Homeఅంతర్జాతీయంDonald Trump: మస్క్‌ కొడుకు అల్లరి.. ట్రంప్‌కు తలనొప్పి.. ఏకంగా డెస్క్‌నే మార్చేశాడు..

Donald Trump: మస్క్‌ కొడుకు అల్లరి.. ట్రంప్‌కు తలనొప్పి.. ఏకంగా డెస్క్‌నే మార్చేశాడు..

Donald Trump: అగ్రరాజ్యాధినేత డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump). నెల క్రితం బాధ్యతలు చేపట్టిన ట్రంప్‌ సంచలన నిర్ణయాలు.. ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్స్‌తో దూకుడు ప్రదర్శిస్తున్నారు మెక్సికో, కెనడా, చైనా దిగుమతులపై 25 శాతం సుంకం పెంచారు. ఇక అల్యూమినియం, ట్రీల్‌ దిగుముతపైనా ట్యాస్‌ పెంచేశారు. గాజాను స్శాదీనం చేసుకునే ఆలోచనలో కూడా ఉన్నారు. ఇక అమెరికాలోని ఉద్యోగులను ఇంటికి పంపించే ఆలోచన చేస్తున్నారు. మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన నినాదంలో ఎన్నికల్లో గెలిచిన ట్రంప్‌.. అమెరికా(America) ను మరోమారు గ్రేట్‌గా మార్చేందుకు డోజ్‌(డిపాల్‌ మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియన్నీ)ని ఏర్పాటు చేశారు. దీనికి చైర్మల్‌గా ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ను నియమించారు. ఆయన సూచనమేరే వృథా ఖర్చులు తగ్గించడంపై దృష్టి పెట్టారు. వివిధ దేశాలకే ఇచ్చే నిధుల్లో కోత పెడుతున్నారు. భారత ఎన్నికలకు కూడా సాయం చేశామని, ఇప్పుడు వాటిని నిలిపివేశామని వెల్లడించారు. ఇలా పొదుపు మంత్రం పాటిస్తున్న ట్రంప్‌కు ఒప పసివాడి అల్లరి తలనొప్పిగా మారింది. అ పసివాడు ఎవరో కాదు.. డోజ్‌ చైర్మన్‌ ఎలాన్‌ మస్క్‌ కుమారుడే.

నాలుగేళ్ల పసివాడు..
మస్క్‌ ఇటీవల తన నాలుగేళ్ల కుమారుడితో కలిసి అమెరికా అద్యక్షుడు ట్రంప్‌ను కలిశారు. వైట్‌హౌస్‌లోని ఓవల్‌ ఆఫీస్‌లో వీరిద్దరూ మీడియ సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో మస్క్‌(Musk) కుమారుడి అల్లరి నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. చిన్నరా వల్ల ట్రంప్‌ తన డెస్క్‌ను మార్చుకోవాల్సి వచ్చింది. ఓవల ఆఫీస్‌లోని 145 ఏళ్ల పురాతన రెజల్యూట్‌ డెస్క్‌ను తీసివేయించిన ట్రంప్‌.. దాని స్థానంలో సీఅండ్‌వో డెస్క్‌ ఏర్పాటు చేయించారు. ఇందుకు సబంధించిన ఫొటోలను ఆయన తన ట్రూత్‌ ఖతాలోల పోస్టు చేశారు. అయితే ఇదీ తాత్కాలికమేనని వెల్లడించారు. మస్క్‌ కుమారుడు ఆ టేబుల్‌పై చేతులు పెట్టడం, రద్దుడం వంటి పనులు చేశాడు. బ్యాక్టీరియా భయంతో అతి శుభ్రత పాటించే ట్రంప్‌.. చిన్నారి చేష్టల కారణంగా టేబ్‌ మార్చినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి.

మొత్తం ఏడు డెస్క్‌లు..
వైట్‌హౌస్‌లో మొత ఏడు డెస్క్‌లు ఉన్నాయి. వీటిలో ఒకదానిని ఎంచుకునే అవకాశం అధ్యక్షుడికి ఉంటుంది. ఈ సీఅండ్‌ఓ(C and O) డెస్క్‌ను గతంలో జార్జ్‌బుష్, మరికొందరు ఓవల్‌ ఆఫీస్‌లో ఉపయోగించారు. ఇప్పటి వరకు ఇక్కడున్న రెజల్యూట్‌ డెస్క్‌ను మరమ్మతుల కోసం పంపించారు. అతి చాలా అత్యవసరం అని ట్రంప్‌ తన సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు. రెజల్యూట్‌ డెస్క్‌ను 1880లో అప్పటి బ్రిటన్‌ రాణి క్వీన్‌ విక్టోరియా నాటి అమెరికా అధ్యక్షుడు రూథర్‌ఫర్డ్‌కు కానుకగా ఇచ్చారు. దీనిని బ్రిటిష్‌ రాయల్‌(British Royal) నేవీలో సేవలందించి వైదొలగిన హెచ్‌ఎంఎస్‌ రెజల్యూట్‌ అనే నౌక చెక్కతో తయారు చేశారు.

చిన్నారి అల్లరి..
ఇదిలా ఉంటే.. గతవారం ట్రంప్, మస్క్‌ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతుండగా మస్క్‌ కుమారుడు X ÆA&Xii తెగ అల్లరి చేశాడు. ట్రంప్‌ టేబుల్‌పై కూర్చోవడం, రాయడం, రుద్దడం చేశాడు. తర్వాత మస్క్‌ తలపై ఎక్కి కూర్చోడం, లాగడం వంటివి చేశాడు. దీంతో మీడియా దృష్టి అంతా ఆ బాబుపై పడింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular