spot_img
Homeఅంతర్జాతీయంExperiment: దశాబ్దాల నుంచి ఇప్పటికీ కొనసాగుతున్న ప్రయోగం ఏంటో మీకు తెలుసా?

Experiment: దశాబ్దాల నుంచి ఇప్పటికీ కొనసాగుతున్న ప్రయోగం ఏంటో మీకు తెలుసా?

Experiment: సాధారణంగా ప్రయోగాలు అంటే ఒక రెండేళ్లు, మూడేళ్లు లేదా పదేళ్లు ఉంటాయి. కానీ ఆస్ట్రేలియాలో ఓ ప్రయోగం వందేళ్ల నుంచి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆస్ట్రేలియాలోని యూనివర్శిటీ ఆఫ్ క్వీన్స్‌లాండ్‌లోని పిచ్ డ్రాప్ ప్రయోగాన్ని 1927లో భౌతికశాస్త్ర ప్రొఫెసర్ థామస్ పార్నెల్ ప్రారంభించారు. ఇతను విశ్వ విద్యాలయంలో మొదటి భౌతికశాస్త్ర ప్రొఫెసర్. ఇతను ప్రారంభిరంచిన ఈ ప్రయోగం 1927 నుంచి ఇంకా కొనసాగుతుండంతో ఈ వైజ్ఞానిక ప్రయోగానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా లభించింది. ఈ ప్రయోగం పిచ్ నెమ్మదిగా ప్రవహించే స్వభావాన్ని వివరిస్తుంది. ఇది గది ఉష్ణోగ్రత వద్ద దృఢంగా కనిపించినప్పటికీ, పిచ్ నిజానికి చాలా జిగట ద్రవంగా ఉంటుంది. అయితే మొదట్లో ఈ ప్రయోగాన్ని ఒక శతాబ్దం మాత్రమే అనుకున్నారు. కానీ తర్వాత తెలిసింది. ఇది కేవలం శతాబ్దానికే కాకుండా ఇంకా 100 సంవత్సరాల పాటు కొనసాగుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. 1927లో ప్రారంభమైన ఈ డ్రిప్ ప్రయోగం ఇప్పటికీ కూడా కొనసాగుతోంది.

పార్నెల్ ఈ పిచ్ డ్రాప్ ప్రయోగంలో రోజు మనం వాడే పదార్థాలు చాలా ఆశ్చర్యకరమైన లక్షణాలను ప్రదర్శించగలవని వివరించడానికి రూపొందించారు. ఇందులో ఉపయోగించిన పిచ్ అనే పదార్థాన్ని తారు నుంచి తీసుకున్నారు. ప్రపంచంలోనే దీన్ని అత్యంత మందపాటి ద్రవంగా పిలుస్తారు. ఒకప్పుడు దీన్ని వాటర్‌ ఫ్రూఫింగ్ బోట్‌ల కోసం ఎక్కువగా వాడేవారు. పిచ్ చాలా నెమ్మదిగా ప్రవహిస్తుంది. నీటి కంటే 100 బిలియన్ రెట్లు ఎక్కువ జిగటగా ఉంటుంది. పార్నెల్ ఈ పిచ్ నమూనాను వేడి చేసి, మూసి వేసిన కాండంతో గాజు గరాటులో వేశారు. పిచ్ చల్లారిన తర్వాత 1930లో గరాటు కాండం కోయడానికి ప్రయత్నించాడు. ఇలా పిచ్ నుంచి గరాటు బయటకు రావడం ప్రారంభమైంది. అయితే ఈ ప్రక్రియ చాలా నెమ్మదిగా జరిగింది. మొదటి డ్రిప్ పడిపోవడానికి ఎనిమిది సంవత్సరాలు పట్టింది. మరో ఐదు డ్రిప్‌లను కూడా ఇలా చేయడానికి 40 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పట్టింది.

ఈ ప్రయోగానికి ఎలాంటి కండీషన్లు ఉండవు. సాధారణ క్యాబినెట్‌లో కూడా దీన్ని ప్రదర్శిస్తారు. అయితే పిచ్ ఉష్ణోగ్రతను బట్టి డ్రిప్ వేగం ఉంటుంది. ఈ డ్రిప్ ప్రయోగాన్ని ఎవరు ఇప్పటి వరకు చూడలేదు. దాన్ని ఫొటో తీయడానికి 2000లో కెమెరాను కూడా ఏర్పాటు చేశారు. కానీ అది రికార్డు కాలేదు. అయితే 1961 నుంచి ఈ ప్రయోగాన్ని ప్రొఫెసర్ జాన్ మెయిన్‌స్టోన్ 52 ఏళ్ల పాటు చూసుకున్నారు. పార్నెల్, మెయిన్‌స్టోన్‌కి మరణం తర్వాత 2005లో నోబెల్ బహుమతి లభించింది. ఇద్దరూ కూడా ఆ ప్రయోగం చూడకుండానే మరణించడంతో వారి సేవకు గుర్తింపుగా మరణం తర్వాత నోబెల్ బహుమతి వరించింది. ఇన్నేళ్ల పాటు ఈ ప్రయోగం జరగడం వల్ల ఇది గిన్నిస్ రికార్డులో కూడా చోటు దక్కించుకుంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Sonam Wangchuk

Sonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ కు సల్మాన్ ఇంటి భోజనం..

Sonam Wangchuk: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ మొత్తానికి తన దీక్ష విరమించారు.. నీట్ అక్రమాలపై విచారణ జరిపించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. నీట్...
Allu Arjun

Allu Arjun: అల్లు అర్జున్ తో పోటీ పడాలంటే ఆ హీరో కి ఈ క్వాలిటీ ఉండాలి…

Allu Arjun: 'ఆర్య' సినిమాతో స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో ఐకాన్ స్టార్ గా అవతరించాడు. ఈ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్...
Pakistan Economy

Pakistan Economy: బిచ్చం ఎత్తుకుంటున్న పాకిస్థాన్..

Pakistan Economy: దాయాది పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. బిచ్చం ఎత్తుకొనే స్థాయికి పతనమైంది. ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు.. ఇప్పుడైతే ఆ దేశం పరిస్థితి బాగోలేదు. ఇకపై బాగుపడుతుందనే నమ్మకం...
Jana Nayagan Movie

Jana Nayagan Movie: జన నాయకుడు మూవీ నుంచి తప్పించుకున్న స్టార్ డైరెక్టర్…

Jana Nayagan Movie: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్న నటీనటులు చాలామంది ఉన్నారు. అక్కడ హీరోలు ఎంతమంది ఉన్నప్పటికి దళపతి విజయ్ కి ఉన్న క్రేజ్ నెక్స్ట్...
Pink Diamond Conspiracy

Pink Diamond Conspiracy: తేలిపోనున్న ‘పింక్ డైమండ్’ కుట్ర!

Pink Diamond Conspiracy: 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేసింది. 2014 నుంచి 2019 వరకు టిడిపి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు చేయని ప్రయత్నం అంటూ...
Oktelugu Epaper