https://oktelugu.com/

Deputy Cm Pawan Kalyan: ‘ఆపరేషన్ అరణ్య’ మొదలుపెట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్..ఎర్ర చందనం స్మగ్లర్స్ పై ఉక్కుపాదం!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, పంచాయితీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ పంచాయితీలలో ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. కేవలం ఆరు నెలల కాలం లో పల్లెల్లో ఉండే సమస్యలన్నిటినీ గ్రామసభలు ద్వారా తెలుసుకొని, వాటిని పరిష్కరించి, ప్రతీ పల్లెలోనూ రోడ్లను వేయించి చరిత్ర సృష్టించాడు.

Written By:
  • Vicky
  • , Updated On : February 8, 2025 / 12:18 AM IST
    Follow us on

    Deputy Cm Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, పంచాయితీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ పంచాయితీలలో ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. కేవలం ఆరు నెలల కాలం లో పల్లెల్లో ఉండే సమస్యలన్నిటినీ గ్రామసభలు ద్వారా తెలుసుకొని, వాటిని పరిష్కరించి, ప్రతీ పల్లెలోనూ రోడ్లను వేయించి చరిత్ర సృష్టించాడు. దేశం మొత్తం ఈ విషయం లో మన ఆంధ్ర ప్రదేశ్ వైపు చూసేలా చేసాడు. రెండవ విడత గ్రామసభలు ఏర్పాటు చేసేలోపు, పవన్ కళ్యాణ్ తాను తీసుకున్న శాఖలలో ఒకటైన అటవీ శాఖపై ఇప్పుడు ద్రుష్టి పెట్టాడు. అడవులను కేంద్రంగా చేసుకొని ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయో మనమంతా చూస్తూనే ఉన్నాం, ముఖ్యంగా శేషాచలం అడవుల్లో దొరికే ఎర్ర చందనాన్ని దోచుకుంటూ విదేశాలకు అక్రమ రవాణా చేయడం ఎన్నో దశాబ్దాల నుండి మనం చూస్తూనే ఉన్నాం. దురదృష్టం ఏమిటంటే అప్పట్లో పోలీసులే స్మగ్లర్లకు దారి చూపించేవారు.

    ఇప్పుడు పవన్ కళ్యాణ్ ‘ఆపరేషన్ అరణ్య’ పేరుతో మన రాష్ట్రంలో ఉన్న అధ్వనులను ద్వంసం చేస్తున్న వాళ్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్దమయ్యాడు. ఈ ‘ఆపరేషన్ అరణ్య’ ద్వారా ముఖ్యంగా ఆయన ఎర్రచందనం అక్రమ రవాణా చేసేవారిపై ఉక్కుపాదం మోపనున్నాడు. అందుకు సంబంధించి అటవీ శాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసాడు. అంతే కాకుండా అటవీ భూములను ఆక్రమించిన వారిపై కూడా ఆయన చర్యలు తీసుకునేందుకు కార్యాచరణ మొదలు పెట్టాడు. ఈ రెండు అంశాలలో ఇప్పటి వరకు చిన్నవాళ్లను టార్గెట్ చేసింది చాలు, ఇక నుండి పెద్దవాళ్ళను టార్గెట్ చేయాలనీ ఈ సందర్భంగా పోలీసులకు ఆదేశాలు జారీ చేశాడు. ఈ ఆపరేషన్ ద్వారా ఆయన వన్య ప్రాణుల సంరక్షణ వైపు కూడా ప్రత్యేక ద్రుష్టి సారించాడు. అనేక ప్రాంతాల్లో ఏనుగులు అడవుల నుండి తప్పి పోయి జన సంచారం ఉన్న చోటుకి వచ్చి విద్వంసం సృష్టించడం వంటివి మనం చాలానే చూసాము. అలాంటి పరిస్థితులను రాకుండా చేయడానికి ఆయన చర్యలు చేపట్టబోతున్నాడు.

    అంతే కాకుండా అటవీ భూములను విస్తరింపజేసి పచ్చదనం ఉట్టిపడేలా ఆయన పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఓవరాల్ గా ఆయన పంచాయితీ శాఖలో ఎలాంటి విప్లవత్వమక మార్పులు తీసుకొచ్చాడో, అలాంటి మార్పులు అటవీ శాఖలో కూడా తీసుకొచ్చేందుకు ఫుల్ ఫోకస్ పెట్టాడు. ఇందులో ఆయన ఎంత వరకు సక్సెస్ అవుతాడో చూడాలి. అటవీ భూములను ఆక్రమించుకున్న వారిలో కేవలం వైసీపీ నాయకులు మాత్రమే కాదు, కూటమి నాయకులు కూడా ఉండొచ్చు. మరి వాళ్లపై కూడా పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకుంటాడా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. రాయలసీమ ప్రాంతం లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దందా ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మరి ఆయనకీ ఎదురుగ నిలబడి పవన్ కళ్యాణ్ అతన్ని ఆటలను అరికట్టగలడా లేదా అనేది చూడాలి. ఒకవేళ అరికట్టగలిగితే పవన్ కళ్యాణ్ హిస్టరీ క్రియేట్ చేసిన వాడు అవుతాడు.