Bill Gates
Bill Gates : మైక్రోసాఫ్ట్ (Microsoft) బహుశా దీని పేరు తెలియని వారు ఈ ప్రపంచంలో లేరంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడంటే ఆండ్రాయిడ్ అప్లికేషన్, ఇంకా రకరకాల సాఫ్ట్వేర్లు అందుబాటులోకి వచ్చాయి.. కానీ ఇవేవీ లేనప్పుడు కంప్యూటర్ కు మైక్రో సాఫ్టే ఆధారం. ఇప్పటికీ కూడా.. ఈ మైక్రోసాఫ్ట్ అధినేత పేరు బిల్ గేట్స్ ( Bill gates) . ప్రపంచంలో అతిపెద్ద ధనవంతుల్లో ఇతను ఒకడు. అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించి.. ప్రపంచ వ్యాప్తంగా తన సంస్థను విస్తరించిన వ్యక్తి బిల్ గేట్స్. కొన్ని వేలమందికి ఉపాధి కల్పిస్తున్న వ్యక్తి కూడా.
బిల్ గేట్స్ కేవలం ఐటి వ్యాపారం మాత్రమే కాదు.. సామాజిక సేవ కూడా చేస్తుంటాడు.. ఫౌండేషన్ ఏర్పాటు చేసి క్యాన్సర్ రోగులకు చికిత్స అందేలా చేస్తున్నాడు. అంతేకాదు ఆఫ్రికా లాంటి దేశాల్లో పేదరికం రూపుమాపడానికి తన వంతుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే అటువంటి బిల్ గేట్స్ ఆలుగడ్డలు కూడా పండిస్తాడు. చదువుతుంటే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది ముమ్మాటికి నిజం..బిల్ గేట్స్ కాల్ చేస్తున్న ఆలుగడ్డలు(potato) మెక్ డొనాల్డ్స్(McDonald’s) కంపెనీకి వెళ్తుంటాయి.. అక్కడ రుచికరమైన ఫ్రెంచ్ ఫ్రైస్ (french fries) తయారీకి కారణం అవుతుంటాయి. అయితే మెక్ డోనాల్డ్స్ కంపెనీ కేవలం బిల్ గేట్స్ సాగు చేస్తున్న ఆలుగడ్డలను కొనడానికి ప్రధాన కారణం.. బిల్ గేట్స్ రసెట్ బార్బంక్ (rasat bar bank) రకమైన ఆలుగడ్డలను సాగు చేస్తారు. ఈ ఆరుగడ్డలను సాగు చేయడానికి అమెరికాలోని 20 రాష్ట్రాలలో దాదాపు 3 లక్షల ఎకరాల భూమిని బిల్ గేట్స్ కొనుగోలు చేశారు. ఈ భూమిలో కేవలం ఆలుగడ్డను మాత్రమే సాగు చేస్తున్నారు. తద్వారా పదివేల మందికి ఉపాధిని కల్పిస్తున్నారు. మెక్ డొనాల్డ్స్ కంపెనీ బార్బంక్ రకమైన ఆలుగడ్డలను ఎంచుకోవడానికి ప్రధాన కారణం.. భూమి నుంచి బయటకు తీసిన తర్వాత ఆ ఆలుగడ్డలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.. మూడు లక్షల ఎకరాల్లో కేవలం ఆలుగడ్డను మాత్రమే సాగు చేసి.. వాటిని మెక్ డోనాల్డ్స్ కంపెనీకి అందించడానికి బిల్ గేట్స్ ఒప్పందం కుదుర్చుకున్నారు.. ఆలుగడ్డల పంటకాలం పూర్తయిన తర్వాత క్యారెట్, సోయాబీన్, వరి, ఉల్లి, మొక్కజొన్న వంటి పంటలను బిల్గేట్స్ సాగు చేస్తారు. అవి పూర్తయిన తర్వాత రసెట్ రకం అనే బంగాళదుంపలను సాగు చేస్తారు.. అయితే ఆగ్రో స్టార్టప్ ద్వారా ఈ భూముల్లో మూడు పంటలు పండుతాయి. మెక్ డోనాల్డ్స్ కంపెనీకి 35 లక్షల టన్నుల ఆలుగడ్డలను బిల్ గేట్స్ అందిస్తారు.. అయితే ఈ పంటను మొత్తం సేంద్రియ విధానంలో మాత్రమే బిల్ గేట్స్ పండిస్తారు.
రైతులకు అండగా
రైతులకు అండగా ఉండడానికే బిల్ గేట్స్ ఇంత స్థాయిలో భూములను కొనుగోలు చేశారని తెలుస్తోంది. అదే కాదు మేలు రకమైన వంగడాలను తయారుచేసి ఆఫ్రికా లాంటి పేద దేశాలకు బిల్గేట్స్ పంపిస్తున్నారు. అంతేకాదు పెట్టుబడి కోసం రైతులకు వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడం మొదలుపెట్టారు. విటమిన్ ఏ సమృద్ధిగా ఉండే పోర్టి ఫైడ్ రైస్ ను పేదలకు అందిస్తున్నారు. ఇవే కాక వచ్చే రోజుల్లో వరి , బంగాళదుంప, క్యారెట్, బీన్స్, ఉల్లి, మొక్కజొన్న వంటి పంటల్లో మెరుగైన వంగడాలను సృష్టించి రైతులకు ఇవ్వాలని గేట్స్ భావిస్తున్నారు. దీనికిగాను ఆత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ప్రయోగ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ పంటలపై ప్రయోగాలు జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో మేలు రకమైన వంగడాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత రైతులకు అందిస్తామని బిల్ గేట్స్ వ్యవసాయ వ్యవహారాలు చూసే సిబ్బంది చెబుతున్నారు. ” ప్రయోగాలు తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే రైతులకు మేలు రకమైన వంగడాలు అందుబాటులోకి వస్తాయి. వాటి ద్వారా మరింత సమృద్ధికరమైన ఆహార ఉత్పత్తిని సాధించాలనేది గేట్స్ లక్ష్యం. ఆ దిశగానే అడుగులు పడుతున్నాయని” బిల్ గేట్స్ వ్యవసాయ వ్యవహారాలు చూసే సిబ్బంది చెబుతున్నారు.