China: అభివృద్ధి మోజులో పడి.. అడవులను మనం నాశనం చేసుకుంటున్నాం. ఇష్టానుసారంగా గుట్టలను, పుట్టలను పెకిలించి వేస్తున్నాం. చెట్లను విచక్షణారహితంగా నరకడం వల్ల పర్యావరణం సర్వనాశనమవుతోంది. ఋతువులు గతి తప్పుతున్నాయి. అకారణంగా వర్షాలు.. కాలంతో సంబంధం లేకుండా ఎండలు.. చలిగాలులు వీస్తున్నాయి. ఫలితంగా మనిషి జీవితం అనేక మార్పులకు గురవుతోంది. దీంతో పంటలు సరిగా పడటం లేదు. ఒకవేళ పండినా విపరీతమైన చీడపీడలు ఆశిస్తున్నాయి. దీనివల్ల ఆహార కొరత ఏర్పడుతోంది. విపరీతంగా కురిసే వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోతున్నాయి. విపరీతమైన ఎండల వల్ల పంటలు ఎండిపోతున్నాయి. చలిగాలుల వల్ల మనుషుల్లో సరికొత్త రోగాలు వెలుగుచూస్తున్నాయి. ఇలా పర్యావరణం తన తీరును పూర్తిగా మార్చుకోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికైతే ఇంత అద్వానంగా ఉంది.. వచ్చే రోజుల్లో ఎలా ఉంటుందో చెప్పలేం. వీటన్నింటికీ పరిష్కారం అడవులను పెంచడమే.
Also Read: భూమిపై కూలనున్న ‘కాస్మోస్ 482’.. అసలేంటిది..?
చైనా ఆ పని చేస్తోంది..
ప్రపంచంలో అత్యధిక కాలుష్యం ఉన్న దేశాలలో చైనా కూడా ఒకటి. అయితే కరోనా తర్వాత చైనా ధోరణి పూర్తిగా మారిపోయింది. ఆ దేశం పర్యావరణహిత కార్యక్రమాలకు ఎక్కువగా శ్రీకారం చుడుతోంది. తాజాగా దేశంలో అడవిని పెంచేందుకు.. అంతకంతకు విస్తరించి ఎందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. పచ్చదనాన్ని పెంపొందించడానికి నడుం బిగించింది. ఇందులో భాగంగా చైనా తన దేశంలో ఎడారి ప్రాంతం విస్తరించకుండా అరికట్టడానికి గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ నిర్వహిస్తోంది. దీని ద్వారా ప్రతి ఏడాది కోట్లాది మొక్కలు నాటాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా దట్టమైన అడవులను సృష్టించాలని చైనా సంకల్పించింది. ఎడారి ప్రాంతాలలో ప్రతి ఏడాది కోట్ల సంఖ్యల్లో మొక్కలు నాటి.. 2050 నాటికి దేశ అటవీ విస్తీర్ణాన్ని 25% పెంచుకోవాలని నిర్ణయించుకుంది.. దీనికిగాను ఎడారి ప్రాంతంలో సారవంతమైన మట్టిని డంపు చేస్తోంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వేరు వ్యవస్థ కలిగి ఉన్న మొక్కలను నాటుతోంది. వాటికి స్ప్రింక్లర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తోంది. మొత్తంగా అడవిని సృష్టించడానికి ప్రపంచ దేశాలేవీ చేయని ప్రయత్నాన్ని చైనా చేతల్లో చూపిస్తోంది. ఇసుక తుఫాన్లు వచ్చి మొక్కలు కొట్టుకుపోకుండా ఉండడానికి.. వాటి చుట్టూ వరిగడ్డితో చేసిన ప్రత్యేకమైన జల్లెడలను మొక్కల మొదళ్ల చుట్టూ ఉంచుతోంది.
” ప్రస్తుతానికైతే ఎడారిలో సారవంతమైన మట్టిని డంప్ చేస్తున్నాం. తదుపరి దశలలో మొక్కలు నాటుతాం. ఏ ఒక్క మొక్క కూడా చనిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. ఆ తర్వాత దశలవారీగా ఇలా మొక్కలు నాటుకుంటూ వెళ్తాం. అనంతరం అక్కడ అనువైన వాతావరణం ఏర్పడిన తర్వాత.. జంతువులకు తినడానికి తిండి దొరికే పరిస్థితి ఏర్పడిన తర్వాత అక్కడ వాటిని వదిలేస్తామని” చైనా అధికారులు చెబుతున్నారు.
China Great Green Wall project
[️ wildheart_500]pic.twitter.com/TGnnMnDNwt
— Massimo (@Rainmaker1973) March 22, 2025