Donald Trump (9)
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నిన 17 ఏళ్ల యువకుడు, ఆర్థిక అవసరాల కోసం తన తల్లిదండ్రులను అతి దారుణంగా కాల్చి చంపేశాడు. ఈ కేసు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు అధికారులను ఉలిక్కిపడేలా చేశాయి. సోషల్ మీడియా ద్వారా రష్యాకు చెందిన వ్యక్తితో సంబంధాలు, డ్రోన్ కొనుగోలు, ఉక్రెయిన్(Ucrain)కు పారిపోయే ప్లాన్‌తో ఈ యువకుడు దేశవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించాడు.
Also Read: ఐఫోన్ అమెరికాలో ఎందుకు తయారు కాదు? స్టీవ్ జాబ్స్ సమాధానం వెనుక నిజాలు
విస్కాన్సిన్‌లోని మిల్వాకీ సమీపంలోని వాకేషా కౌంటీలో నివసించే 17 ఏళ్ల నికిటా క్యాసప్(Nikita Cyasap), 2025 ఫిబ్రవరి 11న తన తల్లి టటియానా క్యాసప్(44), సవతి తండ్రి డొనాల్డ్ మేయర్ (51)లను వారి నివాసంలోనే తుపాకీతో కాల్చి హత్య చేశాడు. ఈ దారుణం తర్వాత, అతడు షాకింగ్‌గా కొన్ని వారాల పాటు మృతదేహాలతోనే ఇంట్లో గడిపాడు. ఆ తర్వాత, ఇంట్లోని 14,000 డాలర్ల నగదు, పాస్‌పోర్ట్(Pass port), ఇతర వస్తువులతోపాటు పరారీ అయ్యాడు. స్థానికులు ఇంటి నుంచి వచ్చిన దుర్వాసన గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ హత్యలు వెలుగులోకి వచ్చాయి. మార్చి 2025లో కాన్సస్(Cansas)లో నికిటాను పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తులో అతడి కుట్రలు, హత్యల వెనుక ఉన్న ఉద్దేశాలు బయటపడ్డాయి.
ట్రంప్‌పై హత్యా కుట్ర..
దర్యాప్తులో వెల్లడైన అతి భయంకరమైన విషయం ఏమిటంటే, నికిటా క్యాసప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump)ను హత్య చేసేందుకు కుట్ర పన్నాడు. ఈ పథకానికి అవసరమైన ఆర్థిక స్వేచ్ఛ, సౌకర్యాల కోసమే అతడు తన తల్లిదండ్రులను హత్య చేసినట్లు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) గుర్తించింది. తల్లిదండ్రులకు ఈ కుట్ర గురించి తెలిసి ఉండవచ్చని, అందుకే వారిని చంపి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. నికిటా తన పథకాన్ని అమలు చేసేందుకు డ్రోన్(Drone), పేలుడు పదార్థాలు కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. అతడు ట్రంప్‌ను హత్య చేసిన తర్వాత ఉక్రెయిన్‌కు పారిపోవాలని ప్లాన్ చేసుకున్నాడని అధికారులు తెలిపారు. ఈ కుట్రలో భాగంగా అతడు రష్యాకు చెందిన ఓ వ్యక్తితో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.
సోషల్ మీడియా ద్వారా కుట్రలు
నికిటా తన కుట్రలను సోషల్ మీడియా(Social Media) ప్లాట్‌ఫామ్‌లైన టిక్‌టాక్, టెలిగ్రామ్(Telegram)ల ద్వారా ముందుకు తీసుకెళ్లినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ యాప్‌లలో అతడు రష్యా(Russa)కు చెందిన వ్యక్తితో సంభాషణలు జరిపాడు. అతడి ఫోన్‌లో లభించిన సమాచారం ప్రకారం, ‘‘నియో–నాజీ భావజాలం కలిగిన వ్యక్తులతో’’ సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ సంభాషణల్లో ట్రంప్ హత్య, ఉక్రెయిన్‌కు పలాయనం గురించి చర్చించినట్లు తెలిసింది. అతడి ఫోన్‌లో లభించిన డిజిటల్ సాక్ష్యాలు, టెలిగ్రామ్ చాట్‌లు అతడి ప్రణాళికలను మరింత స్పష్టం చేశాయి. ఈ సమాచారం ఆధారంగా, నికిటా తీవ్రవాద భావజాలంతో ప్రభావితమై ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
దర్యాప్తు ఎలా మొదలైంది?
నికిటా నివసించిన ఇంటి నుంచి వచ్చిన దుర్వాసన గురించి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు బయటపడింది. పోలీసులు ఇంటిని సోదా చేయగా, టటియానా, డొనాల్డ్ మేయర్ మృతదేహాలు లభించాయి. అనంతరం నికిటా కోసం గాలింపు చేపట్టిన అధికారులు, కాన్సస్‌లో అతడిని అరెస్టు చేశారు. అతడి వద్ద నగదు, పాస్‌పోర్ట్, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. FBI దర్యాప్తులో నికిటా ఫోన్, కంప్యూటర్‌ల నుంచి సేకరించిన సమాచారం ఈ కుట్రను బహిర్గతం చేసింది. అతడు కొనుగోలు చేసిన డ్రోన్, పేలుడు పదార్థాలు అతడి ఉద్దేశాలను మరింత స్పష్టం చేశాయి.
నికిటా క్యాసప్ కేసు కేవలం ఒక హత్య కేసుతో ముగియలేదు. అది అమెరికా భద్రతా వ్యవస్థలను, సోషల్ మీడియా పాత్రను, యువతపై తీవ్రవాద ప్రభావాన్ని ప్రశ్నించే స్థాయికి చేరింది. ఈ ఘటన ద్వారా, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల నియంత్రణ, తీవ్రవాద నిరోధక చర్యలపై అధికారులు మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం నికిటాపై దర్యాప్తు కొనసాగుతోంది, ఈ కేసు భవిష్యత్తులో భద్రతా విధానాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Donald trump assassination plot shocking twist
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com