Taiwan Issue China Warning: చైనా ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందువల్లే ప్రపంచంలో ఏర్పడే ప్రతి విపత్తును తనకు అనుకూలంగా మార్చుకుంటున్నది. ఇప్పటికే తయారీ రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న చైనా.. టెక్నాలజీ, ఆటోమొబైల్, ఇంకా అనేక రకాల పరిశ్రమలను అత్యంత స్థాయిలో ఆధునికరిస్తోంది. తద్వారా ప్రపంచ మార్కెట్లను మొత్తం తన గుప్పిట్లో పెట్టుకుంది. వచ్చే రోజుల్లో ఈ విధానాన్ని చైనా జోరుగా కొనసాగిస్తే.. అమెరికా గుత్తాధిపత్యానికి కచ్చితంగా చెక్ పెడుతుంది.
ఇటీవల మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో యుద్ధం జరిగిన నేపథ్యంలో.. అమెరికా అధ్యక్షుడు చైనాలో పర్యటిస్తున్నారు. 9 సంవత్సరాలు అనంతరం ట్రంప్ అమెరికాలో పర్యటిస్తుండడం విశేషం. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో కలిసి ట్రంప్ ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొంటున్నారు. వాణిజ్యానికి సంబంధించి జరుగుతున్న చర్చలో తైవాన్ గురించి ప్రస్తావన వచ్చింది. ఈ నేపథ్యంలోనే చైనా అమెరికా మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. తైవాన్ విషయంలో హద్దు మీరి ప్రవర్తిస్తే ఆ తర్వాత పరిణామాలు వేరే విధంగా ఉంటాయని చైనా అధ్యక్షుడు ట్రంప్ కు సూచించినట్టు సమాచారం. తైవాన్ సమస్యను సక్రమంగా పరిష్కరించాలని.. అలాకాకుండా అమెరికా తన ప్రయోజనాల కోసం వేరే విధానాలకు కొనసాగిస్తే.. అప్పుడు ఘర్షణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు హెచ్చరించినట్టు తెలుస్తోంది. తైవాన్ జల సంధిలో శాంతిని పెంపొందించాలని.. స్థిరత్వ లక్షలను పరిరక్షించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో జిన్ పింగ్ వ్యాఖ్యానించినట్టు సమాచారం.
మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో యుద్ధం జరిగిన నేపథ్యంలో.. అమెరికా ఆర్థిక పరిస్థితి కాస్త ఒత్తిడికి గురైంది. ఈ క్రమంలో అమెరికా మళ్లీ ట్రేడ్ విషయంలో అన్ని దేశాలతో సంప్రదింపు జరుపుతోంది. అందులో చైనా కూడా ఉంది. చైనా ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో నేరుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అక్కడికి వెళ్లారు. చైనా అధ్యక్షుడితో భేటీ అయ్యారు. దీనిని అతిపెద్ద శిఖరాగ్ర సమావేశం అని ట్రంప్ కొనియాడారు. అనేక రకాల ఒప్పందాలు.. వాణిజ్యానికి సంబంధించిన వ్యవహారాలు.. ఎగుమతులు.. దిగుమతులకు సంబంధించిన కీలక విషయాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయని తెలుస్తోంది. అయితే తదుపరి తైవాన్ విషయంలో చైనా ఎటువంటి అడుగులు వేస్తుంది.. అమెరికా ఏ విధమైన వ్యవహారాలకు పాల్పడుతుంది.. ఈ ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభిస్తుందని రెండు దేశాలకు సంబంధించిన ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.