ISRO: ఖగోళ పరిశోధనలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అద్భుతాలను సృష్టిస్తున్నది. చంద్రయాన్ ద్వారా ప్రపంచ దేశాలకు సవాల్ విసిరింది. మరి కొద్ది రోజుల్లో మానవ సహిత అంతరిక్ష యాత్రకు శ్రీకారం చుడుతోంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. కొంతమంది వ్యోమగాములను ఎంపిక చేసి వారికి శిక్షణ కూడా ఇస్తున్నది. దానికంటే ముందు సూర్యుడి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఆదిత్య అనే ప్రయోగాన్ని చేసింది. ఏకంగా సూర్యుడి మీదికి ఉపగ్రహాన్ని పంపింది. ఇది చాలదన్నట్టు ఇప్పుడు ఇస్రో మరో ప్రయోగానికి రెడీ అయింది. భానుడి గుట్టుమట్ల విప్పేందుకు కృత్రిమ సూర్య గ్రహణాన్ని సృష్టించడానికి సిద్ధమవుతోంది. ఈ ప్రయోగానికి ఆరోప అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) కు చెందిన ప్రోబా -3 మిషన్ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పెట్టింది. ఈ ప్రయోగం బుధవారం సాయంత్రం 4:06 నిమిషాలకు పీఎస్ఎల్వీ – సీ 59 రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని నిర్వహించాల్సి ఉండగా.. సాంకేతిక కారణాల వల్ల గురువారం సాయంత్రం నాలుగు గంటల 12 నిమిషాలకు వాయిదా పడింది.
ప్రోబా మిషన్ ఎలా పనిచేస్తుందంటే..
ప్రోబా -3 మిషన్ పూర్తిగా సూర్యుడి గురించి అధ్యయనం చేయడానికి.. భవిష్యత్తు కాలంలో సంభవించే మార్పులను అంచనా వేయడానికి రూపొందించిన కార్యక్రమం. ప్రోబా -3 మిషన్లో రెండు ఉపగ్రహాలు ఉంటాయి. వీటిని కరోనా గ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్, ఆక్యూల్టర్ స్పేస్ క్రాఫ్ట్ పిలుస్తారు. ఈ ఉపగ్రహాలు దాదాపు 550 కిలోల బరువు ఉంటాయి. వీటిని ఇస్రో అతి దీర్ఘ వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టింది. ప్రోబా -3 ద్వారా కృత్రిమ సూర్యగ్రహణాన్ని సృష్టిస్తారు. ఆ తర్వాత సూర్యుడి బాహ్య వాతావరణం(కరోనా) ను అధ్యయనం చేస్తారు. ఈ ప్రాజెక్టులో రెండు ఉపగ్రహాలు ఒకదానికి ఒకటి సమన్వయం చేసుకుంటూ వెళ్తాయి. ఒక నిర్ణీత విధానంలో ప్రయాణం సాగిస్తుంటాయి. అయితే ఇంతవరకు ఇలాంటి ప్రయోగాన్ని అమెరికా, చైనా, రష్యా, యూరప్ దేశాలు నిర్వహించలేదు. ఐరోపా అంతరిక్ష సంస్థ సహకారంతో ఇస్రో ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. ప్రపంచంలోనే ఈ ప్రయోగం నిర్వహించడం ఇది మొదటిసారి. “కృత్రిమ సూర్య గ్రహణం ద్వారా కరోనాను అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. సూర్యుడిలో కేంద్రక సంలీన ప్రక్రియను అధ్యయనం చేయడానికి వీలవుతుంది. తద్వారా సూర్యుడి లో భవిష్యత్తు కాలంలో జరిగే మార్పులను అంచనా వేయవచ్చు. అంతేకాకుండా ఇతర విధానాలను కూడా పరిశీలించవచ్చని” ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూర్యుడు గురించి అధ్యయనం చేయడానికి ఈ ప్రయోగం ఒక ముందడుగు లాగా ఉంటుందని వారు వివరిస్తున్నారు.
ఇస్రో ప్రయోగం వాయిదా
సూర్యుడి గురించి అధ్యయనం చేయడానికి ఇస్రో బుధవారం నింగిలోకి పంపాల్సిన ప్రోబా -3 ప్రయోగం రేపటికి వాయిదా పడింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం బుధవారం సాయంత్రం నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించాల్సి ఉంది. పిఎస్ఎల్వి సీ -59 రాకెట్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయోగాన్ని గురువారం సాయంత్రానికి వాయిదా వేశారు. తీరా రాకెట్ నింగిలోకి ప్రవేశపెడతారనగా సాంకేతిక లోకం తలెత్తడంతో గురువారానికి ప్రయోగాన్ని వాయిదా వేశారు.
Liftoff Day is Here!
PSLV-C59, showcasing the proven expertise of ISRO, is ready to deliver ESA’s PROBA-3 satellites into orbit. This mission, powered by NSIL with ISRO’s engineering excellence, reflects the strength of international collaboration.
A proud milestone in… pic.twitter.com/KUTe5zeyIb
— ISRO (@isro) December 4, 2024