
AusW vs IndW: అనుకున్నట్టే బలమైన ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడింది. కానీ కెప్టెన్ హర్మన్ ప్రీత్ నిర్లక్ష్యం వల్లే ఓడిపోయిందంటేనే సజావుగా ఉంటుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 172 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ లక్ష్యాన్ని ఛేధించేందుకు బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. 28 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
అయితే క్రీజులోకివచ్చిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 52 పరుగులు, జెమీమా 43 పరుగులతో రెచ్చిపోయి ఆడి టీమిండియా విజయానికి చేరువ చేశారు. కేవలం 14.4 ఓవర్లలోనే 133 పరుగులతో విజయం దిశగా నడిచిన టీమిండియాకు హర్మన్ ప్రీతీ కౌర్ నిర్లక్ష్యం కారణంగా ఓడిపోయింది.
రెండు పరుగుల కోసం వెళ్లిన హర్మన్ క్రీజులోకి టైంకు చేరినా కూడా నిర్లక్ష్యంతో బ్యాట్ ను క్రీజుపై పెట్టలేదు. ఆస్ట్రేలియా కీపర్ వికెట్లను గిరాటేయడంతో హర్మన్ ఔట్ అయ్యి వెనుదిరిగింది. ఆమె చేసిన ఈ పొరపాటే టీమిండియా ఓటమికి దారితీసింది. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ ఉమెన్ ఎవరూ రాణించకపోవడంతో టీమిండియా చివరకు 167 పరుగులకే పరిమితమైంది. 5 పరుగుల తేడాతో ఓడిపోయింది.
హర్మన్ ప్రీత్ కనుక ఆ రనౌట్ సమయంలో చురుకుగా స్పందించి క్రీజులో బ్యాట్ పెడితే భారత్ గెలిచి ఉండేది. గెలిపించేది. ఆ నిర్లక్ష్యమే టీమిండియాను సెమీస్ లోనే ఇంటిదారి పట్టించింది.
ఈ మ్యాచ్ చూసేందుకు ఇండియా నుంచి వచ్చిన బీసీసీఐ సెక్రటరీ జైషా ఎంత ఎంకరేజ్ చేసినా కూడా మన భారత మహిళలు బాగానే పోరాడినా ఆస్ట్రేలియన్ల పట్టుదల.. ఆటతీరు ముందు మనోళ్ల బలం సరిపోలేదు. ఓపెనర్లు, వన్ డౌన్ బ్యాట్స్ ఉమెన్ త్వరగా ఔట్ కావడమే టీమిండియా భారీ లక్ష్య చేధనలో ఆదిలోనే హంసపాదు అయ్యింది. హర్మన్ రనౌట్ యే మ్యాచ్ ను మలుపుతిప్పింది. భారత్ ను ఓటమి బాటపట్టించింది.