Donald Trump(6)
Donald Trump: అమెరికాలోని అక్రమ వసదారులను గుర్తించి వారం రోజులుగా స్వదేశాలకు పంపిస్తున్న అధ్యక్షుడు ట్రంప్.. ఇప్పుడ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్రమ వసలదారులను వెనక్కు పంపించే ప్రసిక్తి లేదని స్పష్టం చేశారు. అక్రమ వలసదారులను ఫెడరల్ అధికారులు అదుపులోకి తీసుకుని తరలించేందుకు అవసరమైన లేకెన్ రిలే చట్టానికి అక్కడి చట్ట సభలు ఆమోదించాయి. ఆ ఫైల్‌పై ట్రంప్ తలి సంతకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా పౌరులకు ముప్పు కలిగించే క్రిమిల్స్‌ను విడిచిపెట్టమని స్పష్టం చేశారు. కొందరిని దేవం నుంచి పంపిస్తాం. అయితే కొందరు అత్యంత క్రూరులు ఉన్నారు. వారిని స్వదేశానికి పంపించే ప్రసక్తి లేదు. వాళ్లను నరకంలాంటి గ్వాంటనామో జైలుకు తరలిస్తాం. సుమారు 30 వేల మంది కోసం అక్కడ బెడ్లు సిద్ధం చేయించే ఆదేశాలు త్వరలో జారీ చేస్తామని స్పష్టం చేశారు.
గ్వాంటనామో బే నరకమే..
క్యూబాలోని గ్వాంటనామో బేలో ఈ జైలు ఉంది. నావల్ స్టేషన్ గ్వాంటనామో బే పరిధిలో ఉంది. అమెరికా మిలటరీ ప్రిజన్. భూమ్మీద నరకంగా ఈ జైలును అభివర్ణిస్తారు. ఉగ్రవాదుల బంధీఖానాగా దీనికి పేరుంది. సెప్టెంబర్ 11 దాడుల తర్వాత 2012లో అప్పటి అధ్యక్షుడు బుష్ ఈ జైనులు ప్రారంభించారు. 9/11 దాడుల్లో పాల్గొన్నవాళ్లను అమెరికా ఇక్కడే నిర్బంధించింది. ఇక్కడి ఖైదీలను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేస్తుంటారు. 2025, జనవరి నాటికి ఈ జైలులో 48 దేశాలకు చెందిన 780 మందిని బందీలుగా ఉంచారు. అయితే 756 మందిని వెనక్కి పంపించారు. కస్టడీలో 9 మంది చనిపోయారు. ఇంకా కేవలం 15 మంది మాత్రమే ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు.
2002లో ప్రారంభం…
ఈ జైలును 2002 నుంచి దశలవారీగా నిర్మించబడిన గ్వాంటనామో బే నిర్బంధ శిబిరం (తరచుగా గిట్మో అని పిలుస్తారు, ఇది నావికా స్థావరానికి కూడా ఒక పేరు) ముస్లిం మిలిటెంట్లను ఉంచడానికి ఉపయోగించబడింది. ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ మరియు ఇతర ప్రాంతాలలో అమెరికా దళాలకు పట్టుబడిన తీవ్రవాదులను ఇందులోనే ఉంచారు. ఆఫ్ఘనిస్తాన్ (1996–2001)ను పాలించిన ఇస్లామిక్ ఛాందసవాద వర్గమైన తాలిబాన్ కోసం పోరాడేవారు, అల్– ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్, అతని అనుచరులు. చివరికి అనేక దేశాలకు చెందిన వందలాది మంది ఖైదీలు ఎటువంటి అభియోగాలు లేకుండా, వారి నిర్బంధాలను సవాలు చేసే చట్టపరమైన మార్గాలు లేకుండా శిబిరంలో ఉంచబడ్డారు.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Donald trump has taken a key decision on illegal immigrants in america
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com