Iran Economic Crisis: ఇరాన్‌లో భారీ ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. నిత్యావసరాల ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. దీంతో వ్యాపారులు, ప్రజలు ఆందోళన చేస్తున్నారు. పాలకుల తీరుపై మండిపడుతున్నారు. దీంతో ప్రభుత్వం నిరసనలను అణచివేస్తోంది. బలప్రయోగం చేస్తోంది. దీంతో ఇప్పటికే చాలా మంది మరణించారు. పరిస్థితిని గమనిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుప్రీం లీడర్ కమెనీకి హెచ్చరిక జారీ చేశారు.
ఆర్థిక సంక్షోభం..
ద్రవ్యోల్బణం 50–60%కు చేరింది. ఒక డాలర్ విలువ 42 వేలకు చేరింది. దీంతో ధరలు సామాన్యుడికి అందకుండా పోయాయి. కొనుగోలుదారులు రోడ్లపై వచ్చారు. స్పందించిన ప్రభుత్వం సమస్యలు తెలుసని, కానీ నిరసనలు చేయడం ద్వారా సమస్యలు పరిష్కారం కావని తెలిపింది.
గతేడాది అమెరికా దాడి..
2025 జూన్‌లో అమెరికా ఇరాన్‌పై దాడి చేసింది. బాంబర్లతో జరిపిన దాడులతో ఇరాన్ ఉలిక్కిపడింది. ఈ దాడి తర్వాత ఇరాన్‌పై అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించింది. దీంతో ఇజ్రాయెల్ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. ఒకవైపు అమెరికాతో గొడవలు, ఇంకోవైపు ఇజ్రాయెల్‌తో గొడవల కారణంగా ఇరాన్ ప్రభుత్వం ఏమీ చేయలేదని పరిస్థితి నెలకొంది.
చరిత్రాత్మక నేపథ్యం
1979 ఇస్లామిక్ విప్లవంలో షా రెజా పహ్లవి తొలగించి, థియోక్రటిక్ వ్యవస్థ ఏర్పడింది. ఇప్పుడు అమెరికాలో ఉన్న షా వారసుడు సోషల్ మీడియాలో ‘ఇస్లామిక్ నాయకత్వం కింద ఆర్థికం మరింత దిగజారుతుంది‘ అని పేర్కొన్నాడు. ఈ సంఘటనలు ఇరాన్ రాజకీయాల్లో మార్పును సూచిస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ ఒత్తిడితో ప్రభుత్వం ఒత్తిడిలో పడింది. ప్రజా నిరసనలు ముమ్మరమవుతుంటే, వ్యవస్థ మార్పు అవకాశాలు పెరుగుతున్నాయి. ఇరాన్ సంక్షోభం ప్రపంచ ఆర్థికం, మధ్యప్రాచ్య రాజకీయాలపై దెబ్బ తీస్తుంది.