Milan Fashion Show : ఇటలీలోని మిలన్ ఫ్యాషన్ షో లో ఏకంగా రెండు లక్షల కండోమ్స్ ను గుట్టలుగా పోసి మరీ సరికొత్త రీతిలో ప్రదర్శించడం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఫిబ్రవరి 27 వరకు కొనసాగనున్న మిలన్ ఫ్యాషన్ వీక్‌లో మొదటి రోజు బ్రాండ్‌లు తమ ఫాల్-వింటర్ 2023 కలెక్షన్‌లతో హద్దులు దాటి సెక్సీనెస్ వాతావరణాన్ని సృష్టించాయి. ఇటాలియన్ బ్రాండ్ డీజిల్ డ్యూరెక్స్ 200,000 కండోమ్ బాక్సులతో ఒక పెద్ద పర్వతంలా కుప్ప పోసి బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ గా శృంగార సమయంలో వచ్చే మూలుగు శబ్ధాలను వినిపించడం ప్రదర్శన కోసం వచ్చిన వారిని అవాక్కయేలా చేసింది.ఇదేం శృంగార ఫ్యాషన్ షోరా నాయనా అంటూ అందరూ తలపట్టుకున్న పరిస్థితి నెలకొంది.
సెక్స్ పాజిటివిటీని ప్రోత్సహించే ప్రయత్నంలో, ఏప్రిల్‌లో విడుదల కానున్న డ్యూరెక్స్‌తో సురక్షితమైన శృంగారం, డీజిల్ యొక్క రాబోయే క్యాప్సూల్ సేకరణ రెండింటినీ హైలైట్ చేయడానికి ఈ ప్రదర్శనలో ఇలా అతిగా ప్రదర్శించడం విమర్శలకు దారితీసింది. మోడల్‌లు క్రిజిస్జ్టోఫ్ జే లుకాసిక్ రూపొందించిన ఈ కండోమ్ పర్వత సెట్ చుట్టూ తిరిగడం విస్తుగొలిపింది.. ప్రచారంలో భాగంగా ఈ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా తన స్టోర్లలో 300,000 కండోమ్‌ల పెట్టెలను అందించాలని కూడా యోచిస్తోంది.
బ్రాండ్ యొక్క క్రియేటివ్ డైరెక్టర్ అయిన మార్టెన్స్ ఇలా హద్దులు దాటి బ్రాండింగ్ చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. గత సీజన్‌లో డీజిల్ యొక్క ఎస్ఎస్23 ప్రదర్శన భారీ గాలితో కూడిన కళాకృతి నిర్మాణాన్ని ప్రదర్శించి విమర్శలు కొనితెచ్చుకున్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను పొందాడు.