Gold Price Today: బంగారం ధరలు వరుసగా తగ్గి.. ఒక్కసారిగా పెరిగాయి. కొన్ని రోజుల తరువాత బంగారం ధరలు పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇన్వెస్ట్ మెంట్ దారులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నార. అయితే బంగారం ధరలు పెరగడానికి అనేక కారణాలు చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
బులియన్ మార్కెట్ ప్రకారం.. జూలై 2న న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,650గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.97,890గా ఉంది. జూలై 1న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.90,200తో విక్రయించారు. 10 గ్రాముల బంగారం ధర మంగళవారంతో పోలిస్తే బుధవారం రూ.450 పెరిగింది. అటు 24 క్యారెట్ల బంగారం పై రూ.490 పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
Also Read: మైత్రికి, దిల్ రాజుకు ఎక్కడ చెడింది? వీరి మధ్య వైరానికి కారణమేంటి..?
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,800 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.99,040గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.90,650 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.98,890 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.90,650 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.98,890తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.90,650 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.98,890తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.90,650తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.98,890తో విక్రయిస్తున్నారు.
బంగారం ధరలు పెరిగినా.. వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. బుధవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.1,20,000గా నమోదైంది. మంగళవారంతో పోలిస్తే బుధవారం వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.1,10,000గా ఉంది. ముంబైలో రూ.1,10,,000, చెన్నైలో రూ.1,20,000 బెంగుళూరులో 1,10,000, హైదరాబాద్ లో రూ. 1,20,000 తో విక్రయిస్తున్నారు.
మొన్నటి వరకు ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య జరిగిన యుద్ధం కారణంగా బంగారం ధరలు తగ్గాయి. ప్రస్తుతం యుద్ధం ఆగిపోవడంతో బంగారం ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. యుద్ధం లేని కారణంగా చాలా మంది బంగారంపై ఇన్వెస్ట్ మెంట్ పెడుతున్నట్లు తెలుస్తోంది.