
Ranbir Kapoor : గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన పాన్ ఇండియన్ సినిమాలలో రణబీర్ ‘బ్రహ్మాస్త్ర’ సినిమా కూడా ఒకటి. అద్భుతమైన విజువల్స్ తో టీజర్ మరియు ట్రైలర్ దగ్గర నుండే ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించిన ఈ సినిమా విడుదల తర్వాత కేవలం యావరేజి రెస్పాన్స్ ని మాత్రమే దక్కించుకుంది. 350 కోట్ల రూపాయిల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో దిగిన ఈ సినిమా 300 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబట్టి, ఎబోవ్ యావరేజిగా నిలిచింది.
కానీ తెలుగులో మాత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ తక్కువ ఉండడంతో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. అయితే సినిమా ఫలితం ఆశించని రేంజ్ కి వెళ్లకపోయినా ఆ చిత్ర దర్శకుడు ఈ సినిమాకి సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నాడు.ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ప్రకటించిన ‘దాదాసాహెబ్ నేషనల్ అవార్డ్స్’ లిస్ట్ లో ఉత్తమ నటుడిగా రణబీర్ కపూర్ కి బ్రహ్మాస్త్ర సినిమాలో నటనకు గాను అవార్డు వచ్చింది.
రణబీర్ కపూర్ నేటి తరం సూపర్ స్టార్స్ లో అద్భుతమైన నటుడే, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ బ్రహ్మాస్త్ర సినిమాలో ఆయన నటన ఏమి లేదు, సినిమా మొత్తం విజువల్ ఎఫెక్ట్స్ మీద నడిచింది కానీ, నటీనటుల గొప్పతనం ఈ సినిమా వరకు ఏమి లేదనే చెప్పొచ్చు. అలాంటిది రణబీర్ కపూర్ కి ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు మొదలయ్యాయి.
తాజాగా జరిగిన మీడియా ఇంటరాక్షన్ లో ఒక విలేఖరి రణబీర్ కపూర్ ని ఒక ప్రశ్న అడుగుతూ ‘రీసెంట్ గా మీకు దాదాసాహెబ్ పాల్కే అవార్డు వచ్చింది కదా, దీనికి మీ స్పందన ఏమిటి’ అని అడగగా దానికి రణబీర్ కపూర్ సమాధానం చెప్తూ ‘అంత గొప్ప అవార్డు నాకు దక్కడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను.కానీ ఆ అవార్డు కి నేను అర్హుడిని కాదు, ఆ సినిమాలో నా నటన అంత గొప్పగా ఏమి లేదు’ అంటూ రణబీర్ కపూర్ స్పందించిన తీరుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.