Donald Trump Tariffs: అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ తన ఏడాది పాలనలో తమ దేశానికి సరుకులు ఎగుమతి చేసే దేశాలపై టారిఫ్‌లు విధించడడానికే ఎక్కువగా సమయం కేటాయించారు. అమెరికా ఆదాయం పెంపునకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో దిగుమతులపై 5 నుంచి 150 శాతం వరకు టారిఫ్‌లు విధించారు. అయితే ఈ టారిఫ్‌లు రాజ్యాంగ విరుద్ధమని అమెరికా సుప్రీం కోర్టు ప్రకటించి షాక్ ఇచ్చింది. టారిఫ్‌లకు విరుద్ధంగా కేసు వేసింది ఓ బొమ్మల వ్యాపారి. ఇక ఈ కేసును వాదించింది భారత సంతతికి చెందిన లాయర్. ఈ షాక్ నుంచి తేరుకోకముందే ట్రంప్‌కు అమెరికా ట్రేడ్ కోర్టు మరో షాక్ ఇచ్చింది. వివిధ దేశాల నుంచి వసూలు చేసిన అధిక టారిఫ్‌లు రిఫండ్ చేయాలని ఆదేశించింది. ఇది ట్రంప్ ఉపయోగించిన జాతీయ భద్రతా పవర్, సెక్షన్ 301 (వాణిజ్య అన్యాయాలకు ప్రతీకారం) కింది టారిఫ్‌లపై వర్తిస్తుంది. సుమారు 20 వేలకుపైగా కంపెనీలు ఈ రాయితీకి అర్హులవుతాయని కోర్టు స్పష్టం చేసింది.
Also Read: భారత్ వరకూ వచ్చిన యుద్ధం.. అమెరికా తెగించేసింది..
టారిఫ్‌లు ఎందుకు వచ్చాయి?
ట్రంప్ పాలిసీల్లో ఉక్కు, అల్యూమినియం, చైనా ఉత్పత్తులపై 10–25% లేవీలు అమలు చేశారు. ఇవి దేశీయ పరిశ్రమలను కాపాడటానికి, వాణిజ్య లోపాలను సరిచేయడానికి ఉద్దేశించాయి. మొత్తం వసూళ్లు 175 బిలియన్ డాలర్లకు చేరాయి. అయితే, సుప్రీం కోర్టు ముందుగా ఈ టారిఫ్‌లను రద్దు చేసింది. ఇది ఎమర్జెన్సీ పవర్ల దుర్వినియోగాన్ని ప్రశ్నించింది. తాజాగా ట్రేడ్ కోర్టు రిఫండ్‌కు ఆదేశించింది.
ఆర్థిక, రాజకీయ ప్రభావాలు
కంపెనీలకు రిఫండ్‌తో ధరలు తగ్గి, వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుంది. కానీ, ప్రభుత్వ ఖర్చులు పెరిగి ఆర్థిక లోపం మరింత పెరుగుతుంది. చైనా, ఈయూలతో వాణిజ్య యుద్ధాలు తగ్గే అవకాశం ఉంది. రాజకీయంగా, ట్రంప్‌కు 2026 ఎన్నికల్లో ఇది పోటీదారుల ఆయుధంగా మారవచ్చు.
ఈ నిర్ణయం అధ్యక్షుల అధికారాలను పరిమితం చేస్తూ, కాంగ్రెస్ అనుమతి లేకుండా టారిఫ్‌లు విధించడానికి అడ్డుకట్ట వేస్తుంది. చారిత్రకంగా, ఇది 1930ల స్మూట్–హావ్లీ టారిఫ్ చట్టం తర్వాత మొదటి పెద్ద దెబ్బ. భవిష్యత్తులో డబ్ల్యూటీవో వంటి అంతర్జాతీయ ఒప్పందాలు బలపడతాయి. కోర్ట తీర్పుపై ట్రంప్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.