https://oktelugu.com/

Jagapathi Babu : వెయ్యి కోట్ల ఆస్తి పోగొట్టుకొని దివాళా తీసిన జగపతిబాబు, భార్య పిల్లలకు ఏం చెప్పాడో తెలుసా?

జగపతిబాబు ఆర్థికంగా ఒక దశలో దివాళా తీశాడు. మరోవైపు చేతిలో సినిమాలు లేవు. తీవ్ర ఆర్థిక పరిస్థితుల నడుమ ఆయన విలన్ గా మారారు. వెయ్యి కోట్ల ఆస్తులు కలిగిన జగపతిబాబు దుర్భర పరిస్థితికి కారణం ఏమిటో ఆయన తెలియజేశారు.

Written By:
  • S Reddy
  • , Updated On : October 20, 2024 7:30 pm
    Jagapathi Babu

    Jagapathi Babu

    Follow us on

    Jagapathi Babu : జగపతిబాబు తండ్రి వీబీ రాజేంద్రప్రసాద్ ప్రముఖ నిర్మాత. బ్లాక్ బస్టర్ చిత్రాలు ఆయన నిర్మించారు. వీబీ రాజేంద్రప్రసాద్ కుమారుడిగా జగపతిబాబు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాడు. ఆయన మొదట్లో మాస్ హీరోగా ఎదిగే ప్రయత్నం చేశారు. కానీ బ్రేక్ రాలేదు. ఈ క్రమంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేసి సక్సెస్ అయ్యాడు. టైర్ టు హీరోగా జగపతిబాబు తనకంటూ ఓ మార్కెట్ ఏర్పాటు చేసుకున్నాడు. 2010 తర్వాత జగపతిబాబు మార్కెట్ భారీగా దెబ్బతింది. ఆయన చిత్రాలు ఆడలేదు. ఒక దశలో చేతిలో ఒక్క సినిమా కూడా లేకుండా పోయింది.

    ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. జగపతిబాబుకు వారసత్వంగా భారీగా ఆస్తులు వచ్చాయి. సుదీర్ఘ కెరీర్లో ఆయన కూడా సంపాదించారు. ఈ ఆస్తులు మొత్తం ఆవిరయ్యాయి. తాజా ఇంటర్వ్యూలో జగపతిబాబు తనకు కూడా వెయ్యి కోట్ల ఆస్తి వరకు ఉండేదని ఒప్పుకున్నారు. అది ఎలా పోయిందో కూడా తెలియజేశారు.

    నాకు ఆర్థిక నిర్వహణ తెలియదు. డబ్బులు ఎలా సంపాదించాలి. సంపాదించిన దాన్ని ఎలా కూడబెట్టాలనే విషయాలపై అవగాహన లేదు. నేను అసలు పట్టించుకోను. నా ఆస్తులు పోవడానికి జూదం, ఆడవాళ్లకు ఖర్చు చేయడం అనుకుంటారు. అది నిజం కాదు. నేను క్యాసినోకి వెళతాను. జూదం ఆడతాను. కేవలం అది నాకు ఎంటర్టైన్మెంట్ మాత్రమే. దాని వలన కోట్లు పోలేదు.

    నేను కొందరిని నమ్మాను. దాన్ని మోసం చేయడం అంటారో వాడు కోవడం అంటారో నాకు తెలియదు. ఖర్చు చేయడం వలన కొంత, అడిగినవారికి ఇవ్వడం వలన కొంత పోగొట్టుకున్నాను. ఇదంతా నా అసమర్థత వలనే జరిగింది. ఈ విషయంలో నేను ఎవరినీ తప్పుబట్టను. ఆస్తులు పోయాక నా భార్య పిల్లలకు నేను ఒకటే చెప్పాను. ఒక 30 కోట్ల రూపాయలు ఉంటే మనం హ్యాపీగా బ్రతికేయవచ్చు.

    కాబట్టి అది నేను సంపాదించగలను. అంతకంటే ఎక్కువ వస్తే బోనస్. ఒక రూ. 30 కోట్లు సంపాదిస్తే దాన్ని రూ. 300 కోట్లు చేయాలి అనుకోను. ఎక్కువ సంపాదించినా మనశ్శాంతి ఉండదు. విలన్ అయ్యాక నేను బాగానే సంపాదిస్తున్నారు. లెజెండ్ మూవీతో జగపతిబాబు విలన్ గా టర్న్ తీసుకున్నారు. ఈ మూవీ హిట్ కావడంతో జగపతిబాబుకు బ్రేక్ వచ్చింది.

    ప్రస్తుతం విలన్, క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో సైతం జగపతిబాబు బిజీ. రోజుకు జగపతిబాబు రూ. 10 లక్షలు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటారు. ఎలాంటి పాత్ర అయినా అద్భుతంగా చేయగలడు.