Indian Car In Dubai: దుబాయ్ లో దూసుకుపోతున్న భారత్ కారు.. ఏ కంపెనీదో తెలుసా?

మనదేశానికి చెందిన చాలా మంది విదేశీ కార్లను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వీటిలో స్పోర్ట్స్, లగ్జరీ కార్లు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇండియాకు చెందని కొన్ని కార్లు విదేశాల్లో ఎక్కువగా లైక్ చేస్తారు. ఇప్పటి వరకు భారత కంపెనీల పలు కార్లను విదేశీ గడ్డపై సక్సెస్ సాధించాయి. కొన్ని కార్లకు ఇండియాలో పట్టించుకోనప్పటికీ విదేశీలు మాత్రం ఎక్కువగా లైక్ చేసినవి ఉన్నాయి.

Written By: Srinivas, Updated On : November 1, 2024 11:56 am

Indian-Cars-in-dubai

Follow us on

Indian Car In Dubai: మనదేశానికి చెందిన చాలా మంది విదేశీ కార్లను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వీటిలో స్పోర్ట్స్, లగ్జరీ కార్లు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇండియాకు చెందని కొన్ని కార్లు విదేశాల్లో ఎక్కువగా లైక్ చేస్తారు. ఇప్పటి వరకు భారత కంపెనీల పలు కార్లను విదేశీ గడ్డపై సక్సెస్ సాధించాయి. కొన్ని కార్లకు ఇండియాలో పట్టించుకోనప్పటికీ విదేశీలు మాత్రం ఎక్కువగా లైక్ చేసినవి ఉన్నాయి. తాజాగా భారత్ లో తయారైన కారు దుబాయ్ (United Emirates Arab) లో దూసుకెళ్తోంది. ఈ కారు ఇండియాలో ఉన్నప్పటికీ ఇక్కడి కంటే అక్కడి వారే ఎక్కువగా లైక్ చేస్తున్నారు. అయితే వీటి ఫీచర్లలో తేడాలు ఉన్నాయి. అంతేకాకుండా అక్కడి వాతావరణానికి తగిన విధంగా ఫీచర్లు ఉండడంతో దీనినిఎక్కువగా లైక్ చేస్తున్నారు. ఇంతకీ ఆ కారు ఏదంటే?

భారత్ లో సుజుకీ కంపెనీని చెందిన కార్లు ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ కంపెనీకి చెందిన Fronx వివిధ వేరియంట్లలో ఇప్పటికే ఇండియాలో అందుబాటులో ఉంది. కానీ ఇక్కడ దీనిని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇవే మోడళ్లు దుబాయ్ లో GL, GLX వేరియంట్లను దుబాయ్ లో రిలీజ్ చేశారు. ఇవి జీటా, అల్పా వేరియంట్ల మాదిరిగానే ఉన్నాయి. అయితే ఇందులో ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో నడిచే వాహనాలు మాత్రమే ఉన్నాయి. భారత్ లో మాన్యువల్ గేర్ బాక్స్ తో కూడా అందుబాటులో ఉన్నాయి.

ఈ రెండు వేరియంట్లలో 1.5 లీటర్ K15Cగరిష్ట ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 102 బీహెచ్ పీ పవర్ వద్ద 137 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 1.0 లీటర్ టర్బోఇంజిన్ పై 100 బీహెచ్ పీ పవర్ 147 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దుబాయ్ వినియోగదారులను ఆకర్షించే విధంగా దీనిని ప్రీమియం లుక్ గా మార్చారు. డిజైన్ లోనూ చాలా మార్పులు చేశారు. దీంతో సుజుకీ ఫ్రాంక్స్ SUVకార్లతో పోటీ పడుతోంది. చాలా మంది ఎస్ యూవీలను కొనాలనుకునేవారు సుజుకీ ఫ్రాంక్స వైపు మళ్లుతున్నారని తెలుస్తోంది.

Maruthi SUZUKI Fronks ఇండియాలో రూ.7.52 లక్షలతో విక్రయిస్తున్నారు. కానీ ఇది దుబాయ్ లో మాత్రం రెట్టింపు ధరలో కలిగి ఉంది. ప్రస్తుతం అక్కడ ఉన్న వేరియంట్లలో GL రూ.14.10 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. GLX వేరియం్ ను రూ. 15.94 లక్షలతో సేల్స్ చేస్తున్నారు. ఎమిరేట్స్ వాసుల అభిరుచికి అనుగుణంగా ఇందులోని ఫీచర్లు ఉండడంతో వీటికి బాగా కనెక్ట్ అవుతున్నారు. అయితే ముందు ముందు ఇది ఎలాంటి సేల్స్ చేసుకుంటుంటో చూడాలి.

SUZUKI నుంచి ఇప్పటి వరకు చాల వరకు వేరియంట్లు వచ్చినప్పటికీ వీటినే ఎక్కువగా కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే యూఏఈ వాతావరణానికి అనుగుణంగా ఉండడంతో పాటు లేటేస్ట్ టెక్నాలజీ కూడిన ఫీచర్లతో పాటు ఇంజిన్ పవర్ గురించి తెలుసుకొని వినియోగదారులు ఈ కారును ఎక్కువగా లైక్ చేస్తున్నారు.