Donald Trump (3)
Donald Trump : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దుందుడుకుగా వ్యవహరిస్తున్నారు. అమెరికా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు కీలక ఫైళ్లపై ఎడాపెడా సంతాకలు చేస్తున్నారు. ఇక మరోవైపు కెనడా, చైనాపై సుంకాలు విధించారు. పనామా కాలువ ఆక్రమణకు ఎత్తుగడ వేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ట్రంప్ కన్ను గాజాపై పడింది. స్వేచ్ఛగా, సంతోషంగా, సుసంపన్నంగా, సురక్షితంగా జీవించే హక్కు ఇజ్రాయోల్ ప్రలకు ఎంత ఉందో, పాలస్తీనా ప్రజలకు అందే ఉందని విదేశాంగా శాఖ వెబ్‌సైట్‌లో పేర్కొన్న అగ్రరాజ్యం.. ఇప్పుడు దానిని పక్కన పెట్టి దురాక్రమణ ఎత్తుగడ వేస్తోంది. పాలస్తీనియన్ల భద్రతకు, సుస్థిరతకు అవసరమైన సాయం అందిస్తామన్న అగ్రరాజ్య సందేశం సందేశానికే పరిమితమైంది. ఇజ్రాయెల్‌తోపాటే స్వాతంత్య్రం పొందిన పాలస్తీనా మనుగడ సాగించాలని అమెరికా అంటోంది. కానీ, గాజా, వెస్ట్ బ్యాంకుల్లో నెత్తుటేరులు పారిస్తున్న ఇజ్రాయెల్‌కు అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది. నిర్దేశిత సరిహద్దులతోనే రెండు దేశాల ఏర్పాటే సంక్షోభానికి అంతిమ పరిష్కారం అంటోంది. ఇక ఇప్పడు తాము కప్పుకున్న ఉభయ కుశలోపరి ముసుగును ట్రంప్ తొలగించారు. గాజాను వశం చేసుకునేందుకు ఎత్తుగడ వేశారు. ఇందులో భాగంగా గాజాను స్వాధీనం చేసుకుని కొత్త జీవం పోస్తామంటూ దుస్సాహసమైన ప్రతిపాదన చేశారు. ఆ పని చేస్తే.. దహించివేసే నిప్పులో తెలగాటమాడినట్లే అంటున్నారు నిపుణులు.
స్వతంత్ర దేశంగా గుర్తించినా..
ఐక్యరాజ్య సమితిలో మూడోవంతు దేశాలు పాలస్తీనాను స్వతంత్ర రాజ్యాంగా గుర్తించాయి. కానీ, ఇజ్రాయెల్‌లోని చాందసవాదులు గాజాను పూర్తిగా తుడిచిపెట్టాలని చూస్తున్నారు. జాతి విద్వేషాన్ని వెల్లగక్కుతున్నారు. ఈ తరుణంలో ఇజ్రాయెల్‌కు అమెరికా అండగా నిలవడంపై ట్రంపుకే చెల్లింది. గాజా పునర్నిర్మాణానికి అమెరికా సొమ్మును వెచ్చించే ఆలోచనే ఆయనకు లేదని శ్వేతసౌధ ప్రతినిధులు తేల్చిచెబుతున్నారు. గాజాను పూర్తిగా ఖాళీచేయించి, దాన్ని ఇజ్రాయెల్ చేతుల్లో పెట్టడమే అగ్రరాజ్య పన్నాగమా? లేదా– శరణార్థులకు ఆశ్రయం కల్పించడం, గాజా పునరుద్ధరణలో పాలుపంచుకోవడం వంటి అంశాల్లో ఈజిప్టు, జోర్డాన్, ఇతర అరబ్ దేశాలపై ఒత్తిడి పెంచే పథకమా? అసలు ట్రంప్ ఆలోచన ఏంటి అన్నది అర్థం కావడం లేదు. ఏదేమైనా ట్రంప్ దురాలోచన అంతర్జాతీయ చట్టాలూ మానవ హక్కులకు తీవ్ర విఘాతకరమైనది.
ఉగ్రవాదంంపై యుద్ధం పేరుతో..
ఉగ్రవాదంపై యుద్ధం పేరుతో గాజాలోని జాతిహననానికి పాల్పడిన ఇజ్రాయెల్ దాదాపు 62 వేల మంది ప్రాణాలు బలిగొంది. మృతుల్లో 17 వేల మందికిపైగా పిల్లలే. గాజాలో ఇళ్ల నుంచి ఆస్పత్రుల వరకు అన్నీ నాశనం చేశాయి టెల్ అవీస్ బలగాలు. సుమారు 20 లక్షల మంది నిరాశ్రయులుగా మారారు. అక్కడ పోగైనా శిథిలాల తొలగింపునకే 20 ఏళ్లు పడుతుందని, 120 కోట్ల డాలర్లు ఖర్చవుతుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. మొత్తంగా గాజా పునర్నిర్మాణానికి 1850 కోట్ల డాలర్లు అవసరమని అంచనా. ప్రస్తుతం గాజాలో రాకపోకలు,వస్తు సరఫరా, ఇజ్రాయెల్, ఈజిస్టు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. అవి కొనసాగితే గాజా తిరిగి ఊపిరి పోసుకోవడానికి 350 ఏళు లపడుతుందని ఐక్యరాజ్య సమితి అంటోంది. పునరుద్దరణకు చర్యలు తీసుకోకపోగా అక్కడి ప్రజలను ఖాళీ చేయించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని నిర్వీర్యం చేస్తుంది. మరోవైపు ఇరాన్‌పై ఆంక్షలు విధించడం కూడా పశ్చిమాసియా భవిష్యత్‌ను ప్రభావితం చేస్తుంది.