Chhaava : బాలీవుడ్ లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిన ‘చావా'(Chhaava Movie) చిత్రం 8 రోజుల బాక్స్ ఆఫీస్ జైత్ర యాత్ర ని పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 8 రోజుల్లో 246 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయట. ఇది కేవలం ఇండియా కి సంబంధించిన వసూళ్లు మాత్రమే, ఓవర్సీస్ లో ఇండియన్ కరెన్సీ లెక్కల్లోకి చూస్తే దాదాపుగా 100 కోట్ల రూపాయిల గ్రాస్ వరకు ఉంటుందని సమాచారం. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి ఇప్పటి వరకు 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చి ఉంటాయని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. అయితే ఈ సినిమాకి రోజురోజుకు తెలుగు లో డబ్ చేసి విడుదల చేయాలనే డిమాండ్ మన ఆడియన్స్ నుండి ఎక్కువగా పెరుగుతుంది. ఆడియన్స్ డిమాండ్ ని అర్థం చేసుకున్న నిర్మాతలు తెలుగు లో డబ్ చేయడానికి సిద్ధం అవుతున్నారట.
తెలుగు లో హీరో విక్కీ కౌశల్(Vicky Kaushal) క్యారక్టర్ కి డబ్బింగ్ కోసం ఆ చిత్ర నిర్మాతలు జూనియర్ ఎన్టీఆర్ ని సంప్రదించినట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్(Junior NTR) కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఛత్రపతి శంభాజీ మహారాజ్ క్యారక్టర్ కి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ని ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి కదూ. ఆయన బేస్ వాయిస్ కి ఎలాంటి క్యారక్టర్ పడాలో, అలాంటి క్యారక్టర్ పడింది. కచ్చితంగా తెలుగు ఈ చిత్రానికి భారీ వసూళ్లు రావడానికి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ చాలా ఉపయోగపడుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతే కాకుండా ఈ సినిమా తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డైరెక్టర్ రాజమౌళి(SS Rajamouli) ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నాడట. ఇలా తెలుగు పాపులర్ సెలబ్రిటీస్ అందరూ ఈ సినిమా కి అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు.
మన హిందూ మతాన్ని కాపాడేందుకు ఎంతో తపన పడిన ఛత్రపతి శివాజీ మహారాజ్, ఆయన తనయుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరోచిత గాధను నేటి తరం యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మన తెలుగు ఆడియన్స్ ఈ సినిమా తమ భాషలో విడుదల చేయాలని ఆ చిత్ర నిర్మాతలను ఇంతలా కోరుకుంటున్నారు. చూడాలి మరి తెలుగు లో ఈ సినిమా ఏ రేంజ్ వసూళ్లు రాబడుతుంది అనేది. కచ్చితంగా సిటీస్ లో ఈ చిత్రానికి భారీ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. మన ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయితే కేవలం తెలుగు వెర్షన్ నుండి 100 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు తెలుగు లో ‘యానిమల్’ చిత్రానికి తప్ప, ఏ హిందీ సినిమాకి వంద కోట్ల గ్రాస్ రాలేదు. అలాంటిది ఈ చిత్రానికి వస్తే, ఆ ఘనత సాధించిన మొట్టమొదటి హీరోగా విక్కీ కౌశల్ నిల్చిపోతాడు.