Homeబిజినెస్Anant Ambani Radhika Wedding: నేడు వివాహ బంధం ద్వారా ఒక్కటవ్వనున్న అనంత్ అంబానీ -...

Anant Ambani Radhika Wedding: నేడు వివాహ బంధం ద్వారా ఒక్కటవ్వనున్న అనంత్ అంబానీ – రాధికా మర్చంట్.. పెళ్లికి వచ్చే అతిధులు వీరే..

Anant Ambani Radhika Wedding: ప్రపంచంలో అతిపెద్ద శ్రీమంతుల్లో ఒకరు, భారత కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ – ఫార్మా టైకూన్ వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్ వివాహం మరి కొద్ది గంటల్లో జరగనుంది. శుక్రవారం ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో జియో వరల్డ్ సెంటర్ వేదిక వీరి పరిణయ క్రతువు సాగనుంది. గత ఏడాది నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. ఒకసారి జామ్ నగర్ లో, మరోసారి క్రూయీజ్ లో ముందస్తు వివాహ వేడుకలు జరుపుకుంది.. అత్యంత అట్టహాసంగా ఆ వేడుకలు జరిగాయి. ఆ వేడుకల అనంతరం ముఖేష్ అంబానీ కుటుంబం 50 పేద కుటుంబాల యువతీ యువకులకు వివాహం జరిపించింది. అల్లి ఖర్చులు ముఖేష్ అంబానీ కుటుంబం భరించింది. ఆ తర్వాత ప్రస్తుతం జూలై 12న వివాహం, జూలై 13, 14 న ఇతర వేడుకలు జరిపేందుకు సిద్ధమవుతోంది.

ఈ వివాహ వేడుక కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలువురు వ్యాపారవేత్తలు, దేశ విదేశాల చెందిన ప్రముఖ నటీనటులు, రాజకీయవేత్తలు, హాలీవుడ్ నటులు ఖ్లో కర్దాషియాన్, కిమ్ కర్దాషియాన్, ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్, ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్, బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్, సారా అలీ ఖాన్, జాన్వి కపూర్ వంటి వారు హాజరవుతున్నారు. బ్రిటన్ మాజీ ప్రధానమంత్రులు టోనీ బ్లేయర్, బోరిస్ జాన్సన్, అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి జాన్ కెర్రీ, స్వీడన్ మాజీ ప్రధానమంత్రి కార్ల్ బిడ్త్, కెనడా మాజీ ప్రధానమంత్రి స్టీఫెన్ హార్పర్ హాజరవుతున్నారు. మీరు మాత్రమే కాకుండా టాంజానియా అధ్యక్షురాలు హస్సన్, ఐఓసీ ఉపాధ్యక్షుడు జాన్ ఆంటోనియో, ఫిఫా అధ్యక్షుడు ఇన్ ఫాంటినో వంటి వారు కూడా రాబోతున్నారు.

ఇక ప్రముఖ వ్యాపారవేత్తలు అదానీ సంస్థ చైర్మన్ గౌతమ్ ఆదానీ, హెచ్ఎస్బీసీ హోల్డింగ్ ఛైర్మెన్ మార్క్ టక్కర్, సౌదీ ఆరాం కో చైర్మన్ నాస్సర్, బ్రిటిష్ పెట్రోలియం సీఈఓ, ఎరిక్సన్ సీఈవో, కువైట్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ఎండి బదేర్, నోకియా ఎండి టామీ ఉయిటో, మోర్గాన్ స్టాన్లీ ఎండి మైకేల్ గ్రిమ్స్, అడోబ్ సీఈవో శాంతను నారాయణ్, ముబదలా ఎండీ ఖల్దూన్, సాంసంగ్ ఎలక్ట్రానిక్స్ చైర్మన్ జే లీ, లాక్ హెడ్ మార్టిన్ గ్రూప్ సీఈవో వంటి వారు కూడా ఈ వివాహానికి హాజరవుతున్నారు. శుక్రవారం శుభ్ వివాహ్ తో వివాహ వేడుక మొదలవుతుంది. 13న శుభ్ ఆశీర్వాద్, 14న మంగళ్ ఉత్సవ్ తో వివాహ వేడుకల ఘట్టం ముగుస్తుంది.

దేశ విదేశాల నుంచి అతిధులు వస్తున్న నేపథ్యంలో ముంబైలో మూడు రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఇక వచ్చే వివివిఐపి ల కోసం ముఖేష్ అంబానీ కుటుంబం ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేసింది. వందలకొద్దీ వంటకాలతో ఆతిథ్యాన్ని అందివ్వనుంది. సంప్రదాయ, విదేశాల వంటకాలు ఈ మెనూలో ఉన్నాయి. ఈ వంటకాలు చేసే బాధ్యతను స్థానికంగా పేరు పొంది చెఫ్ లకు అప్పగించారు. ఇటీవల జామ్ నగర్ లో ముందస్తు పెళ్లి వేడుకలు జరిగినప్పుడు వంటలు చేసిన వాళ్లకే.. వివాహ వేడుకల క్యాటరింగ్ బాధ్యతను ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వందలకొద్దీ ప్రఖ్యాత చెఫ్ లు వంటకాలు తయారు చేస్తున్నారు. వివాహ వేడుకల నేపథ్యంలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని జియో వరల్డ్ సెంటర్ సందడిగా మారింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version