Donald Trump : అమెరికాలోకి దిగుమతి అయ్యే కార్లు, ఆటో విడిభాగాలపై 25 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్ (తిరిగి చెల్లించే పన్ను) అనేక వాహన కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపనుంది. కార్లు, SUVలపై ఏప్రిల్ 2 నుంచి దిగుమతి సుంకం 25 శాతానికి పెరుగుతుంది. దీని వల్ల వాహనాల ధరలు పెరుగుతాయి. అనేక భారతీయ కంపెనీల వ్యాపారం ప్రభావితమవుతుంది. అయితే బజాజ్, మహీంద్రా, రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి కంపెనీలపై ట్రంప్ టారిఫ్ ప్రభావం ఏమీ ఉండదు. ట్రంప్ ఆటో టారిఫ్ నుంచి టూ-వీలర్, ట్రాక్టర్ కంపెనీలకు మినహాయింపు లభించింది. ఈ టారిఫ్ కేవలం ప్యాసింజర్ వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. ఇందులో సెడాన్, SUV, క్రాస్‌ఓవర్, మినీవ్యాన్, కార్గో వ్యాన్‌లతో పాటు తేలికపాటి ట్రక్కులు కూడా ఉన్నాయి. టూ-వీలర్, ట్రాక్టర్లు కొత్త టారిఫ్ వార్ వల్ల ప్రభావితం కాబోవని వైట్ హౌస్ ఒక ప్రకటనలో ధృవీకరించింది.
Also Read : ప్రపంచ కుబేరుల జాబితాలో తెలుగువారు: ఫోర్బ్స్ ర్యాంకింగ్‌లో తెలుగు బిలియనీర్లు!
ఈ వాహనాలను ఎగుమతి చేస్తున్న కంపెనీలు
బజాజ్ ఆటో, రాయల్ ఎన్‌ఫీల్డ్, మహీంద్రా అండ్ మహీంద్రాకు ఇది ఊరట కలిగించే విషయం.. ఎందుకంటే బజాజ్ అమెరికాకు కేటీఎం మోటార్ సైకిళ్లను ఎగుమతి చేస్తుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ తన అత్యంత ప్రజాదరణ పొందిన క్లాసిక్ మోడల్‌ను ఎగుమతి చేస్తుంది. అదేవిధంగా మహీంద్రా అండ్ మహీంద్రా అధిక శక్తి కలిగిన ట్రాక్టర్లను ఎగుమతి చేస్తుంది. కొత్త టారిఫ్ నిబంధనల వల్ల ఈ మూడు కంపెనీలపై ఎలాంటి ప్రభావం ఉండదు. భారత్ నుంచి అమెరికాకు వాహన ఎగుమతులు మొత్తం భారతీయ ఆటో ఎగుమతుల్లో కేవలం 3శాతం మాత్రమే. అందువల్ల భారత వాహన తయారీదారులపై దీని ప్రభావం చాలా పరిమితంగా ఉంటుంది.
టాటా మోటార్స్‌పై ఎక్కువ ప్రభావం
ట్రంప్ టారిఫ్ వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యే భారతీయ కంపెనీ టాటా మోటార్స్.. ఎందుకంటే టాటా మోటార్స్ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) పెద్ద మొత్తంలో తన కార్లను అమెరికాకు ఎగుమతి చేస్తుంది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) ప్రతినిధి మాట్లాడుతూ.. “అమెరికాలో అన్ని ఆటో దిగుమతులపై 25శాతం టారిఫ్ విధించే ప్రకటన గురించి మరింత సమాచారం కోసం మేము ఎదురు చూస్తున్నాము. సరైన సమయంలో తదుపరి ప్రకటన చేస్తాం” అని అన్నారు.
జేఎల్ఆర్ కి అతిపెద్ద మార్కెట్ అమెరికా
రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్, ల్యాండ్ రోవర్ డిఫెండర్, ల్యాండ్ రోవర్ డిస్కవరీ వంటి ప్రసిద్ధ మోడళ్లను విక్రయించే జేఎల్ఆర్, ఈ వాహనాలను యూకే, స్లోవేకియాలో తయారు చేస్తుంది. అమెరికా జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) అతిపెద్ద మార్కెట్.. ఇక్కడ దాని గ్లోబల్ అమ్మకాల్లో ఉత్తర అమెరికా వాటా ఈ సంవత్సరం మూడో త్రైమాసికానికి నాటికి 36శాతానికి చేరుకుంది. 2024లో బ్రాండ్ మొత్తం గ్లోబల్ అమ్మకాలు కేవలం 4శాతం మాత్రమే పెరిగినప్పటికీ, అమెరికాలో జేఎల్ఆర్ హోల్‌సేల్ అమ్మకాలు 32శాతం పెరిగి 124,609 యూనిట్లకు చేరుకున్నాయి.
Also Read: మయన్మార్ లో తరచూ అక్కడే భూకంపాలు.. ఎందుకలా?!