Donald Trump: ఈసారి ఓడిస్తే రక్తపాతమే.. ప్రజలను హెచ్చరించిన ట్రంప్‌!

రిపబ్లికన్‌ పార్టీ నేత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన సంచలన వ్యాఖ్యలపై అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఈమేరకు బైడెన్‌ వర్గం ఒక ప్రకటన విడుదల చేసింది.

Written By: Raj Shekar, Updated On : March 17, 2024 2:18 pm

Donald Trump

Follow us on

Donald Trump: అగ్రరాజ్యాం అమెరికాలో ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇప్పటికే బరిలో నిలిచేదు ఎవరో తేలిపోయింది. రిపబ్లికన్స్‌ తరఫున డొనాల్డ్‌ ట్రంప్, డెమొక్రట్స్‌ తరఫున జోబైడెన్‌ బరిలో నిలవనున్నారు. గత ఎన్నికల్లో ఈ ఇద్దరే పోటీ పడ్డారు. కానీ బైడెన్‌ను విజయం వరించింది. ఈసారి మళ్లీ వాళ్లిద్దరే తలపడుతున్నారు. అయితే ఈసారి గెలుపపై ధీమాతో ఉన్న ట్రంప్‌ అమెరికన్లకు ఓ హెచ్చరికా జారీ చేశారు. దానికి ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌ కూడా అంతే కౌంటర్‌ ఇచ్చారు. ట్రంప్‌ ఏమని హెచ్చరించాడు, బైడెన్‌ ఎలా కౌంటర్‌ చేశాడో తెలుసుకుందాం.

గెలవకపోతే.. రక్తపాతమే..
‘నవంబర్‌ 5.. ఈ తేదీని అందరూ గుర్తు పెట్టుకోండి. దేశ చరిత్రలో ఇది అతి ముఖ్యమైనది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌. అత్యంత వేస్ట్‌ ప్రెసిడెంట్‌. ఈసారి జరిగే ఎన్నికల్లో నేను గెలవాలి. నేను గెలవకపోతే రక్తపాతమే’ అని ఓహాయోలో జరిగిన ఎన్నికల ర్యాలీలో డోనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. అయితే నాతను ఓడిపోతే రక్తపాతం జరుగుతుందని ఏ ఉద్దేశంతో అన్నారో స్పష్టత లేదు. కానీ అటోమొబైల్‌ ఇండస్ట్రీ ప్రమాదంలో ఉందని కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. చైనీయులు, మెక్సికన్లు కార్లు తయారు చేసి అమెరికాకు పంపుదామని చూస్తున్నారని, అందుకే తాను గెలవకపోతే రక్తపాతం జరుగుతుందని ట్రంప్‌ హెచ్చరించి ఉంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు. తాను అధికారంలోకి వస్తే చైనా కార్లు దేశంలోకి రానివ్వనని ట్రంప్‌ తెలిపారు.

కౌంటర్‌ ఇచ్చిన బైడెన్‌..
రిపబ్లికన్‌ పార్టీ నేత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన సంచలన వ్యాఖ్యలపై అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఈమేరకు బైడెన్‌ వర్గం ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో ‘2020, జనవరి 6న జరిగిన హింస అమెరికన్లందరికీ గుర్తుంది. దానిని మళ్లీ రిపీట్‌ చేయాలని ట్రంప్‌ చూస్తున్నారు. ఆయనొక లూజర్‌. ప్రజలు చాలా తెలివైనవారు. ఈసారి కూడా ట్రంప్‌ను ఓడిస్తారు. హింసతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని కూడా ఓడిస్తారు’ అని పేర్కొన్నారు.

తీర్పు తారుమారుకు యత్నం..
ఇదే విషయంపై వాషింగ్‌టన్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో కూడా బైడెన్‌ మాట్లాడారు. ‘స్వేచ్ఛపై దాడి జరుగుతోంది. 2020 ఎన్నికల్లో చెప్పిన అబద్ధాలు, ప్రజాతీర్పును తారుమారు చేయాలని చేసిన ప్రనయత్నాలు, జనవరి 6న జరిగిన ఘటన ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారాయి. 2020 వాళ్లు ఓడిపోయారు. అయినా అమెరికాకు వారి నుంచి ప్రమాదం పొంచే ఉంది’ అని బైడెన్‌ తెలిపారు.

బరిలో ఇద్దరూ పెద్దవారే..
ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోబైడెన్, ట్రంప్‌ పోటీ చేయడం దాదాపు ఖాయం. అయితే ఇద్దరూ వయసులో పెద్దవారే. ఇదే విషయమై అమెరికన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిపైనా బైడెన్‌ స్పందించారు. పోటీ చేస్తున్న ఇద్దరు పెద్దవాల్లలో ఒకరి మానసిక పరిస్థితి సరిగా లేదు. ఇంకొకరు నేను అని బైడెన్‌ తాను రెడీ అని చెప్పకనే చెప్పుకున్నారు.