China vs Taiwan : ప్రపంచంలో మరో వార్ : యుద్ధానికి చైనా సిద్ధం.. సైనికులు రెడీ కావాలని ఆదేశం

ప్రపంచంలో ఇప్పటికే రష్యా–ఉక్రెయిన్, ఇజ్రాయెల్‌–హమాస్, హెజ్‌బొల్లా, ఇరాన్‌ మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో డ్రాగన్‌ కంట్రీ చైనా కూడా కయ్యానికి కాలుదువ్వుతోంది. యుద్ధానికి సిద్ధమవుతోంది.

Written By: Raj Shekar, Updated On : October 20, 2024 7:39 pm

China-Taiwan war

Follow us on

China vs Taiwan :  ప్రపంచంలో ఇప్పటి వరకు అమెరికా, రష్యా మాత్రమే ఆధిపత్య కోసం ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో డ్రాగన్‌ కంట్రీ చైనా కూడా చేరింది. తమ పొరుగు దేశాల భూములను, ఊళ్లను, వీలైదే దేశాలను కూడా తమలో కలుపుకోవడానికి దొడ్డిదారిన యత్నిస్తోంది. ఆర్థికసాయం పేరిట ఇప్పటికే మాల్దీవులు, శ్రీలంక, పాకిస్తాన్‌పై పట్టు సాధించింది. ఇక చైనాకు కొరకరాని కొయ్యలా మారిన చిన్న దేశం తైవాన్‌ను చైనాలో కలుపుకునేందుకు కుట్ర చేస్తోంది. ప్రపంచ పటం నుంచి చైనాను చెరిపే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే తైవాన్‌ చుట్టూ సైన్యాన్ని మోహరించింది డ్రాగన్‌ కంట్రీ. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తైవాన్‌ కూడా ఎక్కడా బెదరడం లేదు. దీంతో ఈ వారంలో తైవాన్‌పై సైనిక చర్యలకు చైనా సిద్ధమవుతోంది. ఆ దేశ అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చినట్లు చైనా అధికారిక మీడియా సంస్థలో కథనాలు ప్రసారం కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

మీడియా కథనం ఇలా..
చైనా వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్టీ రాకెట్‌ ఫోర్స్‌కు చెందిన బ్రిగేడ్‌ అధ్యక్షుడు షీ జిన్సింగ్‌ సందర్శించాడు. ఈ సందర్భంగా యుద్ధానికి సన్నాహాలను సమగ్రాంగా బలోపేతం చేయాలని సూచించారు. దళాలు పటిష్టమైన పోరాట సామర్థ్యాలు కలిగి ఉండేలా చూడాలని ఆదేశించారు. సైనికులు తమ వ్యూహాలను రచించుకోవాలని సూచించారు. దేశ భద్రత, ప్రధాన ప్రయోజనాలను కాపాడేందుకు సైన్యానికి సూచించినట్లు తెలిపింది.

చైనాలో అంతర్భాంగా తైవాన్‌
తైవాన్‌కు ఐక్యారాజ్య సమితి గుర్తింపు లేదు. చైనాలోని అంతర్భాగంగానే ప్రపంచం గుర్తించింది. ఫసిఫిక్‌ మహాసముద్రములోని ఓ చిన్న దీవి తైవాన్‌. అయితే చైనా నుంచి స్వాతంత్య్రము ప్రకటించుకుంది. వాస్తవ నియంత్రణాధికారము దీనిపై చైనాకు లేదు. ప్రజల భాష చైనీసు (చీనీ). అయితే తైవాన్‌ను తమలో కలుపుకునేందుకు చైనా యత్నిస్తోంది. ఇందులో భాగంగానే ద్వీపం చుట్టూ సైన్యాన్ని, యుద్ధ ట్యాంకులను మోహరించింది.

తైవాన్‌ జోలికి వెళ్లొద్దు..
ఇదిలా ఉండగా, చైనా తైవనా చుటూట సైన్యాన్ని మోహరించడంపై అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ స్పందించారు. చైనా సైనిక చర్య చేపడితే చైనా ఇబ్బంది పడుతుందన్నారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత చైనాపై సుంకాలు విధిస్తామని తెలిపారు. అమెరికా యుద్ధంలోకి దిగుతుందా అని అడగగా ఆ పరిస్థితి రాదని పేర్కొన్నారు. తైవాన్‌ను తన సొంత భూభాగంగా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలిస్తున్నట్లు చైనా పేర్కొంది.