Rice: ప్రపంచంలో అన్నం ఎక్కువగా తినే దేశాలు ఇవీ.. ఫస్ట్ ఇండియా కాదు.. మనం ఏ స్థానంలో ఉన్నామంటే..!

అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. మనం తినే ఆహారం దేవుడితో సమానం అన్నమాట. ఆహారం లేకుండా భూమిపై ఏ జీవరాశి మనుగడ సాగించదు. చెట్లు కూడా నీరు లేకుండా బతకలేవు. అందుకే అన్నాన్ని పెద్దలు దేవుడితో పోల్చారు.

Written By: Raj Shekar, Updated On : November 5, 2024 2:54 pm

Rice

Follow us on

Rice: వరి ఎక్కువగా పండే దేశాల్లో భారత దేశం ఒకటి. ఇక్కడ పండే వరినే మనం బియ్యంగా మార్చి ఆహారంగా తీసుకుంటున్నాం. అన్నం లేనిదే మనుగడ లేదు. అయితే ఇటీవల సాగు విధానంలో వచ్చిన మార్పులు.. విచ్చలవిడిగా రసాయన ఎరువుల వాడకంతో ఇప్పుడు బియ్యం అన్నం కూడా అనారోగ్యాలకు కారణం అవుతోంది. దీంతో అందరూ ఇప్పుడు పాత కాలం నాటి సేంద్రియ పంటల ఆహారం తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే సేంద్రియ పంటల ధరలు ఎక్కువగా ఉండడంతో ఇప్పటికీ రసాయన ఎరువులతో పండించిన వరి ధాన్యాన్నే బియ్యంగా మార్చి తీసుకుంటున్నాం. మన దేశంలో 90 శాతం మంది బియ్యంతో చేసిన అన్నాన్నే ఆహారంగా తీసుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే ఇప్పటికీ మూడు పూటలా అన్నం తింటారు. అన్నం తిననిదే చాలా మందికి నిద్ర పట్టదు. ఇక మన దేశంతోపాటు ప్రపంచంలో అన్నం ఎక్కువగా తీసుకునే దేశాలు ఉన్నాయి. ఇంట్లో అయినా శుభకార్యమైనా, వేడుక అయినా అన్నం, సాంబార్‌ కామన్‌. ఇక హోటళ్లలో అయితే ఫ్రైడ్‌ రైస్, బిర్యానీ రైస్‌ పేరుతో అన్నాన్ని మార్చి వడ్డిస్తుంటారు.

చైనా మొదటి స్థానం..
ఇక ప్రపంచంలో అన్నం ఎక్కువగా తినే దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలో బియ్యంలో 30 శాతం చైనాలోనే ఉత్పత్తి అవుతుంది. దీంతో చైనీయులు కూడా బియ్యంతో చేసిన అన్నమే ఎక్కువగా ఆహారంగా తింటారు. తర్వాత స్థానంలో భారతదేశం ఉంది. మూడో స్థానంలో ఇండోనేషియా ఉంది. నాలుగో స్థానంలో బంగ్లాదేశ్‌ ఉంది. తరావతి స్థానాల్లో వియత్నా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్‌ ఉన్నాయి.

మన దేశంలో కూడా భిన్నంగా..
ఇక మన దేశంలో కూడా అన్నం తినడంలో తేడాలు ఉన్నాయి. దక్షిణ భారతీయులు ఎక్కువగా బియ్యంతో చేసిన అన్నమే తింటారు. ఉత్తర భారత దేశానికి వచ్చే సరికి గోధుమలతో చేసిన చపాతీలు, జొన్నలు, చిరు ధాన్యాలతో చేసిన ఆహారం ఎక్కువా తీసుకుంటారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే సన్న బియ్యం మాత్రమే ఎక్కువగా తింటారు. తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్రతో దొడ్డు బియ్యం ఎక్కువగా తింటారు. ఈశాన్య భారతంలో ఎక్కువగా చిరుధాన్యాలతో చేసిన ఆహారం, పండ్లు తింటారు.