BLA Attack: సైన్యం పరంగా.. ఆయుధాల పరంగా.. ఆర్థికంగా అత్యంత బలవంతమైన భారతదేశంతో పెట్టుకుని పాకిస్తాన్ పెద్ద తప్పు చేసింది. ఆ ఆ తప్పుకు ఇప్పటికే తగిన శాస్తి అనుభవిస్తోంది. భారత చేస్తున్న దాడులకు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఏం చేయాలో తెలియక.. ఎటువైపు వెళ్లినా సహకారం లభించక సైలెంట్ అయిపోతోంది. ఏదో పేరుకు దాడులు చేస్తోంది గాని.. భారత్ ఇంకాస్త గట్టిగా తలుచుకుంటే ఏం జరుగుతుందో పాకిస్తాన్ కు తెలుసు. అందువల్లే ఉగ్రవాదుల భయానికి.. ఉగ్రవాద సంస్థలు ఏమంటాయోనన్న ఆందోళనతో పాకిస్తాన్ ప్రతిదాడులు చేస్తోంది. ఇక పాకిస్తాన్ లో భూకంపం చోటు చేసుకోవడంతో అక్కడ భారీ ఎత్తున నష్టం చోటుచేసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. అటు బాంబుల మోత.. ఇటు భూకంపంతో పాకిస్తాన్ తల్ల డిల్లిపోతోంది.
Also Read: నిన్న మరిది.. నేడు పీఏ..నెక్ట్స్ విడదల రజనీనేనా?
ఇప్పుడు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ..
పాకిస్తాన్ కు శత్రువులాగా మారిన బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ.. చుక్కలు చూపిస్తోంది. పాకిస్తాన్ సైనికులకు నరకం అంటే ఏమిటో లైవ్ లో ప్రజెంట్ చేస్తోంది.. ఇప్పటికే పదుల సంఖ్యలో పాకిస్తాన్ సైనికులను బలూచ్ ప్రత్యేక ఆర్మీ.. మట్టు పెట్టింది. ఆయుధాలతో.. మందు గుండు సామగ్రితో దాడులకు పాల్పడుతోంది. ఇక తాజాగా బలూచ్ ప్రత్యేక ఆర్మీ.. బలూచిస్థాన్ ప్రావిన్స్ ప్రాంతంలో 39 చోట్ల భీకరమైన దాడులు చేసింది.. కాలత్ జిల్లా మంగోచర్ పట్టణాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుంది.. అంతేకాదు ఈ ప్రాంతంలో ఉన్న పాకిస్తాన్ మిలటరీ కాన్వాయ్ లను దంతం చేస్తామని హెచ్చరించింది.. కొంతకాలంగా ఉద్యమకారుల నుంచి.. తమకు బలూచిస్తాన్ ను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. పాకిస్తాన్ పాలకులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొస్తోంది. గతంలో పాకిస్తాన్ తన సైన్యం ద్వారా ప్రత్యేక దేశం కోసం నినదిస్తున్న ఉద్యమకారులపై ఉక్కు పాదం మోపింది. ఆ తర్వాత బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ.. ఏర్పడింది. అధునాతన ఆయుధ సామగ్రిని ఏర్పాటు చేసుకుంది. ఆ తర్వాత పాకిస్తాన్ సైన్యంపై దాడిని మొదలుపెట్టింది. పాకిస్తాన్ సైన్యం పై మెరుపు దాడులు చేస్తూ బలుచ్ లోని అనేక ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టింది తాజాగా మంగోచర్ పట్టణాన్ని స్వాధీనం చేసుకొని పాకిస్తాన్ సైన్యానికి ప్రత్యేక దేశం కోసం ఉద్యమిస్తున్న వారంతా.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.. అదే తదుపరిగా మిగతా పట్టణాలను కూడా ఇదేవిధంగా స్వాధీనం చేసుకుంటామని ప్రత్యేక దేశం కోసం ఉద్యమం చేస్తున్న దళం.. స్పష్టం చేసింది. అయితే ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయాలని ఉద్యమం చేస్తున్న దళం అంతకంతకు ముందుకు రావడంతో.. పాకిస్తాన్ సైన్యం వణికి పోతోంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థం కాక తలలు పట్టుకుంటున్నది. మరోవైపు పాకిస్తాన్ పాలకులు మాత్రం మేకపోతు గాంబీర్యపు మాటలు మాట్లాడుతున్నారు. బలూచ్ దళాన్ని అణిచి వేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ అంతిమంగా జరిగే నష్టాన్ని మాత్రం బయటకి చెప్పుకోలేకపోతున్నారు.