US Presidential Election 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5న జరుగనున్నాయి. గడువు సమీపిస్తుండడంతో అధికార డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, ప్రతిపక్ష రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. మీడియా సంస్థలకు ఇంర్వ్యూలు ఇస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు వరాలు ఇస్తున్నారు. ఇక ఇంటర్వ్యూల్లో గతంలో జరిగిన సంఘటనలు తెరపైకి తెచ్చి ‘బ్లాక్’ మ్యాటర్స్ అంటూ అఫ్రికా, అమెరికన్ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆఫ్రో అమెరికన్లపై వివక్ష చూపే చట్టాలను మారుస్తానని కమలా హారిస్ హామీ ఇచ్చారు. ఇక ట్రంప్ మాత్రం ఆఫ్రో అమెరికన్ మహిళలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో క్రీడల్లో ట్రాన్స్ జెండర్లు పాల్గొనకుండా నిషేధిస్తామని తెలిపారు.
ఇదీ కమలా హారిస్ వ్యూహం..
ఆఫ్రో అమెరికన్ పురుష ఓటర్లపై దృష్టిసారించిన కమలా హారిస్ ట్రంప్ అధికారంలోకి వస్తే వారికి కలిగే నష్టాలు, కష్టాలను వివరిస్తున్నారు. దేశవ్యాప్తంగా వారిపై ఉన్న వివక్షను ట్రంప్ సంస్థాగతం చేస్తారని హెచ్చరించారు. ఆఫ్రో అమెనికన్లపై వివక్ష చూపే చట్టాలకు పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. మారిజువానా కలిగి ఉండటాన్ని నేర రహితం చేస్తానని తెలిపారు. ప్రస్తుతం మారిజువానా కలిగిన ఉంటే అరెస్టు చేస్తున్నారన్నారు. ఇది ఆఫ్రో అమెరికన్లపై ప్రభావం చూసుకతోందని తెలిపారు.
– ఇళ్లు కొనుగోలు, ఆరోగ్య సేవలు, ఆర్థిక సుస్థిరత, ఓటింగ్‌లో ఆఫ్రో అమెరికన్లపై కొనసాగుతున్న వివక్షకు చరమగీతం పాడతానని హామీ ఇచ్చారు.
– బానిసల వారసులకు పరిహారం చెల్లింపుపై అధ్యయనం చేయాల్సి ఉందని తెలిపారు. దానిపై మరో ప్రశ్నకు తావు లేదని స్పష్టం చేశారు.
– అసలు ఆఫ్రో అమెరికన్లపై ట్రంప్‌కున్న విధానం ఏంటని ప్రశ్నించారు హారిస్.
– ఆఫ్రో అమెరికన్లు వ్యాపారం చేసుకోవడానికి ఆర్థికసాయం చేస్తానని హామీ ఇచ్చారు. అప్రెటిస్‌షిప్ సౌకర్యం కల్పిస్తానని తెలిపారు.
– ప్రజాస్వామ్య పరిరక్షణకు, సమస్యల పరిష్కారానికి అందరూ ఓటు వేయాలని సూచించారు ఇది మార్టిన్ ఆఫ్ ఎర్రర్ పోరు అని తెలిపారు. తాను గెలవబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు.
ట్రంప్ హామీలు ఇవీ..
ఇక ట్రంప్ ఆఫ్రో అమెరికన్ మహిళల ఓట్లపై దృష్టిపెట్టారు. అబార్షన్ హక్కుపై ఆయన పెద్దగా మాట్లాడకపోయినా మిగగిలిన విషయాలను ప్రస్తావిస్తున్నారు. తాను అధికారంలోకి వస్తే మహిళల క్రీడల్లో ట్రాన్స్ జెండర్లు పాల్గొనకుండా నిషేధిస్తానని తెలిపారు. జార్జియాలో నిర్వహించిన సభలో మహిళతో మాట్లాడారు.
– బానిసల వారసులకు పరిహారం చెల్లిస్తే కోట్ల డాలర్ల ప్రభుత్వ ధనం కావాలన్నారు.
– గత ఎన్నికల్లో బైడెన్‌కు మద్దతుగా నిలిచిన ఆఫ్రో అమెరికన్ ఓటర్లను ఆకట్టుకునేందుకు వారికి వరాలిస్తున్నారు. వారి అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు.
హోరాహోరీ ప్రచారం..
ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌కు ఇంకా 20 రోజుల గడువు మాత్రమే ఉంది. దీంతో అభ్యర్థులు ఓట్ల కోసం చెమటోడుస్తున్నారు. హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ఏ చిన్న అవకాశాన్ని వదులుకోడం లేదు. వర్గాలవారీగా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.