China Damage Report: ప్రకృతి బాగున్నంతవరకే మనిషి జీవితం బాగుంటుంది. ప్రకృతి కన్నెర్ర చేస్తే మనిషి జీవితం అతలాకుతలమవుతుంది. అందుకే మనిషి ప్రకృతికి తగ్గట్టుగా నడుచుకోవాలి. ప్రకృతికి అనుకూలంగా జీవనం సాగించాలి. అభివృద్ధి పేరుతో అడ్డగోలుగా ప్రవర్తిస్తే.. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రకృతి కచ్చితంగా తగిన జవాబు చెబుతుంది. ఆ జవాబు మనిషి జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అందువల్ల ప్రకృతి తో జాగ్రత్తగా మసలు కోవాలి.
ప్రకృతితో ఎక్కువగా ఈ ప్రపంచంలో ఆటలాడుకునేది అభివృద్ధి చెందిన దేశాలు మాత్రమే. అభివృద్ధి చెందిన చైనా, అమెరికా, బ్రిటన్, యూరప్ దేశాలు విపరీతమైన కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. అభివృద్ధి పేరుతో అడ్డగోలుగా పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వెలువడుతున్న కాలుష్యంలో సింహభాగం అభివృద్ధి చెందిన దేశాల నుంచే వస్తోంది. ఈ దేశాలలో ప్రకృతి విధ్వంసం ఇష్టానుసారంగా సాగిపోతున్న నేపథ్యంలో అక్కడ అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అందువల్లే ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయి. ఫలితంగా అక్కడి ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అకారణంగా వర్షాలు కురవడం.. హిమపాతం.. కరువులు కాటకాలు వంటివి చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం యూరప్ దేశాలలో విపరీతంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాస్తవానికి శీతల ప్రాంతమైన యూరప్ దేశాలలో 40 కి మించి డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం పర్యావరణవేత్తలను ఆందోళనకు గురిచేస్తుంది. అక్కడ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడం వల్ల ప్రజలు నరకం చూస్తున్నారు.
Also Read: కోవిడ్ తర్వాత పెరిగిన గుండెపోట్లు.. సంచలన క్లారిటీ ఇచ్చిన కేంద్రం
యూరప్ మాత్రమే కాదు చైనా కూడా ఇప్పుడు ప్రకృతి విపత్తులతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నది. చైనాలో ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతోంది. వాస్తవానికి ఈ కాలంలో వర్షాలు మెండుగానే కురుస్తాయి. అయితే చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా చైనాలో వడగండ్ల వర్షం కురుస్తున్నది. చైనా లోని పలు ప్రాంతాలలో వడగండ్లతో కూడిన వర్షం అక్కడ భారీగా నష్టాన్ని కలిగించింది. వడగండ్లు అదేపనిగా కురవడం వల్ల చైనాలో గృహాలు ధ్వంసమయ్యాయి. కార్లు పనికిరాకుండా పోయాయి. పలు ఇళ్లల్లో ఉన్న కిటికీలు, ఇతర ఉపకరణాలు పూర్తిగా పగిలిపోయాయి. వడగండ్లతో కూడిన వర్షం వల్ల పంట నష్టం కూడా చోటుచేసుకుంది. పలు ప్రాంతాలలో చేతికి వచ్చిన పంటలు నేలవాలాయి.. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు.
Also Read: మీరు తినే పనీర్ కల్తీనా? మంచిదా? ఎలా తెలుసుకోవాలంటే?
చైనాలో వర్షాలు కురవడం కొత్త కాకపోయినప్పటికీ.. వర్షాకాలంలో వడగండ్లతో కూడిన వర్షం కురవడం వింతగా అనిపిస్తోందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. వడగండ్ల వర్షం వల్ల తామ తీవ్రస్థాయిలో నష్టపోయామని వారు అంటున్నారు. మరోవైపు ఇటీవల కాలంలో కొత్త కొత్త ప్రాజెక్టుల కోసం చైనాలో అడవులను నరికేస్తున్నారు. గుట్టలను పెకిలిస్తున్నారు. కొత్త రహదారుల నిర్మాణం కోసం జీవ వైవిధ్యాన్ని ధ్వంసం చేస్తున్నారు. త్రీ గోర్జెస్ వంటి నీటి ప్రాజెక్టు నిర్మించడం వల్ల భూమి భ్రమించే విషయంలో మార్పులు చోటు చేసుకున్నాయని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాదు ఆ ప్రాజెక్టు వల్ల భూకంపాలు చోటుచేసుకునే ప్రమాదం లేకపోలేదని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అయినప్పటికీ చైనా పట్టించుకోవడం లేదు. పైగా సరికొత్త ఈ విధంగా అభివృద్ధి పనులు చేపట్టడానికి సిద్ధమవుతున్నది. చైనా చేస్తున్న ఈ పనుల వల్ల అక్కడ పర్యావరణం సమూలంగా మార్పులకు గురవుతోంది. దీంతో అక్కడ ప్రకృతి విపత్తులు చోటుచేసుకుంటున్నాయి. గత ఏడాది ఆకస్మికంగా కురిసిన వర్షాలు చైనా దేశంలో తీవ్రమైన నష్టాన్ని కలగజేశాయి. ఆ నష్టాన్ని మర్చిపోకముందే ఇప్పుడు చైనాలో వడగండ్ల వర్షం కురవడం ఆందోళన కలిగిస్తోంది.
View this post on Instagram