Chiranjeevi Vs Balayya: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా స్టార్ హీరోలు సినిమాలకు ఉన్న గుర్తింపు నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి… గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న నటుడు చిరంజీవి…ఇక ఆయనకు ఎప్పటికప్పుడు పోటీ ఇస్తూ ముందుకు దూసుకు వస్తున్న వాళ్లలో బాలయ్య ప్రథమ స్థానం లో ఉంటాడు… వీళ్ళిద్దరి సినిమాల మధ్య చాలా సంవత్సరాల నుంచి పోటీ నడుస్తున్న విషయం మనకు తెలిసిందే… ఇక ప్రస్తుతం బాలయ్య బాబు ‘అఖండ 2’ సినిమా రిలీజ్ అయింది. అలాగే సంక్రాంతికి చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో అఖండ 2 సినిమా ప్లాప్ టాక్ ను సంపాదించుకుంది. మన శంకర వరప్రసాద్ మాత్రం సక్సెస్ ఫుల్ టాక్ తో ముందుకు దూసుకెళ్తుంది. ఇక చిరంజీవి సినిమాను టార్గెట్ చేస్తూ బాలయ్య బాబు అభిమానులు, బాలయ్య సినిమాను ఉద్దేశించి చిరంజీవి అభిమానులు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.
ఇక అఖండ సినిమాలో ఏం మిస్సైంది. అంత పర్ఫెక్ట్ గానే ఉంది కదా అంటూ బాలయ్య అభిమానులు కామెంట్స్ చేస్తుంటే, మన శంకర వరప్రసాద్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ లుక్ లో అదరగొట్టాడు అంటూ వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు…రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ జరుగుతుంది. ఇక ఈ విషయం మీద సగటు ప్రేక్షకులు సైతం కామెంట్స్ చేస్తున్నారు.
జెన్యూన్ గా చెప్పాలంటే అఖండ 2 సినిమా అంత పర్ఫెక్ట్ గా లేదని అందువల్లే ఆ సినిమా ప్లాప్ అయిందని మన శంకర వరప్రసాద్ సినిమా పండగ సినిమా అని కమర్షియల్ హంగులతో వచ్చిన ఈ సినిమా సగటు ప్రేక్షకులందరిని మెప్పించిందనే చెప్పాలి.
ఇక పండక్కి ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు…ఇక ఈ హీరోల మధ్య మొదలైన ఫ్యాన్ వార్ ఎక్కడ వరకు వెళ్తుంది…
నిజానికి సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ఏ హీరో సక్సెస్ సాధించిన అది ప్రేక్షకులందరు సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీకి దక్కుతున్న గౌరవం కాబట్టి అలా కాకుండా ఒక హీరో సినిమా ప్లాప్ అవ్వాలని ఇంకో హీరో అభిమానులు కోరుకోవడం సరైన పద్ధతి కాదంటూ పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…