Ecuador: గ్యాంగ్ స్టర్ల ను మనం ఎక్కువగా సినిమాలోనే చూస్తాం. అడపా దడపా పోలీసులు ఎక్కడైనా దాడులు చేస్తే వార్త పత్రికల్లో చదువుతాం, న్యూస్ చానల్స్ లో వీక్షిస్తాం. కానీ అలాంటిది న్యూస్ ఛానల్ లోకి గ్యాంగ్ స్టర్లు ప్రవేశిస్తే.. లైవ్ న్యూస్ చదువుతున్న ప్రజెంటర్ తలకు తుపాకిని ఎక్కుపెడితే.. అది కూడా 15 నిమిషాల పాటు ప్రసారమైతే.. ప్రస్తుతం ఈ సంఘటన ఈక్వెడార్ రాజధాని గ్వాయాకిల్ లో మంగళవారం జరిగింది. ఇది ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాత్రంగా మారింది.
గ్వాయాకిల్ కేంద్రంగా టిసిటివి అనే న్యూస్ ఛానల్ వార్త ప్రసారాలు చేస్తూ ఉంటుంది.. స్థానికంగా ఈ ఛానల్ కు అక్కడ మంచి పేరు ఉంది. అయితే సాయుధులైన కొందరు దుండగులు ఆ న్యూస్ ఛానల్ స్టూడియోలోకి ప్రవేశించారు. మాస్కులు ధరించి తుపాకులు, డైనమైట్లతో అక్కడికి వచ్చారు. వార్తలు చదువుతున్న వ్యక్తి సహా అక్కడ ఉన్న ఇతర ఉద్యోగులను బెదిరించారు. వారిని నేలపై కూర్చోబెట్టి తలపై తుపాకీ ఎక్కుపెట్టారు. తమ వద్ద తుపాకులు, భారీగా పేలుడు సామాగ్రి ఉన్నాయని, పోలీసులుఎవరు కూడా తమ వద్దకు రా వద్దని బెదిరించారు. ఈ విషయాన్ని కూడా పోలీసులకు చెప్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అయితే ఇది మొత్తం ఆ టీవీ న్యూస్ ఛానల్ లో ప్రత్యక్షంగా ప్రసారమైంది. కొందరు సాయుధులు తుపాకులతో శబ్దాలు కూడా చేశారు. అయితే ఈ ఘటన లో ఎవరికి ఎలాంటి హాని జరగలేదు.
న్యూస్ ఛానల్ లో లైవ్ ప్రసారం అవుతున్న నేపథ్యంలో విషయం తెలుసుకున్న పోలీసులు న్యూస్ ఛానల్లోకి అత్యంత చాకచక్యంగా అడుగుపెట్టారు. అనంతరం సాయుధులైన వారిని అదుపులోకి తీసుకున్నారు. సుమారు 13 మంది తుప్పాకలతో న్యూస్ ఛానల్ రూంలో వీరంగం సృష్టించారని గుర్తించారు. ఉగ్రవాద చర్యల కింద వారిపై కేసు నమోదు చేశారు. అయితే ఈ దాడి వెనుక ఎవరు ఉన్నారని విషయాన్ని పోలీసులు ఇంతవరకు బయటకు చెప్పలేదు. ఇటీవల ఆ ప్రాంతంలోని జైల్లో నుంచి డ్రగ్స్ అమ్మే గ్యాంగ్ స్టర్లు తప్పించుకున్నారు.. అప్పటినుంచి వారు వరుసగా హింసాత్మక సంఘటనలకు పాల్పడుతున్నారు. కొందరు పోలీసు ఉన్నతాధికారులను కూడా అపహరించారు. గ్యాంగ్ స్టర్లు జైలు నుంచి తప్పించుకున్న తర్వాతే ఇదంతా జరుగుతోందని పోలీసులు భావిస్తున్నారు.
టి సి టీవీ ఛానల్ ఘటన నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు డేనియల్ నోబోబా స్పందించారు. దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సైనిక దళాలు మోహరించాలని ఆదేశాలు జారీ చేశారు. మాదకద్రవ్యాలను సరఫరా చేసే 23 ముఠాలను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించారు. వీరికి సంబంధించిన ముఠాలు ఎక్కడ కనిపించినా అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా హతమార్చాలని పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాలు తీసుకునే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా అక్రమంగా మాదకద్రవ్యాలు సాగు చేస్తే వారిపై కూడా కఠిన శిక్షలు అమలు చేస్తామని అన్నారు.. ప్రస్తుతం దేశం అంతర్గతంగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నని.. శాంతిని పున: స్థాపించే వరకు పోరాడుతామని ఆయన ప్రకటించారు.
Who’s funding this?
Also Equador. They seized a TV station pic.twitter.com/6It9GfaRMN
— Roast (@Roast3r) January 9, 2024