Best Countries in the World: ఏటా ప్రపంచంలో కొన్ని అంశాల ఆధారంగా దేశాల ర్యాంకులు, పేదరికం స్థాయి, ఆర్థిక పరిస్థితి, అక్షరాస్యత విభాగాల్లో ర్యాంకులు ఇవ్వడం చూశాం. తక్కువ స్థాయిలో ఉన్న దేశాలు ఎలా మెరుగు పర్చుకోవాల్సిన అంశాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు తరతరాలకు సరిపడా సంపదను కూడబెట్టే అత్యుత్తమ దేశాల జాబితా వెల్లడైంది. అందులో ఉత్తమ దేశం ఏది.. మన దేశం ఏ స్థానంలో ఉందో తెలుసుకుందాం.
సందపలో ఇవి కీలకం..
నిజానికి సంపాదన సంభావ్యత, కెరీర్లో పురోగతి, ఉపాధి అవకాశాలు, ప్రీమియం విద్య, ఆర్థిక చలనశీలత, జీవనోపాధి వంటి ఆరు భిన్న అంశాల ఆధారంగా ఆయా దేశాల తరతరాల సంపదను అంచనా వేస్తారు. తాజాగా ఈ విషయాల ఆధారంగా జాబితా వచ్చింది. పౌర సలహాసంస్థ హెన్లీ అండ్ పార్ట్నర్స్ ఈ ఫలితాలు ప్రకటించింది. ఈ కొత్త సూచీ ప్రకారం మొత్తం పరిమితుల్లో సుమారు 85 శాతం స్కోర్‌తో స్విట్జర్లాండ్ అత్యుత్తమ స్థానం దక్కించుకుని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచింది. సంపాదన సంభావ్యతలో(100), కెరీర్ పురోగతిలో(93), ఉపాధి అవకాశాల్లో (94) పాయింట్లతో స్విట్జర్లాండ్ బెస్ట్ ర్యాంకు సాధించింది. జీవన శైలి, ఆర్థిక చలనశీలతలో కూడా 74 శాంత పాయింట్లు సాధించింది. ప్రీమియం విద్యలో 73 మార్కులు స్కోర్ చేసింది.
రెండో స్థానంలో అమెరికా..
ఇక అన్ని విభాగాల్లో 82 శాతం స్కోర్‌తో అగ్రరాజ్యం అమెరికా రెండో స్థానంలో నిలిచింది. ఉపాధి అవకాశాల పరంగా యూఎస్ స్విట్జర్లాండ్‌తో సమానంగా 94 పాయింట్లు సాధించింది. కానీ సంపాదన సంభావ్యతలో(93), కెరీర్ పురోగతిలో (86), అధిక జీవనోపాధిలో (68)తో వెనుకబడింది. ఇక ఉపాధి అవకాశాలు, ప్రీమియం విద్యలో 74 మార్కులు సాధించింది.
మిగతా ర్యాంకులు..
ఇక తర్వాతి స్థానాలు చూస్తే.. సింగపూర్ 79 శాతంతో మూడో స్థానంలో ఉండగా, అత్యధిక ఉపాధి అవకాశాల పరంగా మిగతా 15 దేశౠలకంటే ఎక్కువ పాయింట్లు సాధించింది. ఆస్ట్రేలియా 75 శాతం స్కోర్‌తో నాలుగో స్థానంలో ఉంది. కెనడా 74 శాతం తో ఐదో స్థానంంలో ఉండగా, గ్రీస్ 49 శాతంతో 15 దేశాల జాబితాలో లాస్ట్‌లో ఉంది.
మన స్థానం ఎక్కడంటే..
ఇక తరతరాలకు సరిపడే సంపదలో భారత దేశం అన్ని పారమితుల్లో కలిపి సుమారు 32 శాతం స్కోర్‌తో చివరి స్థానంలో ఉంది. ఇది గ్రీస్‌తో పోలిస్తే తక్కువ. అలాగే జాబితాలో మొదటి 15 స్థానాల్లో భారత్ చివరి స్థానానికి పరిమితమైంది. ఆర్థిక చలనశీలతలో కేవలం 8 పాయింట్లతో అత్యల్ప స్కోర్ నమోదు చేసింది. ఇతర పారామితుల్లో 43 పాయింట్లతో అత్యధిక పురోగతి కలిగి ఉంది.