ENG U19 Vs SA U19: సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత.. సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత..స్మార్ట్ ఫోన్ మన జీవితంలో తీవ్రమైన మార్పులు తీసుకొచ్చిన తర్వాత.. ప్రతి విషయం వెంటనే తెలిసిపోతుంది. ఇందులో కొన్ని విషయాలు మనకు అమితమైన ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అటువంటిదే ఇది కూడా. క్రికెట్లో అనేక ఫోటోలు సంచలనంగా మారుతుంటాయి. కొన్ని వీడియోలు ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. అటువంటి వాటికి విపరీతమైన ఆదరణ ఉంటుంది.
క్రికెట్లో నవ్వు తెప్పించే క్యాచులు, రన్ అవుట్ లు అరుదుగా జరుగుతుంటాయి. అయితే ఇటువంటి వాటిని పాకిస్తాన్ ఆటగాళ్లు ఎక్కువగా చేస్తుంటారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. పైగా పాకిస్తాన్ ఆటగాళ్లు సహనాన్ని ఊరికనే కోల్పోతుంటారు. మైదానంలో చిన్న పిల్లల మాదిరిగా వ్యవహరిస్తుంటారు. అందువల్లే సోషల్ మీడియాలో వారు విపరీతమైన ట్రోల్ కు గురవుతుంటారు. అయితే ఈసారి మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియోలో పాకిస్తాన్ ఆటగాళ్లు లేరు. ఇంగ్లాండ్ – సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఇంత సంఘటన చోటు చేసుకుంది. అది చూస్తే మాత్రం నవ్వు అసలు ఆగదు.
తప్పు లేకపోయినప్పటికీ
ఇంగ్లాండ్ అండర్ -19, సౌత్ ఆఫ్రికా అండర్ -19 జట్ల మధ్య ఓ మ్యాచ్ జరిగింది.. ఈ మ్యాచ్లో ఆటగాడు వినూత్నమైన విధానంలో అవుట్ అయ్యాడు.. ఆర్యన్ సావంత్ అనే ఆటగాడు బంతిని గట్టిగా కొట్టాడు. ఆ బంతి కాస్త స్క్వేర్ లెగ్ లో ఉన్న ఫీల్డర్ దగ్గరికి వెళ్లిపోయింది.. అయితే ఆ బంతిని ఆర్యన్ సావంత్ బలంగా కొట్టడంతో అది ఫీడర్ హెల్మెట్ కు గట్టిగా తగిలింది. అంతేకాదు రివర్స్ వచ్చి నేరుగా వెళ్లి స్టంప్స్ ను పడగొట్టింది.. షాట్ కొట్టిన బ్యాటర్.. బంతి ఫీల్డర్ కు తగలడంతో.. ఏం జరిగిందో తెలుసుకోవడానికి ముందుకు వచ్చి కాస్త ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అదే సమయంలో వెనక్కి వచ్చిన బంతి ఒక్కసారిగా వికెట్లను పడగొట్టింది. దీంతో ఎంపైర్ రెండవ మాటకు తావు లేకుండా ఆ బ్యాటర్ ను రన్ అవుట్ గా ప్రకటించాడు.
బౌలర్ తో పాటు స్లిప్ లో ఉన్న ఫీల్డర్ అప్పీల్ చేశాడు. దీంతో అంపైర్ బ్యాటర్ ను అవుట్ అని ప్రకటించాడు. ఒకవైపు బ్యాటర్ అవుట్ అయ్యాడానే ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటూనే.. బంతి తగిలి కింద పడిపోయిన ఫీల్డర్ వద్దకు చేరుకొని పరామర్శించారు. అతడిని సముదాయించారు. తన ప్రమేయం లేకపోయినప్పటికీ.. తను తప్పు చేయకపోయినప్పటికీ అవుట్ కావడంతో.. ఆ బ్యాటర్ కాస్త కూరుకు పోయాడు. నిరాశతో మైదానాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో హల్ చల్ సృష్టిస్తోంది. అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ఈ బ్యాటర్ కంటే దురదృష్టవంతుడు ఎవరూ ఉండాలని పేర్కొంటున్నారు. దరిద్రం మన చుట్టూ ఉంటే అరటి పండు తిన్నా పన్నవిరుగుతుందని.. ఆ సామెత ఇటువంటి ఆటగాళ్ల విషయంలో నిజమవుతుందని నెటిజన్లు పేర్కొంటున్నారు.
You have seen catches being taken after the ball was struck into the helmet of a short leg fielder
BUT
Have EVER seen someone runout off the helmet of a short leg fielder? pic.twitter.com/5PEgAKUr0c
— Werner (@Werries_) January 29, 2025