Donald Trump: అమెరికా అధ్యక్షుడు కావడమే ఆలస్యం.. ట్రంప్ తనలో ఉన్న అసలు రూపాన్ని ప్రపంచ దేశాలకు రుచి చూపిస్తున్నాడు. అధికారంలోకి రావడం ఆలస్యం.. ప్రభుత్వ ఉద్యోగులపై వేటు వేశాడు. ఖర్చు తగ్గించుకోమని అన్ని శాఖల అధికారులకు సూచించాడు. విభాగ అధిపతులను మార్చేశాడు. అక్రమంగా ఉంటున్నారని.. అమెరికా దేశస్థుల అవకాశాలు మొత్తం లాగేసుకుంటున్నారని ఆరోపిస్తూ.. ప్రపంచ దేశాలకు చెందిన పౌరులను ఆర్మీ యుద్ధ విమానాలలో.. యుద్ధ ఖైదీల మాదిరిగా వారి వారి దేశాలకు తరలించాడు. ఇక్కడతో ట్రంప్ ఆగిపోలేదు. ఇక్కడితో ఆగిపోతే అతడు ట్రంప్ ఎందుకు అవుతాడు.. ఇప్పుడిక సరికొత్త వివాదాలకు ట్రంప్ కేంద్ర బిందువు అవుతున్నాడు. అమెరికాలో పెరిగిపోతున్న నిరుద్యోగాన్ని.. అంతకంతకు ఎక్కువవుతున్న అప్పుల భారాన్ని తగ్గించుకోవడానికి ట్రంప్ ప్రపంచం మీదే సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించాడు. దాని పేరు సుంకం.. ఈ దేశం ఆదేశం అని కాకుండా ప్రపంచ దేశాల మీద ట్రంప్ సుంకాలు విధించడం మొదలుపెట్టాడు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు ఒక్కసారిగా డౌన్ అయ్యాయి. లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల ప్రపంచం మొత్తం వాణిజ్యపరమైన విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నది.
Also Read: అమెరికా వీడితే తిరిగి రాగలమా?
సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు
ప్రపంచ దేశాల మీద అమెరికా విధించిన సుంకాల మాట ఏమిటో తెలియదు కాని.. ట్రంప్, మస్క్ తీసుకుంటున్న నిర్ణయాల మీద మాత్రం సోషల్ మీడియాలో రోజుకో తీరుగా పోస్టులు, మీమ్స్, వీడియోలు వెల్లువెత్తుతున్నాయి. టిక్ టాక్ లో అయితే మొత్తం ట్రంప్ ను విమర్శిస్తూ.. ట్రంప్ ను గేలి చేస్తూ రూపొందిస్తున్న వీడియోలే తెగ దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే టిక్ టాక్ లో ఒక యూజర్ ట్రంప్ నిర్ణయం వల్ల అమెరికా ప్రజలు గార్మెంట్ కంపెనీలో పనిచేస్తే దుస్థితి ఏర్పడిందని.. చైనా అమెరికాకు దుస్తుల ఎగుమతులు నిలిపివేస్తే.. అమెరికా ప్రజలు వారు ధరించే దుస్తులు వారే కుట్టుకోవాల్సి ఉంటుందని ఎద్దేవా చేస్తూ ఓ నెటిజన్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సహాయంతో రూపొందించిన వీడియో టిక్ టాక్ లో ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. ఇక మరో యూసర్ ఒక అడుగు ముందుకేసి.. ట్రంప్, మస్క్.. అమెరికా ప్రభుత్వంలోని పెద్దలు షూ లు తయారు చేసే కంపెనీలో పనిచేస్తున్నట్టు రూపొందించిన వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఆ కంపెనీలో ట్రంప్, అమెరికా ప్రభుత్వ పెద్దలు తయారు చేస్తున్నట్టు కనిపిస్తోంది..” అమెరికా ఆర్థిక పరిస్థితి ఎలా మెరుగవుతుందో తెలియదు. ప్రపంచ దేశాలు ఎటువంటి అడుగులు వేస్తాయో తెలియదు. కానీ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల చివరికి అమెరికా ప్రభుత్వ పెద్దలకు ఇలాంటి దుస్థితి వచ్చింది. ఇది ప్రతీకాత్మకంగా రూపొందించిన వీడియో అయినప్పటికీ.. భవిష్యత్తు కాలంలో ఇదే నిజం కావచ్చు అని” నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.
Well, the “American Dream” really did come true #TradeWar #Tariffs #Trump #Musk #Tesla @NIOSwitzerland @_mm85 @TaylorOgan pic.twitter.com/bTAp9dMpla
— DriveGreenLiveGreen (@DriveGreen80167) April 8, 2025