Pushpa 2 The Rule: కోట్లాది మంది అభిమానులు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన అల్లు అర్జున్ ‘పుష్ప 2’ చిత్రం మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా కోసం కేవలం తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు, హిందీ , తమిళం, మలయాళం మరియు కన్నడ ఆడియన్స్ కూడా ఈ సినిమా విడుదల కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో, జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ ని చూస్తే తెలుస్తుంది. ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇటీవల విడుదలైన ఏ సినిమాకి కూడా జరగలేదు. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను సాధించిందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇది ఒక ఆల్ టైం రికార్డు అనే చెప్పొచ్చు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా క్లైమాక్స్ గురించి సోషల్ మీడియా లో లీక్ అయిన ఒక వార్త సెన్సేషనల్ గా మారింది. సుకుమార్ తన ప్రతీ సినిమాలోనూ క్లైమాక్స్ మంచి హై నోట్ మీద ముగిస్తాడు.
ఈ సినిమా క్లైమాక్స్ కూడా అదే రేంజ్ హై తో ముగుస్తుందట. ఇప్పటి వరకు ఇలాంటి క్లైమాక్స్ ఇండియన్ సినిమా హిస్టరీ లో ఏ సినిమాకి కూడా చూడలేదని, పార్ట్ 3 కి ప్రారంభం అయ్యే దిశగా డైరెక్టర్ చూపించిన లాస్ట్ షాట్ కి థియేటర్ లో ఉండే ఆడియన్స్ పరిస్థితి ఏమి అవుతుందో అనే టాక్ సోషల్ మీడియా లో బలంగా వినిపిస్తుంది. పాన్ ఇండియా రేంజ్ లో మంచి క్రేజ్ ఉన్న సినిమాలకు కేవలం రెండు మూడు సన్నివేశాలు ఉంటే చాలు, బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది. పుష్ప 2 చిత్రానికి అలాంటి సన్నివేశాలు ప్రతీ పది నిమిషాలకు ఒకటి ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఇలాంటి అద్భుతమైన కమర్షియల్ సినిమాని సుకుమార్ మళ్ళీ ఎంత కష్టపడి ప్లాన్ చేసుకున్నా తీయలేడని, ఈ సినిమాతో ఆయన రాజమౌళి ని కూడా దాటేస్తాడని అంటున్నారు.
ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడట డైరెక్టర్ సుకుమార్. కారణం ఏమిటో పూర్తిగా తెలియదు కానీ, ఎందుకో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం దేవి శ్రీ ప్రసాద్ ని కాకుండా, థమన్ ని తీసుకున్నారు. తమన్ తన నుండి ది బెస్ట్ ఈ చిత్రానికి ఇచ్చాడని అంటున్నారు. సుకుమార్ తీసిన హై సన్నివేశాలు ఒక ఎత్తు అయితే, వాటికి తమన్ జోడించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆ సన్నివేశాలను మరో లెవెల్ కి తీసుకెళ్లాయని అంటున్నారు. నేడు రాత్రి తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్ గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. సినిమాకి మంచి క్రేజ్ ఉండడంతో పలు చోట్ల వెయ్యి రూపాయిల టికెట్ రేట్స్ పెట్టినా హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్ వంటి సిటీలలో టికెట్స్ అసలు దొరకడం లేదు. పరిస్థితి చూస్తుంటే వీకెండ్ వరకు ఇలాగే ఉండేట్టు ఉంది. ఇదే ట్రెండ్ కొనసాగితే మాత్రం కచ్చితంగా ఈ చిత్రం వీకెండ్ లోపు 500 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాదిస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.