Sandeep Vanga and Naga Ashwin : 7 పదుల వయస్సులో కూడా మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వరుసగా సినిమాలు చేస్తూ కుర్ర హీరోలతో సమానంగా పోటీ పడుతూ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ తో చెడుగుడు ఆడుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి కి ఎన్నో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ వచ్చాయి, కానీ వింటేజ్ మెగాస్టార్ ని ఫ్యాన్స్ బాగా మిస్ అవుతున్నారు. అంతే కాకుండా మెగాస్టార్ చిరంజీవి లో ఒక స్పెషాలిటీ ఉంది. మారుతున్న జనరేషన్స్ ని క్షుణ్ణంగా పరిశీలించి, ఆ జనరేషన్ ఆడియన్స్ కి తగ్గట్టుగా తనని తాను మార్చుకోవడం ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత. అందుకే నాలుగు దశాబ్దాల నుండి ఆయన ఆడియన్స్ ని అలరిస్తూ ఇండస్ట్రీ లో కొనసాగుతున్నాడు. కానీ రీ ఎంట్రీ తర్వాత నేటి జనరేషన్ కి తగ్గట్టు తనని మార్చుకోలేదు, ఇదే ఆయన అభిమానుల్లో కాస్త అసంతృప్తిని రేపింది.
Also Read : మెగా ప్రాజెక్ట్ కి శ్రీకారం..సందీప్ వంగ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి..ఉగాదికి అధికారిక ప్రకటన!
పైగా పదేళ్ల క్రితం విడుదలైన సినిమాలను రీమేక్ చేయడం వంటివి కూడా అభిమానులకు మింగుడు పడని అంశాలు. సోషల్ మీడియా లో చిరంజీవి పై నెగటివిటీ ఒక రేంజ్ లో పెరిగిపోయింది. ఇది బాగా గమనించిన చిరంజీవి తనని తాను అప్డేట్ చేసుకునే పనిలో ఉన్నాడు. ఇప్పటికే అనిల్ రావిపూడి తో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్న చిరంజీవి, ఈ సినిమా తర్వాత ‘దసరా’ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) తో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ఈ ప్రాజెక్ట్ పై అభిమానుల్లో అంచనాలు మామూలు రేంజ్ లో లేవు, నేచురల్ స్టార్ నాని ఈ చిత్రానికి నిర్మాత. ఈ సినిమా తర్వాత చిరంజీవి కి రీసెంట్ గానే ఇద్దరు పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్స్ రెండు కథలు వినిపించారట. ఆ డైరెక్టర్స్ మరెవరో కాదు, ఒకరు సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga), మరొకరు నాగ అశ్విన్(NagaVamsi). ఇద్దరూ చిరంజీవి కి వీరాభిమానులే.
సందీప్ వంగ కొత్త తరహా కాన్సెప్ట్స్ పాన్ ఇండియా లెవెల్ లో బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ ని క్రియేట్ చేస్తున్నాడో మనమంతా చూసాము. యూత్ ఆడియన్స్ లో ఆయనకు ఉన్నటువంటి క్రేజ్ వేరు. రీసెంట్ గానే మెగాస్టార్ చిరంజీవి ని కలిసి ఒక పవర్ ఫుల్ స్టోరీ ని వినిపించాడట. అందుకు చిరంజీవి కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. అదే విధంగా ‘కల్కి’ డైరెక్టర్ నాగ అశ్విన్ కూడా చిరంజీవి ని కలిసి ఇటీవలే ఒక స్క్రిప్ట్ ని న్యారేట్ చేసాడట. ఇది కూడా అద్భుతంగా ఉందని సమాచారం. ఈ రెండు సినిమాల్లో ఏది ముందు చేయాలి అనే దానిపై చిరంజీవి ఎటు తేల్చుకోలేక పోతున్నాడట. పాన్ ఇండియన్ డైరెక్టర్ తో సినిమాలు చేయడానికి రెడీ అనగానే చిరంజీవి ఇంటికి సదరు డైరెక్టర్స్ ఎలా క్యూలు కడుతున్నారో చూడండి. ఈ వయస్సులో కూడా ఇలాంటి స్టేటస్ ని ఎంజాయ్ చేయడం సాధారణమైన విషయం కాదు.
Also Read : గోపీచంద్, సందీప్ వంగ కాంబినేషన్ లో ఆగిపోయిన సినిమా అదేనా..దురదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్ అంటే గోపీనే!