https://oktelugu.com/

Home Loan: రూ.30 లక్షల గృహ రుణం తీసుకుంటే 20 ఏళ్ల తరువాత ఎంత చెల్లించాలో తెలుసా?

ఈ బ్యాంకు గృహ రుణాలపై 8.40 శాతం వడ్డీని విధిస్తోంది.మహిళల పేరు మీద లోన్ తీసుకుంటే ప్రత్యేక రాయితీలు అందిస్తారు. అలాగే ఆదాయం, వయస్సు మొదలైన వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటారు. ముఖ్యంగా ఖాతాదారుడి సిబిల్ స్కోరు బాగుండాలి. ఈ

Written By:
  • Srinivas
  • , Updated On : March 17, 2024 / 02:22 PM IST

    Home loan

    Follow us on

    Home Loan:  ఇల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అందుకు అవసరమైన ఆదాయం సమకూరాలంటే చాలా సమయం పడుతుంది. కొందరు జీవితాంతం కష్టపడినా ఇల్లు కట్టుకోలేరు. దీంతో బ్యాంకు లోన్ ద్వారా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటారు. బ్యాంకు కస్టమర్ల ఆర్థిక వ్యవహారాలతో పాటు కొన్ని డాక్యుమెంట్స్ బేస్ చేసుకొని చాలా బ్యాంకులు గృహ రుణాలు అందిస్తాయి. కానీ ఆయా బ్యాంకుల్లో వడ్డీ రేట్లు రకరకాలుగా ఉంటాయి. అయితే ఓ బ్యాంకులో మాత్రం వినియోగదారులకు అనుగుణంగా వడ్డీ రేటు అందిస్తోంది. ఆ బ్యాంకు ఏది? అందులో వడ్డీ రేటు ఎంత? ఆ వివరాల్లోకి వెళితే..

    గృహ రుణాలు తీసుకోవాలనుకునేవారికి ఇండియన్ బ్యాంకు తక్కువ వడ్డీతో హోమ్ లోన్ అందిస్తోంది. ఈ బ్యాంకు గృహ రుణాలపై 8.40 శాతం వడ్డీని విధిస్తోంది.మహిళల పేరు మీద లోన్ తీసుకుంటే ప్రత్యేక రాయితీలు అందిస్తారు. అలాగే ఆదాయం, వయస్సు మొదలైన వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటారు. ముఖ్యంగా ఖాతాదారుడి సిబిల్ స్కోరు బాగుండాలి. ఈ బ్యాంకులు ఆస్తి విలువలో 90 శాతం రుణం లభించడంతో ఆసక్తి చూపుతున్నారు.

    ఒక వ్యక్తి ఇండియన్ బ్యాంకులో లోన్ తీసుకుంటే ఈఎంఐ ఎలా చెల్లించాలనే విషయానికొస్తే.. ఒక ఇల్లు నిర్మించడానికి రూ.30 లక్షల రుణం తీసుకొని 20 ఏళ్ల పాటు టెన్యూర్ విధించుకుంటే నెలకు రూ.25,545 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా 20 ఏళ్ల పాటు 30 లక్షల రుణంపై రూ.32,02,832 వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ.30 లక్షల రుణం తీసుకుంటే 20 ఏళ్ల తరువాత రూ.30 లక్షల తో పాటు రూ.32,02,832 కలిపి 62.02.832 చెల్లించాలి.

    ఇండియన్ బ్యాంకులో హోమ్ లోన్ కావాలంటే గతంలో బ్యాంకు వ్యవహారాల్లో ఖాతాదారుడి రిమార్క్ లేకుండా ఉండాలి. అంతేకాకుండా మినిమం డాక్యుమెంట్స్ అవసరం ఏర్పడుతాయి. వీటిలో ఆధార్ కార్డ్, పాస్ పోర్ట్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, విద్యుత్ బిల్లు, 6 నెలల జీతం పాటు పే స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్, 3 సంవత్సరాల ఆదాయపు పన్నుకు సంబంధించిన పత్రాలు అవసరం ఏర్పడుతాయి.