Fujian Aircraft Carrier: చైనా అతిపెద్ద ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎయిర్ క్రాఫ్ట్.. మనకు నష్టం, అమెరికాకు కష్టం.. ఎందుకంటే..

ఫ్యుజియాన్ అని పేరు పెట్టిన చైనా.. ఇటీవల సముద్రంలో పరీక్షించింది. రెండు సంవత్సరాలపాటు ఈ యుద్ధనౌకలో ప్రొఫల్షన్, విద్యుత్ వ్యవస్థల తీరు, స్థిరత్వాన్ని అంచనా వేస్తుంది. అనంతరం ఐదు సంవత్సరాల తర్వాత దీనిని అందుబాటులోకి తీసుకొస్తుంది.

Written By: Raj Shekar, Updated On : May 12, 2024 8:53 am

Fujian Aircraft Carrier

Follow us on

Fujian Aircraft Carrier: ప్రస్తుతం ఈ భూమి మీద ఉన్న అన్ని దేశాలలో కెల్లా అతిపెద్ద నౌకాదళ శక్తిగా చైనా ఉంది. వాస్తవానికి ఈ స్థానంలో ఒకప్పుడు అమెరికా ఉండేది. కొంతకాలంగా చైనా తన బలాన్ని పెంచుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనికోసం దండిగా నిధులు కేటాయించింది. ఫలితంగా అమెరికాను మించిపోయింది. ఇప్పుడు అంతకుమించి అనేలాగా చైనా తన శక్తిని, యుక్తిని పెంచుకునే ప్రయత్నాలు చేపట్టింది. ఇందులో భాగంగా తన అమ్ముల పొదిలో ఫ్యుజియన్ అనే యుద్ధ నౌకను తెరపైకి తీసుకువచ్చింది. అయితే ఇందులో ఎలక్ట్రో మాగ్నెటిక్ ఎయిర్ క్రాఫ్ట్ లాంచింగ్ సిస్టాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.. వాస్తవానికి ఈ విధానం ప్రపంచంలో అతిపెద్ద యుద్ధ నౌక (ఇది అమెరికా వద్ద ఉంది) “యూఎస్ ఎస్ గెరాల్డ్ ఆఫ్ పోర్డ్ “లో మాత్రమే ఉంది. అయితే దాని ఆధారంగా చైనా యుద్ధ నౌకను నిర్మించడం విశేషం.

దీనికి ఫ్యుజియాన్ అని పేరు పెట్టిన చైనా.. ఇటీవల సముద్రంలో పరీక్షించింది. రెండు సంవత్సరాలపాటు ఈ యుద్ధనౌకలో ప్రొఫల్షన్, విద్యుత్ వ్యవస్థల తీరు, స్థిరత్వాన్ని అంచనా వేస్తుంది. అనంతరం ఐదు సంవత్సరాల తర్వాత దీనిని అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ యుద్ధ నౌక బరువు 80 వేల టన్నులు. దీని పొడువు 1,036 అడుగులు. ప్యూజియాన్ కంటే చైనా వద్ద రెండు విమాన వాహక యుద్ధ నౌకలు ఉన్నాయి.. ఇందులో మొదటి దాని పేరు లియావోనింగ్, రెండవ దాని పేరు షాంగ్ డాంగ్. లియా వోనింగ్ ను 1998 లో చైనా ఉక్రెయిన్ నుంచి కొనుగోలు చేసింది. షాంగ్ డాంగ్ ను 2019లో సొంతంగా తయారు చేసుకుంది. అయితే వీటికన్నా అత్యంత అధునాతనమైనది ఫ్యూజియాన్. ఇది టేక్ ఆఫ్ కావాలంటే అతి పెద్ద రన్ వే అవసరం. యుద్ధ నౌకపై ఆ స్థాయిలో రన్ వే ఉండదు. ఇటువంటి సమయంలో యుద్ధ విమానాల టేక్ ఆఫ్ కు స్టోబార్, క్యాటోబార్ అనే పద్ధతులను అనుసరిస్తారు. స్టో బార్ అనేది షార్ట్ టేక్ ఆఫ్. క్యాటోబార్ అనేది ఆవిరి శక్తి ద్వారా విమానాలను టేక్ ఆఫ్ చేసే ప్రక్రియ.

చైనా తెరపైకి తీసుకువచ్చిన విమాన వాహక యుద్ధనౌక వల్ల హిందూ సముద్రంపై డ్రాగన్ ఆధిపత్యం పెరుగుతుంది. గత కొంతకాలంగా ఈ సముద్రంపై చైనా తన ప్రాబల్యాన్ని పెంచుకుంటున్నది. అంతేకాదు మన దేశ క్షిపణి పరీక్షలను అత్యంత దగ్గరగా చైనా పరిశీలిస్తోంది. విమాన వాహక యుద్ధ నౌకల తయారీలో చైనా , భారత్ ఒకే స్థాయిలో ఉన్నాయి. చైనా వద్ద రెండు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఉన్నాయి. మనవద్ద ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్ పేరుతో విమాన వాహక యుద్ధనౌకలున్నాయి.. ఈ నేపథ్యంలో చైనా ఫ్యూజియాన్ పేరుతో మూడవ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ను రంగంలోకి దించడం పట్ల భారత్ ఆందోళన చెందుతోంది. అంతేకాదు 2035 నాటికి ఇదే తరహాలో విద్యుదయస్కాంత శక్తితో మరో మూడు విమాన వాహక యుద్ధనౌకలను తెరపైకి తీసుకొచ్చేందుకు చైనా ప్రయత్నాలు చేస్తోంది.