https://oktelugu.com/

Costly Shoe: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన షూ.. దీని ఖరీదు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు

ప్రపంచంలో అత్యంత ఖరీదైన షూ ఉంది. మహా అయితే వీటి ఖరీదు ఒక లక్ష వరకు ఉంటుందని మీరు అనుకోవచ్చు. కానీ ఈ ప్రపంచంలో ఉన్న అత్యంత ఖరీదైన షూ ధర కోట్లలో ఉందంటే నమ్మగలరా. కాళ్లకు ధరించే షూ ధర కోట్లలో ఉందనే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇలాంటి షూలను కొనాలంటే తప్పకుండా ఆస్తులు అమ్మకోవాల్సిందే.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 4, 2024 / 05:04 PM IST

    costly shoe

    Follow us on

    Costly Shoe: ఈ ప్రపంచంలో ఖరీదైన వస్తువులు చాలా ఉన్నాయి. వీటిని ఎక్కువగా ధనవంతులు వాడుతుంటారు. వీరు ఎక్కువగా కాస్ట్లీ వస్తువులనే వాడుతుంటారు. ధరించే దుస్తుల నుంచి వేసుకునే చెప్పుల వరకు కాస్ట్లీనే వాడుతారు. ఏదో ఒకసారి రెండు సార్లు వేసుకునే వాటి కోసం ఇంత ఖర్చు పెట్టడమా అని అనుకుంటారు. ముఖ్యంగా చెప్పులకు అయితే ఎక్కువగా ఖర్చు పెట్టరు. ఎందుకంటే కొన్ని రోజులు వాడిన తర్వాత పాడవుతాయని ఎక్కువ ఖర్చు పెట్టరు. అయితే ప్రపంచంలో అత్యంత ఖరీదైన షూ ఉంది. మహా అయితే వీటి ఖరీదు ఒక లక్ష వరకు ఉంటుందని మీరు అనుకోవచ్చు. కానీ ఈ ప్రపంచంలో ఉన్న అత్యంత ఖరీదైన షూ ధర కోట్లలో ఉందంటే నమ్మగలరా. కాళ్లకు ధరించే షూ ధర కోట్లలో ఉందనే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇలాంటి షూలను కొనాలంటే తప్పకుండా ఆస్తులు అమ్మకోవాల్సిందే. అయిన మధ్యతరగతి ప్రజలు వీటిని కొనుగోలు చేయడం కూడా కష్టమే. ధనవంతులు మాత్రమే ఇలాంటి ఖరీదైన షూలను కొనుగోలు చేస్తుంటారు. మరి ఈ షూ ధర ఎంత? అసలు ఎవరూ తయారు చేశారు? ఎక్కడ ఉందనే పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

    ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన షూ పేరు మూన్ స్టార్. బంగారం, వజ్రాలతో కలిపి తయారు చేసిన ఈ షూ ధర రూ.163 కోట్లు. దీన్ని ఆంటోనియో వయాత్రి 2017లో తయారు చేశారు. బుర్జ్ ఖలీఫా మోడల్‌లో తయారు చేసిన ఈ షూలో 30 క్యారెట్ల వజ్రాలను అమర్చారు. మొత్తం వాంప్ వజ్రాలతో ఈ షూని కప్పడంతో పాటు మడమను బంగారంతో తయారు చేశారు. అయితే ఈ షూని నిర్మించడానికి దాదాపుగా 9 నెలల సమయం పట్టిందట. అలాగే ఈ షూ తయారీలో 1576 సంవత్సరానికి చెందిన ఉల్క నుంచి వచ్చిన పదార్థాన్ని కూడా ఉపయోగించారు. ఇంత ఖరీదైన షూని కేవలం మిలియనిర్లు మాత్రమే కొనుగోలు చేస్తారు. సాధారణ మనుషులు కొనుగోలు చేయాలంటే వారి జీవిత కాలంలో కూడా డబ్బులు సంపాదించలేరు. ఈ షూని కొనాలంటే ఆస్తులన్నీ అమ్ముకోవాల్సిందే. అయితే షూలో ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. ఒక్కో షూ ధర కూడా కోట్లలోనే ఉంటుంది. వీటిని అందరూ కొనలేరు. ఇంత ఖరీదైన షూ బ్లాక్ కలర్‌లో ఉంటుంది. బ్లాక్ షూపైన కాస్త గోల్డెన్ కలర్‌లో ఉంటుంది. బంగారం, వజ్రాలతో ఈ షూని తయారు చేయడం వల్ల ఖరీదు కోట్లలో ఉంది. మరి ఈ షూ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.