Vidadala Rajini: విడుదల రజిని మరిది గోపీనాథ్ అరెస్టుతోనే ఏపీ పోలీసులు ఆగడం లేదు. మరిదిని అరెస్టు చేసి వదినమ్మ ను వదిలేసిన అపవాదు తమకెందుకు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించిన కేసులో రజినిని గట్టిగా ఫిక్స్ చేయాలని ఏపీ పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో ఏ -1 గా విడుదల రజని ఉన్నారు. ఆమె ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలలో బిజీబిజీగా గడుపుతున్నారు. అయినప్పటికీ ఆమెను అరెస్టు చేయకుండా పోలీసులు ఇటీవల మరిది గోపీనాథ్ ను అరెస్ట్ చేశారు. ఇప్పుడు రజిని వ్యక్తిగత సహాయకుడు శ్రీకాంత్ రెడ్డిని కూడా పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా చూస్తే ఈ కేసులో రజనీని గట్టిగానే ఫిక్స్ చేయాలని ఏపీ పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
Also Read: భారత్ – పాక్ “ఇమీడియట్ సీజ్ ఫైర్” .. ట్రంప్ ఏం చేసి ఉంటాడు?
వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రజిని మంత్రిగా పనిచేశారు. ఆమె ఉమ్మడి గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె గెలిచిన తర్వాత అనేక అక్రమాలకు పాల్పడ్డారని.. దౌర్జన్యాలకు, బెదిరింపులకు అడ్డే లేకుండా పోయిందని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత విడదల రజనికి కష్టాలు తప్పవని.. ఆమె జైలుకు వెళ్లడం తధ్యమని ఊహగానాలు వినిపించాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అది నెలల దాకా అటువంటి చర్యలేవీ ఆమెపై తీసుకోలేదు. ఇప్పుడు మాత్రం పరిస్థితిలో ఒకసారిగా రజనికి వ్యతిరేకంగా మారిపోయాయి. ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలోని పో స్టోన్ క్రషర్ యజమానిని బెదిరింపులకు గురిచేసి 2.20 కోట్లు వసూలు చేశారని ఆరోపణలు వినిపించాయి.. అయితే దీనిపై విజిలెన్స్ ఎంక్వయిరీ మొదలుపెట్టింది.. విడదల రజినితోపాటు ఆమె మరిది గోపీనాథ్, రామకృష్ణ, అప్పట్లో విజిలెన్స్ ఎస్పీగా పని చేసిన జాషువా మీద ప్రస్తుత కూటమి ప్రభుత్వం కేసులు పెట్టింది.. ఈ నేపథ్యంలో తామర విచారణకు సహకరిస్తామని.. ముందస్తుగా తమకు బెయిల్ మంజూరు చేయాలని వారంతా కోర్టులో పిటిషన్ వేశారు. దానిపై ఇప్పటికి విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ కేసులో ఏ 2గా ఉన్న జాషువా బెయిల్ కోసం కోర్టు దాకా వెళ్ళినప్పటికీ.. కోర్టు అతడి విజ్ఞప్తిని కొట్టేసింది. ఈ కేసులో ఏ -3 గా ఉన్న గోపీనాథ్ ను ఇటీవల హైదరాబాద్ లో ఏసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే రజినీని పక్కనపెట్టి గోపీనాథ్ ను అరెస్ట్ చేయడం పొలిటికల్ హీట్ ను పెంచుతోంది.. ఏ -1 ను పక్కన పెట్టి.. గోపీనాథ్ ను అరెస్ట్ చేయడం.. ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డిని కూడా అరెస్టు చేయడంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలలో కలకలం నెలకొంది. అయితే మీరు చెప్పే ఆధారాల ప్రకారం రజనీని తర్వాత అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతున్నది.
రజనీ మంత్రిగా ఉన్నప్పుడు..
” రజని మంత్రిగా ఉన్నప్పుడు ఆమెకు గోపి అన్ని తానై వ్యవహరించారు. నాడు స్టోన్ క్రషర్ యజమాని కూడా బెదిరించారు. ఆయన నుంచి డబ్బులు వసూలు చేశారు.. పోలీసుల విచారణలో కూడా అదే తేలింది. ఇక చిలకలూరిపేటలో జరిగిన అనేక వ్యవహారాలలో గోపి వెలుపెట్టారు. కీలకపాత్ర పోషించారు. అందుకే ఆయనను పోలీసులు ముందుగా అరెస్టు చేశారు. కస్టడీలో తీసుకొని విచారిస్తుండగా అనేక విషయాలు వెలుగు చూశాయి. గోపి చెప్పిన వివరాల ఆధారంగా శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.. ఇక తదుపరి తదుపరి వంతు ఎవరిదో చెప్పాల్సిన అవసరం లేదని” టిడిపి నేతలు చెబుతున్నారు.. వాస్తవానికి ఈ వ్యవహారంలో ఏసీబీ కేసు నమోదు చేసిన తర్వాత గోపీనాథ్ వ్యూహాత్మకంగా అజ్ఞాతానికి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయన కదలికలపై దృష్టి సారించిన ఏపీ ఏసీబీ అధికారులు.. హైదరాబాదులో ఉండగా అరెస్ట్ చేశారు.