Homeఅంతర్జాతీయంChina : పెరిగిన విడాకులు.. 20 శాతం తగ్గిన పెళ్లిళ్లు.. చైనాలో ఇదో మహా విపత్తుగా...

China : పెరిగిన విడాకులు.. 20 శాతం తగ్గిన పెళ్లిళ్లు.. చైనాలో ఇదో మహా విపత్తుగా మారబోతోందా?

China : చైనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటు టెక్నాలజీలోనైనా.. అటు ఆర్కిటెక్చర్ లోనైనా దీనికి సాటి మరొకటి లేదు. ఇప్పటి వరకు భారీగా ఉన్న జనాభా దానికి ప్లస్ పాయింట్. అయితే రానున్న కాలంలో ఆ జనాభా భారీగా పడిపోయే అవకాశం ఉండడం చైనాకు నిద్రపట్టకుండా చేస్తోంది. ఇందుకు కారణం చైనాలో వివాహాల సంఖ్య నిరంతరం తగ్గిపోతుంది.  అదే సమయంలో దేశంలో వృద్ధుల జనాభా వేగంగా పెరుగుతుంది. మరోవైపు యువత పెళ్లి మీద ఆసక్తి చూపడం లేదు. దీని కారణంగా భవిష్యత్తులో సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. యువత సకాలంలో పెళ్లి చేసుకోవాలని, పిల్లలను కనాలని ప్రభుత్వం కోరుకుంటోంది. కానీ ప్రయత్నాలు విజయవంతం కావడం లేదు. ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు ఇదో పెద్ద సమస్య. 2024 సంవత్సరంలో చైనాలో కేవలం 61 లక్షల వివాహాలు మాత్రమే జరిగాయి. 2023లో ఈ సంఖ్య 77 లక్షలు నమోదయ్యాయి.ఈ రకంగా చూసుకుంటే పెళ్లిళ్లు 20శాతం తగ్గినట్లు. చైనాలో వివాహాల నమోదు 1986లో ప్రారంభమైంది. అప్పటి నుండి కూడా ఇదే అత్యల్ప సంఖ్య. ఇది మాత్రమే కాదు 2013లో గరిష్ట సంఖ్యలోపెళ్లిళ్లు జరిగాయి. దానితో పోల్చుకుంటే 2024లో జరిగిన పెళ్లిళ్లు సగం మాత్రమే.

తక్కువ జనన రేటు నమోదవుతున్న చైనాలో ఉన్న ఒకే ఒక అవకాశం.. ఇక్కడ ఉన్న యువత పెళ్లిళ్లు చేసుకుని పిల్లలను కనడమే.  ప్రభుత్వం దీని కోసం ప్రజలను ప్రోత్సహిస్తోంది, కానీ కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఒకే బిడ్డ విధానాన్ని అవలంబించిన చైనా ఇప్పుడు జనాభాను ఒకేసారి పెంచలేకపోతోంది. చైనాలో పిల్లలు కనాలంటే తల్లి, తండ్రి పెళ్లి నమోదు చేసుకోవడం తప్పనిసరి. అయితే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆ సంక్లిష్టతను నిర్వీర్యం చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దీని కింద అనేక రాష్ట్రాల్లో వివాహ నమోదు నిబంధన కూడా రద్దు చేసింది.  పెళ్లి  కాని యువత కూడా పిల్లలను కనగలిగేలా చేసేందుకు ఇలాంటి చర్యలకు ప్రభుత్వం పూనుకుంది. ఇ

‘చైనాలో వివాహాల సంఖ్య తగ్గుతోంది’ అని బ్లూమ్‌బెర్గ్ నివేదిక పేర్కొంది. ప్రభుత్వ విజ్ఞప్తి యువతలో ఎలాంటి ప్రభావం చూపడం లేదు. ముఖ్యంగా ద్రవ్యోల్బణం, ఆర్థిక వ్యవస్థ క్షీణత కారణంగా ప్రజలు పెళ్లిళ్లు చేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. యువత పెళ్లిన సాంప్రదాయంగా పరిగణించేందుకు సిద్ధంగా లేరు.  అంతే కాకుండా పెరుగుతున్న ఖర్చుల కారణంగా కుటుంబ బాధ్యతలు మోయలేక చేసుకున్న వివాహాలను కూడా రద్దు చేసుకుంటున్నారు.  2014లో 26 లక్షల జంటలు విడాకులు తీసుకున్నాయి. ఈ సంఖ్య 2023 కంటే ఒక శాతం ఎక్కువ. ఇది కాకుండా, 2024 లో వివాహాలు తగ్గడానికి కారణం ఈ సంవత్సరం వివాహానికి మంచి సమయంగా కూడా  కాదని భావిస్తున్నారు. చైనా నమ్మకం ప్రకారం 2024 సంవత్సరాన్ని వితంతువు సంవత్సరంగా ప్రకటించారు.

చైనాలో జనన రేటులో స్వల్ప పెరుగుదల ఉంది. కానీ 2024 సంవత్సరం వరుసగా జనాభా తగ్గిన వరుసగా మూడవ సంవత్సరం అవుతుంది. చైనాతో పాటు దక్షిణ కొరియా, ఇటలీ, రష్యా వంటి దేశాలు కూడా జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. దక్షిణ కొరియా ప్రజలు వివాహం చేసుకోవడానికి, పిల్లలను కనడాన్ని ప్రోత్సహించేందుకు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేసింది. ఇది మాత్రమే కాదు, భారతదేశంలో కూడా ఉన్నత తరగతిలో తక్కువ సంఖ్యలో పిల్లలు కనిపిస్తున్నారు. దేశ ఆర్థికాభివృద్ధితో పాటు భారతదేశంలో కూడా యువ జనాభా సంక్షోభం కూడా తలెత్తవచ్చు. ఇటీవల ఎలోన్ మస్క్ కూడా దీని గురించి ఆందోళన వ్యక్తం చేశారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular