర్ ముద్ర ద్వారా అందిస్తారు. రూ.10 లక్షలు కావాలనుకునేవారికి తురుణ్ ముద్ర ద్వారా సౌకర్యం కల్పిస్తారు.

శిశుముద్ర లోన్ పొందాలనుకునేవారికి మినిమం అర్హతలుంటే సరిపోతుంది. భారతీయ పౌరులై ఉండాలి. అతడు నిర్వహించే బ్యాంకు అకౌంట్ 3 సంవత్సాల సీనియారిటీ అయి ఉండాలి. అయితే లోన్ తీసుకునేవారు ఏదో ఒక వ్యాపారం చేసేవారై ఉండాలి. అది చిరు వ్యాపారమైనా సరే. అంతే.. మిగతా ఎలాంటి డాక్యుమెంటేషన్, సూరిటీ లేకుండా లోన్ ఇస్తారు. అయితే తీసుకున్న రుణం మొత్తాన్ని 5 సంవత్సరాలలోపు చెల్లించాలి.

రూ.50 వేల లోన్ కావాలనుకునేవారు ఎస్బీఐ బ్యాంకుకు వెళ్లి సంబంధిత అధికారులను సంప్రదించాలి. వారు మినిమం ప్రాసెస్ చేసి లోన్ ను నిమిషాల్లో అందిస్తారు. ప్రైవేట్ వ్యక్తుల వద్ద వడ్డీలకు తెచ్చి బాధపడే కంటే ఇలా శిశు ముద్ర ద్వారా లోన్ తీసుకోవడం ద్వారా ఎలాంటి సమస్య ఉండదు. ఈలోన్ సదుపాయం కల్పించినందుకు 12 శాతం వడ్డీ రేటును విధిస్తారు.