https://oktelugu.com/

Speaking English : నాన్‌ ఇంగ్లిష్‌లో ఆ దేశమే నంబర్‌ వన్‌.. భారత్‌ ఏ స్థానంలో ఉందంటే..!

ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగించే భాష ఇంగ్లిష్‌(English). అందుకే దీనిని యూనివర్సల్‌ లాంగ్వేజ్‌ అంటారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఆయా దేశాల అధికార భాషతోపాటు ఇంగ్లిష్‌ వాడతారు. ఇంగ్లిష్‌ నేర్చుకుంటో ప్రపంచంలో ఎక్కడైనా జీవించొచ్చు. మన అధికార భాష హిందీ(Hindi) అయినా.. ఇంగ్లిష్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం.

Written By:
  • Raj Shekar
  • , Updated On : January 9, 2025 / 07:00 AM IST

    Speaking English

    Follow us on

    Speaking English : ఇంగ్లిష్‌.. ప్రపంచ భాష.. అన్నిరంగాల్లో ఆంగ్లానిదే పెత్తనం. ఇంగ్లిష్‌ వస్తే ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్లొచ్చు. అక్కడివారితో మాట్లాడొచ్చు. ఇక ఇంగ్లిష్‌ వాడకంలో భారతీయులు ప్రపంచ సగటును దాటిపోయారు. దేశంలో ఢిల్లీ ఇంగ్లిష్‌ వినియోగంలో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో రాజస్థాన్, పంజాబ్‌ ఉన్నాయి. ఈ విషయాన్ని పియర్సన్‌ గ్లోబల్‌ ఇంగ్లిష్‌ ప్రొఫీషియన్సీ (Pearson Global English Proficiency) వెల్లడించింది. ఈమేరకు నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం దేశంలోనే అత్యధికంగా ఇంగ్లిష్‌ మాట్లాడేవారి విషయంలో ఢిల్లీకి 63 మార్కులు వచ్చాయి. రాజస్థాన్‌కు 60, పంజాబ్‌కు 58 మార్కులు వచ్చాయి.

    ప్రపంచంలో ఇలా…
    ఇక ప్రపంచంలో ఇంగ్లిష్‌ ఎక్కువ మాట్లాడే దేశాలను పరిశీలిస్తే బ్రిటన్‌ 98.3 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. అమెరికా 95 పాయింట్లు వచ్చాయి. చైనాలో ఇంగ్లిష్‌ మాట్లాడేవారు చాలా తక్కువ. ఇక్కడ కేవలం 0.9 శాతం మంది మాత్రమే ఇంగ్లిష్‌ మాట్లాడతారు. చైనా(Chaina) ప్రజలు వారి మాతృభాషనే ప్రేమిస్తారు. సంభాషిస్తారు. చైనీస్, మంగోలియన్, టì బెటన్, ఉయర్, జువాంగ్‌ భాషల్లో ఎక్కువ మాట్లాడతారు. వరల్డ్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ నుంచి అందిన డేటా ప్రకారం బ్రిటన్‌లో జిబ్రాల్టర్‌లో 100 శాతం ప్రజలు అనర్గళంగా ఇంగ్లిష్‌ మాట్లాడతారు. ఇక్కడి జనాభా 32,669 మాత్రమే.

    భారత్‌ స్థానం…
    ఇక భారతదేశంలో 20 శాతం మంది ప్రజలు అనర్గళంగా ఇంగ్లిష్‌ మాట్లాడతారు. జనాభా పరంగా చూస్తే ఇంగ్లిష్‌ మాట్లాడే వారి సంఖ్య ప్రపంచంలో టాప్‌ 5వ స్థానంలో ఉంది. పియర్సన్స్‌ గ్లోబల్‌ ఇంగ్లిష్‌ ప్రొఫీషియన్సీ రిపోర్టు ప్రకారం.. భారత దేశంలో ఇంగ్లిష్‌ మాట్లాడేవారిలో రాజధాని ఢిల్లీ(Delhi) ముందంజలో ఉంది.