Carnivorous plant :ఈ సృష్టి ముందుకు సాగాలంటే ఒక జీవ జాతిని మరొకటి తినేయాలి. అలా తినుకుంటూ వెళితేనే జీవుల మనుగడ సాధ్యమైంది. కీటకాల నుంచి జంతువుల వరకూ ఇలా ఒక జాతిని మరో జాతి తినుకుంటూ వస్తేనే వాటి మనుగడ ఈ సృష్టిలో సాగింది. ఆఖరుకు మనిషి కూడా మాంసాహారినే. జంతువులను తినేవాడే. అయితే శాఖాహారులైన జంతువులు మొక్కలనే ఆహారంగా తీసుకుంటాయి.మొక్కలను కూడా మనం శాఖాహారినే అనుకుంటాం. కానీ మొక్కల్లోనూ మాంసాహారులు ఉంటాయి. కొన్ని అరుదైన మొక్కలు కీటకాలను, పురుగులు, జంతువులను తింటుంటాయి. వాటి వద్దకు వెళితే గుటుక్కున మింగేస్తాయి. అలాంటివి మన దేశంలో ఇన్నాళ్లు కనిపించలేదు. కొన్ని దేశాల్లో మాత్రమే ఇవి ఉన్నాయి. ఇప్పుడు భారతదేశంలోని హిమాలయాల్లోనూ వాటి ఉనికి లభ్యమైంది. ఇదొక అద్భుతమనే చెప్పాలి.

క్రిమి కీటకాలను తిని బతికే మాంసాహార మొక్కలు ఈ సృష్టిలో ఉన్నాయి. మనదేశంలో వీటికి జాడ దొరికింది. తాజాగా శాస్తవేత్తలు పశ్చిమ హిమాలయాల్లో వీటిని కనుగొన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లాలోని మండల్ లోయలో ఈ అరుదైన మాంసాహార మొక్కలను కనుగొన్నారు. ఈ మొక్కల పేరు ‘ఉట్రిక్యులారియా ఫర్సెల్లాటా’. ఉత్తరాఖండ్ అటవీశాఖ, మొక్కల శాస్త్రవేత్తలు కలిపి వీటిని కనుగొన్నారు. ఇది తడినేలల్లోనే జీవిస్తుంది. తన చుట్టూ తిరిగే కీటకాలను ట్రాప్ చేసి మరీ దగ్గరకు రాగానే తినేస్తుంది. ఈ మాంసాహార మొక్కలను ‘బ్లాడర్ వార్ట్స్ ’ అనే జాతికి చెందినవిగా గుర్తించారు.
గతంలో మన దేశంలోనే మేఘాలయ రాష్ట్రంలో మాంసాహార మొక్కలను కనుగొన్నారు. ‘పిచర్ ప్లాంట్స్’ అనే కూజాలా ఉండే మొక్కలు కీటకాలు లోపలికి చేరగానే జీర్ణరసాలు చల్లి కరిగించేసి ఆరగించేవి. ఉత్తరాఖండ్ లోని మొక్కలు మాత్రం ట్రాప్ చేసి కీటకాలను ఆకర్షించి తింటాయి.
ఈ మాంసాహార మొక్క తన చుట్టూ నెగెటివ్ ప్రెజర్ ఏరియాను సృష్టించి కీటకాలు ఆకర్షించేలా చేస్తుంది. దోమలు, ప్రోటోజోవాలు, చిన్న చిన్న కీటకాలు దగ్గరకు రాగానే అట్టి పెట్టి మెల్లిగా దాన్ని తినేస్తాయి. కీటకాలను మొక్కలు తింటున్న వీడియోను తాజాగా శాస్త్రవేత్తలు బయటపెట్టగా వైరల్ అయ్యాయి.
సాధారణంగా పెద్దగా పోషకాలు లేని భూమిలో ఈ మాంసాహార మొక్కలు పెరుగుతుంటాయి. వాటికి కావాల్సిన పోషకాల కోసం ఇలా కీటకాలను ఆకర్షించి తింటాయి. ఈ మొక్కల్లోనూ ఔషధ గుణాలు ఉంటాయని పరిశోధకులు గుర్తించారు.
ఇక కీటకాలను తింటున్న మొక్కల వీడియోను బయటపెట్టడంతో అది వైరల్ గా మారింది. ఈ మొక్కలు తమకూ కావాలని.. ఇంట్లో పెట్టుకుంటే దోమలను తినేస్తాయని చాలా మంది ఆన్ లైన్ లో వెతుకుతున్నారు. హిమాలయాల్లోనే పెరిగే ఈ మొక్క ఇంట్లో పెంచడం సాధ్యమేనా? కాదా? అన్నది పరిశోధకులు చెప్పాల్సి ఉంది.
[…] […]