Israel Army: ప్రపంచంలో అత్యాధునిక సైన్యాల్లో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) ముందంజ. ఇక్కడ మహిళలు పురుషులతో సమానంగా పాల్గొంటారు, కానీ సోషల్ మీడియాలో ‘అందమైన అమ్మాయిలను మాత్రమే ఎంపిక చేస్తారు‘ అనే ఊహాగానం వ్యాప్తి చెందింది. ఈ భావనకు ఎలాంటి అధికారిక ఆధారాలు లేవు. ఇది యువత్వం, శిక్షణ, మీడియా ప్రభావంతో ఏర్పడిన భావన.
మహిళలకు సమాన అవకాశాలు
ఇజ్రాయెల్‌లో 18 ఏళ్లు పూర్తయిన మహిళలకు మిలిటరీ సేవ తప్పనిసరి. వీరు కనీసం 24 నెలలు, కొన్ని రంగాల్లో 30 నెలలు పనిచేస్తారు. 1948 నుంచి ఈ నియమం అమలులో ఉంది. చిన్నప్పటి నుంచే శారీరక, మానసిక శిక్షణలు ఇస్తారు. వీరు ఆయుధాలు, సైబర్ భద్రత, ఇంటెలిజెన్స్, ఇంజనీరింగ్ రంగాల్లో నైపుణ్యాలు సాధిస్తారు. అన్ని వాతావరణాల్లో పోరాటానికి సిద్ధంగా ఉంటారు. ఇది సమానత్వానికి చిహ్నం.
సోషల్ మీడియా ప్రభావం..
18–21 ఏళ్ల యువత్వంలో సహజ అందం, కఠిన ఫిజికల్ ట్రైనింగ్ వల్ల ఐడీఎఫ్ మహిళలు ఆకర్షణీయంగా కనిపిస్తారు. స్మార్ట్‌ఫోన్‌లతో యూనిఫాం ఫొటోలు షేర్ చేస్తారు. ఇన్‌స్ట్రాగామ్, టిక్‌టాక్‌లో వైరల్ అవ్వడం వల్ల ‘గ్లామరస్ ఆర్మీ‘ ఇమేజ్ ఏర్పడింది. సెలవు రోజుల్లో కూడా యూనిఫాం, ఆయుధాలతో ప్రయాణిస్తారు. ఇది సామాజిక మాధ్యమాల్లో ఆకర్షణ పెంచుతుంది.
సాఫ్ట్ పవర్ వ్యూహం?
ప్రత్యర్థులు ఇజ్రాయెల్ మహిళా సైనికుల గ్లామర్ ఇమేజ్‌ను సాఫ్ట్ పవర్ టూల్‌గా ఆరోపిస్తారు. ప్రజాస్వామ్య, స్వేచ్ఛా దేశంగా చిత్రీకరించుకోవడానికి ఉపయోగిస్తోందని. యుద్ధ క్రూరత్వాల నుంచి దృష్టి మళ్లించి, ఆర్మీని ‘కూల్‘గా చూపిస్తోందని సమాచారం. పాలస్తీనా సంఘర్షణల్లో ఈ ఫొటోలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తాయని విమర్శకులు చెబుతారు.
అయితే అందమైన అమ్మాయిలు అనే ప్రచారంలో వాస్తవం లేదు. ఎంపికలో అందం పరిగణన లేదు. మొదట్లో మహిళలు సహాయక పాత్రల్లో ఉండేవారు. ఇప్పుడు యుద్ధభూముల్లో పోరాడతారు. హమాస్ దాడుల్లో కీలక పాత్ర పోషించారు. కొందరు బందీలుగా మారారు, వారి ధైర్యం ప్రపంచానికి తెలిసింది. ఐడీఎఫ్ మహిళలు శక్తి, సమానత్వానికి చిహ్నాలు.