Population: ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారత్. 2023 మన దేశం ఈ ఘనత సాధించింది. దీంతో చాలా మంది ఈ విషయంలో గర్వపడ్డారు. ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతగా జనాభా పెరిగితే నిరుద్యోగం పెరగడంతోపాటు ఆహారం కొరత, ఇతర అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నాయి. ఇలాగే జనాభా పెరుగుతూ పోలే భవిష్యత్‌లో అనేక సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇది నాణేనికి ఒకవైపే. జనాభా దేశ శక్తిసామర్థ్యాలను తెలియజేస్తేంది. ఈ విషయంలో భారతీయులుగా మనం గర్వపడాల్సిందే. యువశక్తి అధికంగా ఉన్న దేశం కూడా మనదే. జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకునే జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహిస్తున్నారు. అయితే.. ఇప్పుడు ఉన్న ఈ పెరుగుదల పాతికేళ్ల తర్వతా గణనీయంగా తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. ఇలా జనాభా తగ్గినా కూడా అనేక సమస్యలు ఎదుర్కొనాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు.
1987 నుంచి జనాభా దినోత్సవం..
ప్రపంచ జనాబా 1970లో 369 కోట్లు ఉండేది. 1987 జూలై 11న ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరింది. దీంతో ఆ ఏడాది నుంచి ఏటా జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇక మనదేశంలో జనాభా గణనను కేంద్ర హోం మంత్రిత్వశాఖ, సెన్సెస్ కమిషన్ నిర్వహిస్తారు.
1881 నుంచి జన గణన..
భారత దేశంలో ప్రతీ పదేళ్లకు ఒకసారి జనాభా లెక్కిస్తున్నారు. ఇది 1881 నుంచి ప్రారంభించారు. క్రమం తప్పకుండా పదేళ్లకోసారి జనగణన చేస్తున్నారు. 1901లో భారత జనాభా 23 కోట్లుగా ఉండగా అది 1951 నాటికి 36 కోట్లకు చేరింది. ఇక 2001 నాటికి భారత జనాభా 102 కోట్లకు చేరింది. ఇక 2011 నాటికి ఈ జనాభా 125 కోట్లు దాటింది.
కోవిడ్ కారణంగా నిలిచిన జనగణన..
ఇదిలా ఉండగా ప్రతీ పదేళ్లకోసారి నిర్వహించే జనగణను 2021లో నిర్వహించలేదు. ఇందుకు కోవిడ్ కారణం. కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉన్న నేపథ్యంలో జనగణనను నలిపివేశారు. ఇక వాయిదా పడిన జగణన ఎప్పుడు నిర్వహిస్తారు. 2031లోనే నిర్వహిస్తారా.. లేక మధ్యలో నిర్వహించే అవకాశం ఉందా అనే విషయంలో కేంద్రం క్లారిటీ ఇవ్వలేదు.
800 కోట్లు దాటిన జనాభా..
ఇదిలా ఉంటే.. ప్రపంచ జనాభా ప్రస్తుతం 800 కోట్లు దాటింది. పది ప్రధాన దేశాల్లోనే ఇందులో 60 శాతం జనాభా ఉంది. వీటిలో ఆరు దేశాలు ఆసియా ఖండంలోనే ఉన్నాయి. భారత్ 17.76 శాతంతో మొదటి స్థానంలో ఉండగా, చైనా 17.72 శాతంతో రెండో స్థానంలో ఉన్నాయి. తర్వాత అమెరికా, ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నైజీరియా, రష్యా, మెక్సికో దేశాల్లో అత్యధిక జనాభా ఉంది.
2025 నాటికి వెయ్యి కోట్లు..
ఇక ప్రపంచ జనాభా 2025 నాటికి 1000 కోట్లకు చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జనాభా నియంత్రణకు ఒక్క దేశం చర్యలు తీసుకుంటే సరిపోదు. దీనిని కూడా ప్రపంచ సమస్యగా భావించాలి. అన్ని దేశాలు కలిసికట్టుగా దీనికి కార్యరచణ రూపొందించి అమలు చేయాలి. తద్వారా ఆర్థిక సమస్యల నుంచి బయటపడొచ్చు. నాణ్యమైన జీవనం కొనసాగించే అవకాశం ఉంటుంది.
తగ్గనున్న జనాబా…
ఇదిలా ఉంటే.. రాబోయే 75 ఏళ్లలో ప్రపంచ జనాభా భారీగా తగ్గిపోతుందని నిపుణులు పేర్కొంటున్నారు. 2050 నాటికి ప్రపంచంలోని చాలా దేశాల్లో నజనాల రేటుకన్నా.. వృద్ధుల రేటే అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. జపాన్, సెర్పియా, దక్షిణ కొరియా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రం జనాభా అధికంగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.
కారణాలు ఇవీ..
ఇక జనాభా రేటు తగ్గిపోవడానికి అనేక కారణాలను నిపుణులు పేర్కొంటున్నారు. శిశు మరణాలు, ఉద్యోగ భద్రత, పిల్లల సంరక్షణ, జీవన వ్యయం, వివాహ వయసు పెరగడం, కాలుష్యం, లైంగిక సామర్థ్యాలు తగ్గడం, ఆహార పదార్థాల కల్తీ వంటి కారణాలతో జనాభా రేటు భారీగా తగ్గుతుందని పేర్కొంటున్నారు. దీనినే బేబీ స్ట్రైక్ అంటారని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనం తెలిపింది. జనాభా రేటు తగ్గిపోతే.. భవిష్యత్‌లో మానవ వనరులు కొరత ఏర్పడుతుందని పేర్కొంటున్నారు.
యువ జనాభే మన బలం..
ఇక ప్రస్తుతం భారత దేశంలో యువత ఎక్కువగా ఉంది. అది మన దేశానికి బలం. చైనా, జపాన్ వంటి దేశాల్లో యువ జనాభా తగ్గుతోంది. దీనిపై ఆ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఆయా దేశాల్లో జననాల రేటు తగ్గిపోయింది. రాబోయే రోజుల్లో భారత్‌లోనూ జనాభా తగ్గుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇందుకు కారణం. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా రేటు గణనీయంగా తగ్గుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్నాటకలో జననాల రేటు స్వల్పంగా తగ్గింది. ఇక ఉత్తర భారత దేశంలో యువ జనాభా ప్రస్తుతం ఎక్కువగా ఉన్నా.. రానున్న రోజుల్లో అక్కడ కూడా జనాభా తగ్గుతుందని నివేదికలు చెబుతున్నాయి.