Viral News: కొన్ని సార్లు చాలా వింత వింత సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఇక దేవుని గుడి వద్ద కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం చాలా కామన్. కానీ ఆ సంఘటనలు చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఇంతకీ ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్ ఏంటి అనుకుంటున్నారా? తమిళనాడులో ఒక భక్తుడు రాసిన లేఖ ప్రస్తుతం వైరల్ గా మారింది. అందులో ఏం ఉందంటే..
తమిళనాడులో ఒక భక్తుడు దేవుడి వద్ద వింత కోరిక కోరాడు. కానీ ఆ కోరికను దేవుడి ముందు మోకరిల్లి, చేతులు జోడించి అడగలేదు. కానీ అదే దేవుడి హుండీలో ఓ లేఖ రాసి చెప్పాడు. ఇంతకీ అందులో ఏముంది అనుకుంటున్నారా? తన అప్పు తీర్చాలంటూ దేవుడికి లేఖ రాశాడు భక్తుడు. అదే లేఖను హుండీ లెక్కింపులో చూసి చాలా ఆశ్చర్యపోయారు సిబ్బంది. ఈ సంఘటన తమిళనాడులోని ధర్మపుడి కుమారస్వామి పేటలోని సుబ్రహ్మణ్య స్వామి గుడిలో చోటు చేసుకుంది. దీన్ని చూసిన సిబ్బంది షాక్ అయ్యారు.
అసలు విషయం ఏంటంటే.. తమిళనాడులోని కుమారస్వామి పేటలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఒక భక్తుడు తన అప్పు తీర్చమంటూ దేవుని వేడుకుంటూ లేఖ రాసి హుండీలో వేశాడు. ఆలయ సిబ్బంది ఆ హుండీలోని కానుకలను లెక్కించడం కోసం తెరవగా వారికి ఈ లేఖ కనిపించింది. వెంటనే దాన్ని తీసుకొని చూస్తే ఒక భక్తుడు తనకున్న అప్పులు వివరాలను ఆ లేఖలో రాసి వాటిని తీర్చాలని శ్లోకాలతో మరీ రాసాడట. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
భక్తుడు తనకు కోటి రూపాయల అప్పు ఉందని.. దాన్ని తీర్చాలని స్వామివారిని కోరుకున్నాడు. అందులో ఎవరికి ఎంత ఇవ్వాలో, గోల్డ్ లోన్, యూనియన్ లోన్, హౌస్ లోన్ అంటూ ఎన్ని అప్పులు ఉన్నాయో అన్నింటిని కూడా విడివిడిగా లేఖలో రాసుకొచ్చాడు. మొత్తం కలిపి కోటి రూపాయల అప్పుల సమస్యలు ఉన్నాయని దానిని దేవుడే పరిష్కరించాలని వేడుకున్నాడు. అయితే దీన్ని ఎవరు రాశారో ఇంకా తెలియలేదు. అయితే ఇది చదివిన వారు మాత్రం రకరకాలుగా స్పందిస్తున్నారు. దేవుడికి చెప్పి అప్పు చేశావా? ఆయనెందుకు తీరుస్తాడు అంటూ ప్రశ్నిస్తున్నారు కొందరు.